చండూరు (నల్లగొండ) : మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగింది. పాఠశాలలో ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజనాన్ని తిన్న విద్యార్థులు వాంతులు చేసుకుంటుండటంతో అధ్యాపకులు విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.