Published
Sun, Aug 7 2016 8:13 PM
| Last Updated on Mon, Sep 17 2018 7:44 PM
యువతను విస్మరించారు
చండూరు : కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చేందుకు యువతకు మాయమాటలు చెప్పి నట్టేట ముంచారని సీపీఐ (ఎంల్) న్యూడెమోక్రసీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యుడు కే. గోవర్ధన్ అన్నారు. మండల పరిధిలోని గట్టుప్పలలో నిర్వహిస్తున్న ప్రగతి శీల యువజన సంఘం రాష్ట్ర రాజకీయ తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేడు ఆ ఊసే ఎత్తకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ మాటలకు కేసీఆర్ చేతలకు జనం బేజారు అవుతున్నారన్నారు. యువత చైతన్యవంతులై ప్రభుత్వాలపై తిరుగుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పీవైఎల్ రాష్ట ఉపాధ్యక్షుడు జిట్టబోయిన యాకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఓయూ అసిస్టెంట్ ప్రోఫెసర్ ఉపేందర్, పీవైఎల్ రాష్ట అధ్యక్షుడు యాదయ్య, ఎలకంటి రాజేందర్, అశోక్, రమేష్, మోతీలాల్, మల్లేశ్, సిద్ధేశ్వర్, నాగరాజు, దాసు తదితరులు ఉన్నారు.