Published
Thu, Aug 4 2016 10:08 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
దేవాలయ భూములను విక్రయిస్తే చర్యలు
చండూరు : చండూరులోని సీతారామచంద్ర స్వామి దేవాలయానికి చెందిన భూములను అమ్మినా, కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం ‘సాక్షి’లో ఆలయ భూములు..హారతి కర్పూరం అనే కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎమ్మెల్యే గురువారం విక్రయాలు జరిగిన రెండు ఎకరాల ఆలయ భూమిని ఆయన అధికారులతో, ఎండోమెంట్ ఈఓ çసులోచనతో కలిసి పరిశీలించారు. ఆలయ భూమికి చుట్టు ఉన్న కంప చెట్లను తొలగించేందుకు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆలయ పూజారి నుంచి విక్రయించిన రియల్టర్ల నుంచి తిరిగి ఆలయానికి ఆ భూమి చెందే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ తోకల వెంకన్న, రైతు సేవా సహకార సంఘం ౖచెర్మన్ బొబ్బల శ్రీనివాస్ రెడ్డి, అన్నెపర్తి శేఖర్, దేవాలయం భూదాత కుంభం రాజు వెంకటేశ్వర్ రావు, నామని గోపాల్, మాస క్రిష్ణ, రెవెన్యూ అధికారులు సరిత, క్రిష్ణ, రామక్రిష్ణ తదితరులు ఉన్నారు.