అభివృద్ధి కనిపించడం లేదా..? | Trs MPP T. venkanna fires on MLC K. Rajagopal reddy | Sakshi
Sakshi News home page

అభివృద్ధి కనిపించడం లేదా..?

Published Fri, Nov 9 2018 12:00 PM | Last Updated on Fri, Nov 9 2018 12:00 PM

Trs MPP T. venkanna fires on MLC  K. Rajagopal reddy - Sakshi

మాట్లాడుతున్న ఎంపీపీ వెంకన్న

సాక్షి,చండూరు: మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి నాలుగున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధి కనిపించకపోతే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాలని చండూరు ఎంపీపీ తోకల వెంకన్న ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి సూచించారు. ఆయన టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెద్దగాని వెంకన్న గౌడ్‌ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాతపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. కూసుకుంట్లపై తప్పుడు వార్తలు రాయండి అనే పదం ఎంత వరకు సబబన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉండి నియోజకవర్గంలో ఏం చేశావ్‌ అని ప్రశ్నించారు. కల్లు తాగిన కోతిలాగా వ్యవహరించడం ఎంత వరకు సబబన్నారు. మరోసారి నోరు జారితే టీఆర్‌ఎస్‌ ఊరుకోదన్నారు. 60 ఏళ్లుగా జరగని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో జరిగిందని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఊహించని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలను సైతం కూసుకుంట్ల నెరవేర్చాడని అన్నారు. వెల్మకన్నె, శేషిలేటి వాగు, బెండలమ్మ చెర్వు పనులను ముందుకు తీసుకు వచ్చిన ఘనత ప్రభాకర్‌ రెడ్డిదేనని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. సమావేశంలో కోడి వెంకన్న, కళ్లెం సురేందర్‌ రెడ్డి, పందుల భిక్షం, స్వాతి, వెంకటేశ్, కొంపెల్లి వెంకటేశం పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement