
కూసుకుంట్లకు గొర్రెపిల్లను బహూకరిస్తున్న నాయకులు
సాక్షి, చండూరు/మునుగోడు: నియోజకవర్గంలోని చం డూరులో కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఎన్నికలో మరో పది రోజుల్లో ఉండడంతో సభ నూతనోత్తేజాన్ని నింపినట్లయింది. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండడం పార్టీ నేతల్లో మరింత ధైర్యం నెలకొంది. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ సాగిన ఆయన ప్రసంగంతో మహిళలు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
భారీగా తరలి వచ్చిన జనం:
నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ప్ర జా ఆశీర్వాద సభకు ప్రజలు భారీగా తరలి వ చ్చారు. సభా ప్రాంగణం జనంతో నిం?పోయింది. గ ట్టుప్పల మండలం ప్రకటిస్తామని హామీ ఇవ్వడం, లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ తమ జాతకం మారబోతుందని పేర్కొంటున్నారు.

కోలాటం వేస్తున్న మహిళలు

నృత్యం చేస్తున్న గిరిజన మహిళలు

డోలు వాయిస్తున్న గొల్ల కురుమలు