Vivekanada
-
సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సహాయమంత్రి: ఎమ్మెల్యే వివేకానంద
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ సహాయమంత్రిలా తయారయ్యాడని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత వివేకానంద ఎద్దేవా చేశారు. తాజాగా రేవంత్, బండిసంజయ్ బంధం మరోసారి బయటపడిందన్నారు. అనుమతి లేకుండా పోలీసులు కేటీఆర్ బావమరిదికి చెందిన జన్వాడ ఫాంహౌజ్‌లో సోదా చేయడంపై వివేకానంద ఆదివారం(అక్టోబర్ 27) స్పందించారు.‘రాజ్ పాకాల పార్టీలో కేటీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. రాజ్‌పాకాల ఇంట్లో గెట్ టు గెదర్ పార్టీ చేసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారంట్ లేకుండా ఇంట్లోకి వెళ్లారు. అక్కడ జరిగింది ప్రైవేట్ పార్టీ. లిక్కర్ ఎవరి ఇంట్లో ఉండదు. సీఎం, మంత్రుల ఇళ్లలో ఉండదా? తెలంగాణలో సంప్రదాయం ప్రతి ఇంట్లో లిక్కర్ ఉంటుంది. రేవంత్ చేతిలో అధికారులు కీలు బొమ్మలయ్యారు. ఇప్పుడు ఓవర్‌యాక్షన్ చేస్తున్న అధికారులు రిటైర్ అయినా సరే మేం అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టం’అని వివేకానంద హెచ్చరించారు. ఇదీ చదవండి: కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌజ్‌లో రేవ్‌పార్టీ భగ్నం -
వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి
చండూరు : స్వామి వివేకానందుడి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్సీ రామచందర్ రావు పిలుపు నిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని గట్టుప్పలలో స్వామి వివేకానంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభనుద్దేశించి మాట్లాడారు. వివేకానందుడు ఓ గొప్ప మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ప్రతి యువకుడికి దేశ భక్తిపై గౌరవం ఉండాలన్నారు. దేశంలో అత్యధికంగా యువత ఉందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. రానున్న కాలంలో బీజేపీకి తిరుగు లేని విజయం ఖాయమన్నారు. కార్యకర్తలు పార్టీ బలోపేతం నడుం బిగించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి, పార్టి రాష్ట కోశా«ధికారి డాక్టర్ మనోహార్ రెడ్డి, స్థానిక సర్పంచ్ నామని జగన్నాథం, రావిరాల శ్రీను, చిల్కూరి అశోక్, శివకుమార్, నన్నూరి రాంరెడ్డి, యాస అమరేందర్ రెడ్డి, గంజి క్రిష్ణయ్య, సోమ నర్సింహ, కోమటి వీరేశం, కర్నాటి శ్రీను, అమరేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు. -
రూ. 1.3 కోట్ల అప్పు వివాదంలో ముఖ్యమంత్రి!
బెంగళూరు: గత కొద్దిరోజులుగా తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఇబ్బందుల పాలవుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరు టర్ఫ్ క్లబ్(బీటీసీ) కు స్టివార్డ్‌గా ఓ వ్యాపారవేత్తను ఆయన నామినేట్ చేయడం వివాదంగా మారింది. అతనితో సిద్దరామయ్యకు గతంలో లావాదేవీలు ఉన్నాయని, అందుకు ప్రతిఫలంగానే పదవిని కట్టబెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సామాజిక కార్యకర్త ఎస్ భాస్కరన్ కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ను కోరారు. నామినేషన్ వేసిన ఎల్ వివేకానందతో సీఎం సిద్దరామయ్యకు రూ.1.3 కోట్ల రుణ లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ఎల్ వివేకానందను బీటీసీ కమిటీ స్టివార్డ్‌గా ప్రభుత్వం తరఫు నుంచి నామినేట్ కావడాన్ని తాను ఒక పౌరుడిగా ప్రశ్నిస్తున్నానని భాస్కరన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది జరిగిన కొద్ది నెలలకే వివేకానంద నుంచి సీఎం సిద్దరామయ్య రూ.1.3 కోట్ల రుణం తీసుకున్నారని, అందుకు సంబంధించిన పత్రాలను పిటిషన్‌కు జతచేస్తూ ఆయన గవర్నర్ కు పంపారు. ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు లేదా ఏదేనీ ఇతర లావాదేవీల కోసం తన అధికారాన్ని దర్వినియోగం చేయకూడదని నిబంధనల్లో ఉందనీ.. కానీ, సీఎం వాటిని ఉల్లఘించినట్లు ప్రస్తావించారు. మే 2013 నుంచి టర్ఫ్ క్లబ్ కమిటీ విషయాలను ఆర్టీఐ ద్వారా స్వీకరించినట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై స్పందించిన వివేకానంద తాను టర్ఫ్ క్లబ్ లో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నానని చెప్పారు. సీఎంతో ఆర్ధిక లావాదేవీలు పెట్టుకున్నాననే వార్తలు అవాస్తవమని ఆయన అన్నారు. గత ఏడాది తన స్నేహితుడు (సీఎం) చెక్ తీసుకున్నారని, త్వరలోనే వాటిని తిరిగి ఇచ్చేస్తారని వివరించారు. గతంలో తాను రెండేళ్ల పాటు మైసూర్ రేస్ క్లబ్ కు చైర్మన్ గా వ్యవహరించానని, బీటీసీలో మెంబర్ గా ఉన్నానని తెలిపారు. తనను బీటీసీ స్టివార్డ్‌గా నామినేట్ చేయడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు.