
సాక్షి, మేడ్చల్ : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నివాసంలో పెళ్లి సందడి మొదలైంది. ఈటెల కూతురు డాక్టర్ నీత వివాహం శుక్రవారం మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామ పరిధిలోని తన నివాసం వద్ద నిర్వహిస్తుండడంతో సందడి నెలకొంది. వరుడు కూడా డాక్టరే. మంత్రి ఈటల పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా పలువురు నాయకులు సైతం మంత్రి నివాసానికి వెళ్లి పనుల్లో బిజీగా మారారు. గురువారం మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి ఈటల నివాసానికి వెళ్లి మంత్రితో కలిసి పెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. కాగా మంత్రి ఈటల కుమారుడు నితిన్‌కు కూడా రెండేళ్ల కిత్రమె వివాహం అయింది.
Comments
Please login to add a commentAdd a comment