
వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి
చండూరు : స్వామి వివేకానందుడి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్సీ రామచందర్ రావు పిలుపు నిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని గట్టుప్పలలో స్వామి వివేకానంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.