Munugodu Assembly Constituency
-
మునుగోడు బీజేపీ టికెట్ దక్కేదెవరికో?
సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఆలేరు, మునుగోడు, నకిరేకల్ బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి జాబితాలో భువనగిరి, తుంగతుర్తి అభ్యర్థుల పేర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రెండో జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర జిల్లా కేడర్‌లో జోష్ నింపింది. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికతో పార్టీలో మరింత జోష్ పెరిగింది. వీటితో పాటు పార్టీ విస్తృతంగా చేపట్టిన కార్యక్రమాలతోనూ ప్రజ ల్లో ఆదరణపెరిగింది. దీంతో ఆశావహులు టికెట్ కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వివిధ సంస్థలు చేసిన సర్వేల ఆధారంగా భువనగిరి, తుంగతుర్తి టికెట్లు ప్రకటించిన అధి ష్టానం.. ఆలేరు, మునుగోడు, నకిరేకల్‌ను పెండింగ్‌లో పెట్టింది. భువనగిరి నుంచి గూడూరు నారాయణరెడ్డి, తుంగతుర్తి నుంచి కడియం రామచంద్రయ్య పేర్లను ఖరారు చేసింది. అందరి దృష్టి మునుగోడుపైనే.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మునుగోడు టికెట్ ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తొలి జాబితాలోనే రాజగోపాల్‌రెడ్డి పేరు వస్తుందని బీజేపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆశించారు. కానీ, ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో చేరతారని కొంతకాలంగా జరుగుతున్న చర్చకు ఎట్టకేలకు రాజగోపాల్‌రెడ్డి తెరదించారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీకీ లేదని, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయంగా కన్పిస్తుందని భావించి తన రాజీనామా ప్రకటనలో పేర్కొన్నారు. ఆలేరు నుంచి ఐదుగురు ప్రయత్నం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అభ్యర్థిగా దొంతిరి శ్రీధర్‌రెడ్డి పేరును తొలి విడతలోనే ప్రకటించారు. ఈసారి భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను పోటీ చేయాలని పార్టీ అధిష్టానం కోరినప్పటికీ ఆయన తిరస్కరించారు. ప్రస్తుతం పడాల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్, సూదగాని హరిశంకర్‌గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, పల్లెపాటి సత్యనారాయణలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా ఢిల్లీస్థాయిలో ప్రయత్నాలు సాగి స్తున్నారు. వీరిలో కాసం వెంకటేశ్వర్లు 2009, 2014లో ఆలేరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నకిరేకల్‌లో భువనగిరికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి పోటీ చేసి పరాజయంపాలయ్యారు. బూర నర్సయ్యగౌడ్‌పై అధిష్టానం ఆసక్తి రాజగోపాల్‌రెడ్డి బీజేపీని వీడడంతో మునుగోడు నుంచి ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేయనున్నారనే చర్చకు తెరలేచింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను బరిలోకి దించేందుకు బీజేపీ అధిష్టానం పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. అయితే బూర నర్స య్యగౌడ్ మాత్రం ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి 2018లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన గంగిడి మనోహర్‌రెడ్డికి టికెట్ వస్తుందని బీజేపీలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. -
మునుగోడు నియోజకవర్గ చరిత్రను ఎవరు తిరగరాస్తారు..?
మునుగోడు నియోజకవర్గం మునుగోడులో కాంగ్రెస్ ఐ పార్టీ అభ్యర్దిగా పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాదించారు. 2009లో ఆయన ఎంపిగా గెలిచారు. 2014లో ఓటమి చెందినా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. తిరిగి ఈసారి మునుగోడు నుంచి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాదించారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్ది కె. ప్రభాకరరెడ్డిపై 22552 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 97239 ఓట్లు రాగా, ప్రభా కరరెడ్డికి 74687 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.మనోహర్‌రెడ్డికి 12700 ఓట్లు వచ్చాయి. రాజగోపాలరెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి కె.ప్రబాకరరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతిని 38055 ఓట్ల తేడాతో ఓడిరచారు. స్రవంతి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో పాల్వాయి గోవర్దనరెడ్డి పోటీచేసి ఓటమి పాలైతే, 2014లో ఆయన కుమార్తె ఓడిపోవలసి వచ్చింది. అయితే పాల్వాయి 2009లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ఐ పార్టీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది. 2014లో కాంగ్రెస్ పార్టీ ,సిపిఐతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. సిపిఐ పోటీచేసినా సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయింది.సిపిఐ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డికి 20952 ఓట్లు వచ్చాయి. సీనియర్ సిపిఐ నాయకుడు ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలుపొందితే, ఆయన కుమారుడు యాదగిరిరావు ఒకసారి గెలుపొందారు, పాల్వాయి గోవర్ధనరెడ్డి మునుగోడులో ఐదుసార్లు గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు.ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈయన గతంలోమంత్రి పదవి నిర్వహించారు. మునుగోడులో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, సిపిఐ ఐదుసార్లు గెలిచాయి. టిఆర్ఎస్ ఒకసారి గెలిచింది. స్వయంగా టిడిపి ఇక్కడ నుంచి గెలవలేదు.సిపిఐ మిత్ర పక్షంగా ఉన్నప్పుడు బలపరిచింది. మునుగోడులో తొమ్మిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసి(పద్మశాలి)నాలుగుసార్లు వెలమ, ఒకసారి ఇతరులు గెలుపొందారు. మునుగోడు నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మునుగోడు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : పాల్వాయి స్రవంతి
-
మునుగోడు వార్...
-
మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది : భట్టి విక్రమార్క
-
మునుగోడు ఉపఎన్నికపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నల్గొండ టీఆర్ఎస్కు కంచుకోట అని, మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం మాదేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సందర్భంగా దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హై స్కూల్లో వన మహోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో మా ఎమ్మెల్యే లేకున్నా అభివృద్ధి ఆగలేదు. బిహార్ రాజకీయాలను యావత్ దేశం గమనిస్తోంది. బీజేపీ బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. మునుగోడు ఉప ఎన్నిక ఇలాంటి వాటికి సమాధానం చెప్తుంది. నాగార్జున సాగర్, హుజుర్ నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హేమహేమీలను ఓడగొట్టింది అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చదవండి: (కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న పాల్వాయి స్రవంతి ఆడియో) -
కేసీఆర్ సభతో పార్టీ శ్రేణుల్లో జోష్
సాక్షి, చండూరు/మునుగోడు: నియోజకవర్గంలోని చం డూరులో కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఎన్నికలో మరో పది రోజుల్లో ఉండడంతో సభ నూతనోత్తేజాన్ని నింపినట్లయింది. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండడం పార్టీ నేతల్లో మరింత ధైర్యం నెలకొంది. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ సాగిన ఆయన ప్రసంగంతో మహిళలు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. భారీగా తరలి వచ్చిన జనం: నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ప్ర జా ఆశీర్వాద సభకు ప్రజలు భారీగా తరలి వ చ్చారు. సభా ప్రాంగణం జనంతో నిం?పోయింది. గ ట్టుప్పల మండలం ప్రకటిస్తామని హామీ ఇవ్వడం, లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ తమ జాతకం మారబోతుందని పేర్కొంటున్నారు. మరిన్ని వార్తాలు... -
కేసీఆర్ గద్దె దిగక తప్పదు
సాక్షి, మునుగోడు : గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా విస్మరించిన సీఎం కేసీఆర్ గద్దె దిగక తప్పదని బీజేపీ మునుగోడు అసెంబ్లీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని కిష్టాపురం, ఇప్పర్తి, పలివెల, కోతులారం తదితర గ్రామాలల్లో మంగళవారం తన కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు,, దళితులకు మూడు ఎకరాల భూమి, ప్రతి ఇంటికి ఉద్యోగం, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు, కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్య అందిస్తానని వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. హామీలను విస్మరించిన ఆ పార్టీ నాయకులకు నేడు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. తన కుటుంబాన్ని తప్పా రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోని కేసీఆర్‌కు తగిన బుద్ధిచెప్పాలని అన్నారు. దేశంలోని పేదరిక నిర్మూలనకు నిత్యం శ్రమిస్తున్న బీజేపీని గెలిపించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. వ్యాపారాలు తప్పా రాజకీయాలు తెలియని మహాకూటమి అభ్యర్థి సంతలో గొర్రెలను కొనుగోలు చేసినట్లు నాయకులను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. గతంలో ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి చేశాడో తెలియచేయాలని డిమాండ్ చేశారు. సినిమా డైలాగులతో ప్రజలని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. కానీ ప్రజలు ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు. అధికార పార్టీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థికి కమీషన్లు తప్పా ప్రజల సమస్యలు పట్టవన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబాటుకు గురైన మునుగోడును ఏ పార్టీ ప్రజా ప్రతినిధి పట్టించుకోలేదన్నారు. కనీసం ప్రభుత్వ కళాశాలలు, ఆసుపత్రులు, ప్రతి గ్రామానికి సరైన రోడ్ల సౌకర్యం ఏర్పాటు చేయించలేని ఆ ఇరువురు నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మంచుకొండ రాంమూర్తి, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వేదాంతం గోపినాథ్, మండల అధ్యక్షుడు బొడిగే అశోక్‌గౌడ్, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సోమ నర్సింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దూడల భిక్షంగౌడ్, రాష్ట్ర నాయకుడు భవనం మధుసూదన్‌రెడ్డి, నాయకులు నకిరకంటి నర్సింహ్మగౌడ్, బొల్గూరి రమేష్, కంభంపాటి నర్సింహ, దుబ్బ జెల్లయ్య, మాదగోని నరేందర్‌గౌడ్, గజ్జల బాలరాజుగౌడ్, నీరుడు రాజారాం, ఎర్రబెల్లి శంకర్‌రెడ్డి, సతీష్ పాల్గొన్నారు. అదే విధంగా ఇప్పర్తి శివాలయంలో పూజలు చేశారు. -
పోలింగ్‌కు..యంత్రాలు సిద్ధం
సాక్షి,నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు ఓటింగ్ యంత్రాల ర్యాండమైజేషన్ (మిక్సింగ్) మొదటి విడత పూర్తి చేశారు. పోలింగ్‌లో ఉపయోగించే బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లకు మూడు విడతల్లో ర్యాండమైజేషన్ చేయాల్సి ఉంది. బెల్ కంపెనీకి సంబంధించిన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను గోదాముల్లోనే ఉంచి రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించారు. అనంతరం గట్టి బం దోబస్తుతో భద్రపర్చారు. ఆ యంత్రాలకు సం బంధించి ఆన్లైన్లో నంబర్లను అన్నింటినీ ర్యాం డమైజేషన్ చేశారు. ఆ విధంగానే ఓ బాక్స్‌లోని 10 యంత్రాలను మార్చివేరే బాక్స్‌లలోకి మార్చారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా యంత్రాలను సిద్ధం చేసి పెట్టారు. ఒక్కో బాక్సులో 10 ఓటింగ్యంత్రాలు ఉంటాయి. అందులో ఏ నియోజకవర్గానికి సంబంధించిన యంత్రం ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. ఆ విధంగా మొదటి విడత ర్యాండమైజేషన్ చేశారు. ఆయా బాక్సుల్లో ఉన్నవాటన్నింటినీ బార్కోడ్ ఆధారంగా ఆయా నియోజకవర్గాలకు కేటాయిస్తారు. అనంతరం వాటిని నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరుస్తారు. అక్కడ రెండో విడత ర్యాండమైజేషన్ జరుగుతుంది. ఆ సందర్భంలో ఏయే యంత్రం ఎక్కడ వెళ్తుందో కూడా ఎన్నికల సిబ్బందికి తెలిసే అవకాశం లేదు. ఆ విధంగా అధికారులు ఆన్లైన్లో యంత్రాల బార్ కోడ్ఆధారంగా రాజకీయ పక్షాల ముందే మిక్సింగ్ చేస్తారు. ఆ తర్వాత తిరిగి పోలింగ్‌ముందు రోజు డ్రిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ర్యాండమైజేషన్ చేసి ఏ పోలింగ్ బూత్‌కు ఏ ఈవీఎం, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ వెళ్లాల్సి ఉందో ఆ విధంగా ఆయా పోలింగ్‌బూత్‌లకు కేటాయించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులకు అందిస్తారు. అక్కడినుంచి నేరుగా ఎన్నికల విధులలో భాగంగా పోలింగ్ స్టేషన్లకు తీసుకెళ్తారు. అప్పటివరకు కూడా ఏ యంత్రం ఎటు వెళ్తుందో కూడా తెలియనివ్వరు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ యంత్రాల కేటాయింపు : దేవరకొండ 338 నాగార్జునసాగర్ 329 మిర్యాలగూడ 288 మునుగోడు 318 నకికరేకల్ 337 నల్లగొండ 316 18శాతం అదనంగా యంత్రాలు.. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న పోలింగ్‌బూత్‌లను బట్టి అదనంగా ప్రతి నియోజకవర్గానికి 18 శాతం యంత్రాలను అందిస్తున్నారు. అదనంగా తీసుకున్న వాటిని నియోజకవర్గ కేంద్రంలోని రిటర్నింగ్ కార్యాలయంలో ఉంచుతారు. పోలింగ్ సమయంలో ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తి ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడితే వీటిని ఉపయోగించనున్నారు. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరి«ధిలో అదే విధంగా ఉపయోగిస్తారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్‌లు, యంత్రాలు... దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి 286 పోలింగ్‌బూత్‌లు ఉండగా 18శాతం అదనంగా కలుపుకుంటే అదనంగా మరో 52 యంత్రాలు ఇవ్వనున్నారు. అంటే ఆ నియోజకవర్గానికి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్యూనిట్లు, వీవీ ప్యాట్లు 338 అందనున్నాయి. అదే విధంగా నాగార్జున్ సాగర్ నియోజకవర్గంలో 278 పోలింగ్‌బూత్‌లు ఉండగా 18శాతం కలుపుకుంటే అదనంగా మరో 51 యంత్రాలు ఇవ్వనున్నారు. దీంతో 329 యంత్రాలు సాగర్ నియోజకవర్గానికి అందనున్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలో 244 పోలింగ్‌బూత్‌లు ఉండగా అదనంగా 44 యంత్రాలు ఇవ్వనున్నారు. దీంతో 288 యంత్రాలు సాగర్ నియోజకవర్గానికి అందనున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో 269 పోలింగ్‌బూత్‌లు ఉండగా 49కలుపుకొని మొత్తం 318 యంత్రాలు కేటాయించారు. నకికరేకల్లో నియోజకవర్గంలో 285 పోలింగ్‌బూత్‌లు ఉండగా 337 యంత్రాలు కేటాయించారు. నల్లగొండ నియోజకవర్గానికి సంబం«ధించి 267 పోలింగ్ స్టేషన్లకు 316 బ్యాలెట్, కంట్రోల్, వీవీ ప్యాట్లను కేటాయించారు. -
ఎవరు.. ఎక్కడ..?
సుదీర్ఘ కసరత్తు, ఆశావహుల వడబోత అనంతరం.. అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు ‘హస్తం’ సిద్ధమైంది. ఎవరెవరు ఎక్కడెక్కడినుంచి బరిలోకి దిగుతారో దాదాపు ఖరారైందని పార్టీ వర్గాల ద్వారా జరుగుతున్న సమాచారంతో అటు ఆశావహుల్లో, ఇటు కేడర్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భువనగిరి, ఆలేరు విషయంలో ఓ క్లారిటీ వచ్చిందని.. తుంగతుర్తి, మునుగోడు విషయంలోనూ తుది కసరత్తు చేసిన అధిష్టానం ఆశావహులను పిలిపించి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీలో తీవ్ర ఉత్కంఠను రేకిత్తిస్తుండగా అధికార టీఆర్ఎస్ ఆసక్తిగా చూస్తోంది. సాక్షి, యాదాద్రి : కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించేందుకు ముహూర్తం దగ్గర పడింది. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఆశావహుల బుజ్జగింపులతో వాయిదా పడుతూ వస్తున్న జాబితా శనివారం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా సైతం వెల్లడించడంతో ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేసిన అధిష్టానం.. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు ఆశావహులను ఢిల్లీలోని వార్ రూంకు పిలిపించి చర్చలు జరిపి బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఆలేరు, భువనగిరిపై క్లారిటీ..! కాంగ్రెస్ పార్టీ రేపు విడుదల చేయనున్న తొలి జాబితాలో 74మంది పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండగా యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించి క్లారిటీ వచ్చిన ట్లు తెలుస్తోంది. మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి ఆశావహులను ఢిల్లీకి పిలిపించి బుజ్జగిస్తున్నట్లు సమాచారం. కొనసాగుతున్న ఉత్కంఠ కాంగ్రెస్ కోర్ కమిటీ రూపొందించిన ఫైనల్ జాబి తాపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉం ది. పొత్తులో భాగంగా జిల్లా పరిధిలోని కొన్ని సీట్లను తమకు ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నా యి. ప్రధానంగా ఆలేరులో టీజేఎస్, మునుగోడు సీపీఐ కోరుతున్నాయి. ఇక్కడ ఏం జరుగబోతుందన్న టెన్షన్ ఆశావహుల్లో నెలకొంది. ఆలేరుకు భిక్షమయ్య..? ఆలేరు నియోజకవర్గానికి డీసీసీ అధ్యక్షుడు బూడి ద భిక్షమయ్యగౌడ్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇదే సీటును మహాకూటమిలోని టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు ఆశిస్తున్నాయి. తొలుత టీడీపీ, సీపీఐ ఆలేరు సీటుకోసం పట్టుబట్టాయి. కానీ ఆ తర్వాత టీపీఎస్ కన్వీనర్ కల్లూరి రామచంద్రారెడ్డి టీజేఎస్‌లో చేరికతో సమీకరణలు కొంత మారాయి. ఆ సీటు తమకే కేటాయించాలని ఆ పార్టీ అధినేత కోదండరాం పట్టు బడుతూవచ్చారు. కాగా భిక్షమయ్యగౌడ్ ఆలేరు టికెట్ తనదేనన్న గట్టి నమ్మకంతో ఎప్పటినుంచో ప్రచారం కొనసాగిస్తున్నారు. అలాగే తనకు టికెట్ కేటాయించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పల్లె శ్రీనివాస్‌గౌడ్ సైతం ఏఐసీసీ వరకు ప్రయత్నాలు చేశారు. వీరితో మరికొందరు టికెట్ కోసం ప్రయత్నాలు సాగించారు. అయితే ముందునుంచి ధీమాతో ఉన్న భిక్షమయ్యగౌడ్‌కు టికెట్ ఖరారైందన్న సంకేతాలు అందుతున్నాయి. భువనగిరినుంచి.. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంనుంచి కూటమి భాగస్వామ్య పక్షాలతో పాటు కాంగ్రెస్‌లోని బీసీ వర్గానికి చెందిన నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బీసీ నేతలు తమలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని అధిష్టానంపై ఇంకా ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ఇప్పటికే టీపీసీసీ నుంచి ఢిల్లీ వరకు చేయని ప్రయత్నమంటూ లేదు. పోత్నక్ ప్రమోద్‌కుమార్, పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్, పంజాలరామాంజనేయులు, తడక కల్పన, తంగళ్లపల్లి రవికుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అందెల లింగంయాదవ్, గర్దాసు బాలయ్య బీసీ సామాజిక వర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మరోవైపు యువతెలంగాణ పార్టీ తరఫున టీజేఎస్ నుంచి పోటీ చేయడానికి జిట్టా బాలకృష్ణారెడ్డి సైతం టికెట్ ఆశించారు. అయితే టికెట్ విషయంలో సానుకూలత రాలేదు. మునుగోడు.. మునుగోడు నియోజకవర్గంలో కూటమి తతరఫున కాంగ్రెస్, సీపీఐలు పట్టుబడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి స్రవంతిలు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే అధిష్టానం గురువారం పాల్వాయి స్రవంతిని ఢిల్లీ పిలిపించి వార్ రూమ్‌లో బుజ్జగింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకే టికెట్ వస్తుందని ప్రచారం ప్రారంభించారు. ఈ నియోజకవర్గంలో గతంలో సీపీఐ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా పోటీపడి గెలిచాయి. 2014 ఎన్నికలో ఒక్కసారే టీఆర్ఎస్నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కూటమిలో పొత్తులో సీటును తమకు కేటాయించాలని సీపీఐ కోరుతోంది. దీంతో ఈ సీటుపై పీఠముడి పడింది. టికెట్ పై నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేశారు. తుంగతుర్తిలో.. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రేసులో ఉన్న అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. ఇక్కడ దయాకర్‌తోపాటు డాక్టర్ రవికుమార్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే డాక్టర్ రవికుమార్‌కు టికెట్ ఖరారైందన్న ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే బుజ్జగింపుల కోసం దయాకర్‌ను ఢిల్లీ పిలిపించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. -
అభివృద్ధి కనిపించడం లేదా..?
సాక్షి,చండూరు: మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాలుగున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధి కనిపించకపోతే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాలని చండూరు ఎంపీపీ తోకల వెంకన్న ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సూచించారు. ఆయన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దగాని వెంకన్న గౌడ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాతపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. కూసుకుంట్లపై తప్పుడు వార్తలు రాయండి అనే పదం ఎంత వరకు సబబన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉండి నియోజకవర్గంలో ఏం చేశావ్ అని ప్రశ్నించారు. కల్లు తాగిన కోతిలాగా వ్యవహరించడం ఎంత వరకు సబబన్నారు. మరోసారి నోరు జారితే టీఆర్ఎస్ ఊరుకోదన్నారు. 60 ఏళ్లుగా జరగని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో జరిగిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఊహించని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలను సైతం కూసుకుంట్ల నెరవేర్చాడని అన్నారు. వెల్మకన్నె, శేషిలేటి వాగు, బెండలమ్మ చెర్వు పనులను ముందుకు తీసుకు వచ్చిన ఘనత ప్రభాకర్ రెడ్డిదేనని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. సమావేశంలో కోడి వెంకన్న, కళ్లెం సురేందర్ రెడ్డి, పందుల భిక్షం, స్వాతి, వెంకటేశ్, కొంపెల్లి వెంకటేశం పాల్గొన్నారు. -
'నా కూతురు నా మాట వినడం లేదు మహాప్రభో'
కరవ మంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి పరిస్థితి. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకోవాలని పాల్వాయి ... తన కుమార్తె స్రవంతికి సూచించారు. అందుకు ఆమె ససేమిరా అంది. ఇంకే చేస్తాంమంటూ పాపం పాల్వాయి దగ్గరుండి తన కుమార్తె చేత శనివారం నామినేషన్ దాఖలు చేయించారు. ఆ విషయం కాస్తా కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్‌కు తెలిసింది. అంతే పాల్వాయి గోవర్థన్పై జైరాం రమేష్ నిప్పులు తొక్కారు. నామినేషన్ ఉపసహంరింప చేయాలంటూ ఇంటికెళ్లి మరీ ఆదేశించారు. తన కుమార్తె తన మాట వినడం లేదు మహాప్రభో అంటూ పాల్వాయి గోవర్ధన్ కన్నీటీ పర్యంతమైయ్యారు. దాంతో జైరాం తిక్క రేగింది. కాంగ్రెస్ పార్టీ నిన్ను రాజ్యసభకు పంపిస్తే ఇంత పని చేస్తావా అంటూ పాల్వాయికి జైరాం తలంటాడు. అంతేకాకుండా కన్న కూతురుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని పాల్వాయిని జైరాం రమేష్ ఆదేశించారు. మునగొడు ఎమ్మెల్యే టికెట్ పాల్వాయి గోవర్థన్ రెడ్డి ... తన కుమార్తె స్రవంతికి కాంగ్రెస్ అధిష్టానం కేటాయిస్తుందని ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి ఆశలుపై నీళ్లు చల్లింది. ఇంకేముంది స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానని స్రవంతి తన తండ్రికి బల్లగుద్ది చెప్పింది. దాంతో పాల్వాయి తన కుమార్తె నామినేషన్ దగ్గరుండి మరీ వేయించారు.