canvassing
-
నందమూరు వెంకన్న.. నీవే దిక్కన్నా..
సాక్షి, తాడేపల్లిగూడెం: ఏడుకొండలవాడా.. వేంకటరమణా.. ఆపద్బాంధవా.. అనాథ రక్షకా.. గోవిందా.. గోవిందా.. అంటూ నందమూరు వెంకన్నకు నీరాజనాలు అర్పించకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ప్రచారానికి శ్రీకారం చుట్టరు. ఏ పార్టీ అభ్యర్థి అయినా మండలంలోని నందమూరు వెంకన్నను దర్శించుకుంటారు. స్వామి దర్శనం విజయం కలిగిస్తుందని ఆశావహుల విశ్వాసం. భౌగోళికంగా, వాస్తురీత్యా చూసినా నియోజకవర్గానికి ఈ గ్రామం తూర్పు దిశలో ఉంది. ఆలయ ప్రాంగణంలో సుమారు 300 వందల ఏళ్ల నాటి గన్నేరు పూల చెట్టు ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు, ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసే తాళపత్రాల గ్రంథాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు ఇక్కడి వారే. సత్తుపల్లికి మకాం మార్చినా స్వామిపై విశ్వాసంతో ఖమ్మం జిల్లానుంచి ఏటా ఒక్కసారైనా వచ్చి స్వామిని దర్శించుకునే వారు. అదే ఆనవాయితీని ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. రాజకీయంగా ఇది సెంటిమెంటుగా మారింది. ప్రచార పర్వంలో అభ్యర్థులు ఈ ఆలయానికి క్యూ కట్టడం విశేషం. -
మిర్యాలగూడ: వరసలు కలిపి ...ఓట్లు అడిగి..
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : ఇనాళ్లు చూసీ చూనట్లు వ్యవహరించిన నేతలకు ఎన్నికల ప్రచారంలో బంధుత్వాలు గుర్తుకొస్తున్నాయి. గ్రామాల్లో తమ తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ద్వితీయ శ్రేణి నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచార సమయంలో నేతలందరూ వరుసలు కలిపి ఓటర్లను పలకరిస్తున్నారు. గ్రామాల ఓటర్లతో పాటు పక్క గ్రామంలో ఉన్న పార్టీ కార్యకర్తల బంధువుల ఓటర్ల సహితం జార విడుచుకోకుండా ముమ్మరప్రయత్నాలు చేస్తూ, సాధారణ కార్యక్తలను సైతం అభ్యర్థులు, ముఖ్యనాయకులు మచ్చిక చేసుకొంటున్నారు. మర్యాదగా మాట్లాడడంతో పాటు మనోళ్ల ఓట్లు మిస్ కాకుండా చూడండని అదేపనిగా చెబుతున్నారు. గ్రామ, మండల స్థాయిలో కాస్తా పేరున్న వారిని కలిసి తమ వైపు తిప్పుకొనేందుకు వివిధ పార్టీల్లో ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలా రాకుండా గతంలో గుర్తుకు రాని సంఘాలను, నాయకులునుమరీ మరీ గుర్తుకు చేసుకొని సభలు చసమావేశాలు నిర్వహించి ఓటర్లను కూడగట్టుకొనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికి తోడు గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు తమ నేతకు మద్దతుగా, బంధువర్గ ఓటర్లను గూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరిన్ని వార్తాలు... -
నల్గొండ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మనీ..మద్యం..!
ఎన్నికలకు గడువు ముంచుకొస్తోంది. సమయం మరో ఐదు రోజులే ఉండడంతో రాజకీయ పక్షాలు వేగంగా పావులు కదుపుతున్నాయి. ఓ వైపు ప్రచారం నిర్వహిస్తూనే మరో వైపు ప్రలోభాలకు తెరలేపుతున్నాయి. ఓటర్లకు పంపిణీ చేసేందుకు మనీ, మద్యం గ్రామాలకు తరలిస్తున్నారు. పకడ్బందీగా నిఘా ఉన్నా కళ్లుగప్పి అడ్డదారుల్లో జిల్లాకు చేరవేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రూ.18లక్షలకు పైగా నగదు, మద్యం పట్టుబడింది. సాక్షి, యాదాద్రి : ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. మరో ఐదు రోజులే సమయం ఉండడంతో అన్ని రాజకీయ పక్షాలు ప్రలోభాలకు తెరలేపాయి. మనీ, మద్యం సరఫరాకు నడుంకట్టాయి. భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో డబ్బు, మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.అందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. సర్వేల పేరుతో గ్రామాల్లో తమ అనుచరులను దించారు. సుదూర ప్రాంతాల్లో ఉండే బంధువులను రప్పించుకొని వారితో డబ్బు పంపిణీ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే డబ్బు, మద్యం రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా పలు మార్గాల్లో జిల్లాకు యథేచ్ఛగా నగదు, మద్యం తరలిస్తున్నారు. హైదరాబాద్ శివారున ఉండడంతో డబ్బుల మూటలు చాటుమాటున గ్రామాలకు చేరుతున్నాయి. ఓట్ల వారీగా డబ్బుల పంపిణీ! గెలుపే లక్ష్యంగా వివిధ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డదారులకు బార్లా తెరిచాయి. పలు చోట్ల ఇప్పటి నుంచే ఓటర్లను కలుస్తూ డబ్బుల పంపిణీ ప్రారంభించారు. గతంలో ఎన్నికలకు ఒకటి రెం డు రోజుల ముందు మాత్రమే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే వారు. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వార్డుల వారీగా తమ పార్టీ కార్యకర్తలను, వివిధ వర్గాల అనుచరులను రంగంలోకి దింపి గుట్టు చప్పుడు కాకుండా డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు స్త బ్ధతగా ఉన్న పలు నియోజకవర్గాల అభ్యర్థులు డబ్బుల కట్టలతోనే గ్రామాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా చేసిన ప్రచారం ఒక ఎ త్తు అయితే డబ్బులు పంపిణీ కార్యక్రమం మరొక ఎత్తుగా అభ్యర్థులు భావిస్తున్నారు. ఓటుకు రూ. 500నుంచి రూ. రూ.1,000 చొప్పున ఇంట్లో ఎ న్ని ఓట్లు ఉంటే వారందరికీ డబ్బు చేరవేసేలా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. డబ్బులు తీసుకున్న ఓటర్లు తప్పకుండా ఓట్లు వేస్తారని, దీంతో తమ గెలుపు ఖాయమని, డబ్బులు చేరవేయడమే పెద్ద పనిగా పలు పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఇలా అయితే జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి æ నియోజవర్గాల పరిధిలో ఓటర్లకు గడిచిన రెండు రోజులగా రూ.కోట్లలో పంపిణీ జరుగవచ్చని రాజకీయ పరిశీలకుఉ అంచనా వేస్తున్నారు. ప్రధానంగా భువనగిరి, మునుగోడు, ఆలేరులో వరుసగా మూడు స్థానాల్లో డబ్బుల పంపిణీలో నిలుస్తాయని రాజకీయ విశ్లేషణ జరుగుతోంది. ఉపాధి కల్పించిన ఎన్నికలు ఈ సారి ఎన్నికలు పేద, మధ్య తరగతి ప్రజలకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాయి. తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో వ్యవసాయ పనులు లేకు కూలీలు ఇళ్లవద్దనే ఉంటున్నారు. ఈ సీజన్లో పత్తి తీయడం కోసం కూలీలకు డిమాండ్ అధికంగా ఉండేది. అయితే ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో కూలీలకు చేతి నిండా పని లేకుం డా పోయింది. ఈ సమయంలో వచ్చిన ఎన్నికల ప్రచార సభలకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నా రు. ఒక్కొక్కరికి రూ.200 వరకు ఇచ్చి సభలకు తీసుకువస్తున్నారు. దీంతో కూలీల చేతినిండా ఖర్చులకు డబ్బులు వచ్చిచేరుతున్నాయి. ఇప్పటి వరకు పట్టుబడిన నగదు రూ.17,58,610 ఎన్నికల్లో డబ్బు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బృందాలను నియమించి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచారు. అయినా నగదు, మద్యం పట్టుబడుతోంది. మేడ్చల్, జనగామ, సూర్యాపేట, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం,మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాలకు యాదాద్రి జిల్లా మీదుగా వెళ్లాల్సిందే. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నాలుగు చెక్‌పోస్టులు ఏ ర్పాటు చేశారు. ఆలేరు, గూడూరు, చౌటుప్పల్, తూఫ్రాన్‌పేటలో ఇప్పటి వరకు రూ.15,54,110 పట్టుకున్నారు. బీబీనగర్ మండలం గూడూరు చెక్‌పోస్టు వద్ద నవంబర్ 14వ తేదీన ఉదయం రూ.1.63లక్షలు, సాయంత్రం 1.01లక్షలు పట్టుకున్నారు. నవంబర్ 15న పోచంపల్లిలో రూ.1.04లక్షలు, నవంబర్ 17న పోచంపల్లిలో రూ.2.50లక్షలు, నవంబర్ 1న మోత్కూర్‌లో రూ.5లక్షలు, నవంబర్ 20న ఆలేరులో రూ.35,610, నవంబర్ 29న చౌటుప్పల్‌లోని తూఫ్రాన్‌పేట వద్ద రూ.4లక్షలు పట్టుకున్నారు. అదే విధంగా శుక్రవారం రాత్రి బీబీనగర్ మండలం భట్టుగూడెంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రోడ్డుగుండా వెళ్తున్న ఓ వాహనాన్ని తనిఖీ చేయగా రూ. 2లక్షల 3,500 నగదు పట్టుబడింది. -
ఆయన కోసం ఆమె
సాక్షి, భద్రాచలం/మధిర: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తుండగా..వారికి తోడుగా సతీమణులు కూడా ఓట్లు అడుగుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ, మహిళలను పలుకరిస్తూ, వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ ఆకట్టుకుంటున్నారు. అన్నా..అక్కా..బాబాయ్..పిన్ని అంటూ వరుసలు కలిపి ఆప్యాయంగా మాట్లాడుతూ..మా ఆయనకే ఓటేయండి..గెలిపించండి అంటూ అభ్యర్థిస్తున్నారు. అభివృద్ధి చేస్తారు, అండగా ఉంటారు..ఒక్కసారి అవకాశమిచ్చి విజయాన్నందించండి అంటూ కోరుతూ తమదైన శైలిలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. భద్రాచలంలో డాక్టర్ వెంకట్రావు భార్య ప్రవీణ ప్రచారం కామేపల్లి: ఇల్లెందు మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి బాణోతు హరిప్రియ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఊట్కూర్, కామేపల్లి, కెప్టెన్‌బంజర, బాసిత్‌నగర్, ముచ్చర్ల, జాస్తిపల్లి, సాతానిగూడెం, మద్దులపల్లి, లాల్యాతండా, పండితాపురం గ్రామాల్లో తిరిగి ఓట్లు అభ్యర్థించారు. పలుచోట్ల తండాల్లో గిరిజన మహిళలు ఆప్యాయంగా స్వాగతించారు. ఆమె ఆనందంతో వారితో సంప్రదాయ నృత్యం చేశారు. ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆనంద‘తాండ’వం నృత్యం చేస్తున్న హరిప్రియ భద్రాచలంలో కూటమి అభ్యర్థి పొదెం వీరయ్య ,భార్య పద్మ ఇలా.. -
అన్నీ అధనమే!
సాక్షి, ఖమ్మంరూరల్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ..ఇటు ప్రచారం ఊపందుకుంటుండగా, బరిలో నిలిచిన అభ్యర్థులకు మాత్రం అదనపు ఖర్చులు పెరుగుతున్నాయి. అవి తడిసి మోపెడవుతున్నాయి. జిల్లాలోని ప్రధాన పార్టీలకు సంబంధించి కొందరు అభ్యర్థుల ఖర్చు అంతకంతకూ పెరుగుతోంది. ఇంకా రెట్టింపయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గెలుపును సవాల్‌గా తీసుకున్న నేతలు వెనుకాడడంలేదు. గెలుపుపై దృష్టి సారించారు. ఇప్పటికే పార్టీల అభ్యర్థులు తమ అనుచరులు, బయటి వ్యక్తులతో గుటుట్చప్పుడు కాకుండా అవసరమైన నిధులను సమకూర్చుకుంటున్నారు. ఎన్నిడబ్బులు ఖర్చుపెట్టినా ప్రచా రం ఏస్థాయిలో చేశారన్నదానిపైనే గెలుపోటములు ఆధాపడి ఉంటాయని భావించి ఆ స్థాయిలో వెచ్చించేస్తున్నారు. ప్రచారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నవారు డబ్బుల విషయంలో వెనుకాడట్లేదు. వాల్‌పోస్టర్లు, డోర్స్టిక్కర్లు, జెండాలు, టోపీలు, కండువాలు, టీషర్ట్స్, చొక్కాలు ఇతర ప్రచార సామగ్రికి ప్రధాన పార్టీల అభ్యర్థి రూ.5లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ప్రచారానికి ఆటోలు ఉపయోగిస్తున్నారు. ఒక్కో ఆటో కిరాయి రోజుకు రూ.600. డీజిల్ ఖర్చు కూడా అభ్యర్థులే భరిస్తున్నారు. డ్రైవర్‌తో పాటు వాహనంలో అభ్యర్థికి సంబంధించిన వారు ఉంటారు. వీరికి భోజనంతోపాటు సదరు రూ.300నుండి రూ.400 వరకు చెల్లిస్తున్నారు. మైక్‌సెట్ అద్దె రోజుకు రూ.800నుంచి1000 వరకు ఉంటోంది. కొందరు నాయకులు ప్రత్యేకంగా పాటలు రూపొందించుకుంటున్నారు. రోడ్‌షోలకు కొందరు నాయకులు కొత్త వాహనాలు కొంటున్నారు. ఈమొత్తం ప్రక్రియకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. అంతా ప్రచారజపమే.. ఖమ్మంసహకారనగర్: ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు దొరికిన వారందరినీ ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు, సన్నిహితులను ప్రధాన వ్యూహకర్తలుగా ఉపయోగిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఖమ్మం నియోజకవర్గంలో రెండు మండలాలే ఉండగా మిగతా నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు మండలాలు ఉన్నాయి. ఇక్కడ తమ ప్రచారాన్ని వాహనాల ద్వారా చేస్తుండగా ఖాళీ సమయాల్లో అభ్యర్థులు, వారి అనుయాయులు గ్రామాల్లోని నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు తొలుత ఆయా ప్రాంతాల వారీగా ముఖ్య నాయకులు, అనుచరులతో ముందస్తుగా సమావేశం అవుతున్నారు. అనంతరం వారిచ్చే సలహాలు సూచనలతో పాటు వారి ఆలోచనల ప్రకారం తేదీని నిర్ణయించి ప్రచార సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వీటిని నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో కూలీలు అధికంగా ఉండడంతో వారిని ఆకట్టుకునేందుకు, కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాము చేసిన, చేయబోయే కార్యక్రమాలను సభల్లో ప్రజలకు వివరిస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్‌లలో సైతం అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలను తెలియజేయడంతో పాటు వారిని గెలిపించాలని కోరుతూ కొద్దిమంది వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి ప్రచారంలో ముందుకెళ్తున్నారు. నేరుగా అభ్యర్థులు కూడా సందేశాలు పంపించే సంస్కృతి ఉంది. ఒక అభ్యర్థి పోస్టర్ ఎక్కడ వేస్తే మరో అభ్యర్థి పోస్టర్లు, అక్కడ, ఆ సమీపంలో వేస్తూ ప్రచారంలో ఒకరికి ఒకరు సై అంటే సై అంటూ దూసుకెళ్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా.. అప్పులు చేసైనా, బంగారం తాకట్టుపెట్టి అయినా..లేదా బంగారు ఇచ్చయినా ఓట్లు పడేలా చూసుకోవాలనేలా కొందరు డబ్బు విషయంలో భయపడకుండా వెచ్చిస్తున్నారు. ఏ పార్టీకి ఎంతబలం ఉంది..ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. గెలవాలంటే ఇంకెన్ని ఓట్లు అవసరం అవుతాయని లెక్కలు కడుతున్నారు. ఈ మేరకు ఓటర్లకు గాలం వేసేందుకు ప్రణాలిక రూపొందిస్తున్నారు. ప్రత్యర్థి ఎంతముట్టచెబితే అంతకంటే ఎక్కుగా ఓటర్లకు ఇవ్వాలన్నా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అంతేగాక ఏస్థాయిలో మద్యం, తాయిలాలు వంటివి ఎరవేయాలనేది అంచనా వేస్తున్నారు. ఇదంతా జరిగితే అభ్యర్థుల ఖర్చుకు ఇక అంతే ఉండదు. ప్రచారానికి తిరిగే సమయంలో వందల సంఖ్యలో జనం, కార్యక్తలు ఉండేటట్లు చూసుకుంటున్నారు. వీరిలో ఎక్కువమంది దినసరి కూలీలనేది ఓ విమర్శ. వీరికి మధ్యాహ్నం భోజనం అందిస్తూ, సాయంత్రం వేళ మద్యం కూడా పంపిణీ చేస్తున్నారు. -
ఫ్యామిలీ తోడుగా..ప్రచారం జోరుగా..
సాక్షి, యాదాద్రి : ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు గెలుపుకోసం శక్తియుక్తులొడ్డుతున్నారు. మరోవైపు అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు, బంధుగణం ప్రచారబాట పట్టింది. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. మహిళలకు బొట్టు పెట్టి ఓటు అడుగుతూ తమ అభ్యర్థిని గెలిపించాలని వేడుకుంటున్నారు. కొందరు ఎలాంటి హంగూఆర్భాటం లేకుండా ప్రచారం చేస్తుండగా మరికొందరు వినూత్న రీతిలో దూసుకుపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎల్‌ఎఫ్‌తో పాటు ఇతర పార్టీల అభ్యర్థుల కుటుంబాలు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. జిల్లా పరిధిలోని భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున వారి కుటుంబాలు రంగంలోకి దిగడంతో ప్రచారం మరింత వేడెక్కింది. అభ్యర్థుల భార్యలు, తనయులు, సోదరులు, అల్లుళ్లు ఇతర బంధువర్గం అంతా రంగంలోకి దిగడంతో ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. ప్రధానంగా మహిళా ఓ టర్లను ఆకట్టుకునేందుకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. భువనగిరి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి భార్య వనితారెడ్డి, కుమార్తె మాన్వితారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తరఫున భార్య కిరణ్‌జ్యోతిరెడ్డి, కుమారుడు శ్రీరామ్‌రెడ్డి, కుమార్తెలు కీర్తిరెడ్డి, స్పూర్తిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత తరఫున ఆమె భర్త గొంగిడి మహేందర్‌రెడ్డి, అల్లుడు అక్షయ్‌రెడ్డి, కుమార్తె అంజనీరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ తరపున ఆయన సతీమణి బూడిద సువర్ణ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డి సతీమణి అనురాధ, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సతీమణి అరుణ, కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామచంద్రయ్య సతీమణి సరస్వతి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. బృందాలుగా విడిపోయి.. అభ్యర్థుల తరఫున వారి భార్యలు, కుటుంబంలోని మహిళలు.. మహిళా ఓటర్లకు బొట్టు పెట్టి, పార్టీ గుర్తులను చూపిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ప్రచారం సాగిస్తున్నారు. ఉదయం 7 గంటలకే బయటకు వెళ్లి సాయంత్రం వరకు బృందాలుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచారానికి మరో పది రోజులే మిగిలి ఉండడంతో ఎక్కడెక్కడ ప్రచారంలో చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారు. మొత్తానికి కుటుంబసభ్యులు, బంధుగణంతో ప్రచారం మరింత వేడెక్కింది. -
ఎన్నికలొచ్చే .. మర్యాద తెచ్చే..!
సాక్షి, మిర్యాలగూడ రూరల్: ఎన్నికలోచ్చాయి... ఓటర్లకు ఎనలేని మర్యాద తెచ్చి పెట్టాయి. అధికారంలో ఉన్నప్పుడు రెండు సార్లు చేతులెత్తి నమస్కరించినా పట్టించుకోని కొందరు నాయకులైతే ఎన్నికల పుణ్యామా అని ఇప్పుడు ఓటర్లపై ఎనలేని మర్యాదను కనబరుస్తున్నారు. ఓటర్లు కనబడగానే ఎంతో వినమ్రతగా దండాలు పెట్టడంతో పాటు అన్నా..తమ్మి, అక్క అంటూ ఆప్యాయతతో పలక రిస్తున్నారు. గ్రామాల్లోకి ప్రచారానికిళ్ళిన నాయకులు ప్రజల యోగ క్షేమాలు తెలుసుకొంటూవారితో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పలు పార్టీల నాయకులు ఉదయాన్నే రోడ్ల పై చేరి ఇచ్చి పోయే ఓటర్లను ప్రేమతో పలుక రిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా వారి వారి పార్టీ గురించి గొప్పగా చెబుతూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా మరణించిన ట్లు తెలిస్తే చాలు వారి కుటుంబ సభ్యుల కంటే ముందుగానే వారి ఇళ్లకు చేరుకొని అంత్యక్రియలు పూర్తయ్యే వరకుఅక్కడే గడుపుతున్నారు.వివి«ధ పార్టీల నాయకుల ప్రవర్తనను గమనించే కొందరు ఓటర్లు ....ఎన్నికలు ఎప్పుడు ఆలాగే వస్తే బాగుండునని భావిస్తున్నారు. -
పతుల కోసం సతుల ప్రచారం
తెలంగాణ ఎన్నికల సమరశంఖం పూరించటంతో అభ్యర్థులు ప్రచారాలతో తల మునకలైపోయారు,మేము ఏ మాత్రం తక్కువ కాము అన్నట్లు వారి సతులు కూడా ప్రచారాల్లోకి దిగారు,ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మరీ వారి పతులను గెలిపించమని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు సూర్యపేట నియోజకవర్గంలో ఇలా.. సూర్యాపేట : ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి సతీమణి నల్లగొండ : బొట్టుపెట్టి ఓటర్లను అభ్యర్థిస్తున్న కోమటిరెడ్డి సతీమణి చండూరు మండలంలో గంగిడి మనోహర్‌రెడ్డి సతీమణి.. సూర్యాపేట : సంకినేని సతీమణి.. మా అమ్మను గెలిపించరూ.. ఆలేరు : గుండ్లగూడెంలో ప్రచారం నిర్వహిస్తున్న గొంగిడి సునీత కూతురు, కుమారుడు -
ప్రచారంలో కొత్త పుంతలు
సాక్షి, దురాజ్‌పల్లి (సూర్యాపేట) : కరపత్రాల ప్రచారానికి కాలం చెల్లింది. గతంలో ఎప్పుడూ లేని వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ప్రజల్లోకి పార్టీ గుర్తు పోయేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఎన్నికల ప్రచార రథాలను తయారు చేయించుకుంటున్నారు.. నాయకులు. ఎన్నికలు సమీ పిస్తున్న తరుణంలో గ్రామాల్లో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతలు దూసుకుపోతున్నారు. అభ్యర్థులు ప్రకటించకున్నా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం చేస్తుండగా, బీజేపీ అభ్యర్థులు, బీఎల్ఎఫ్ అభ్యర్థులు కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వతం త్య్ర అభ్యర్థులు కూడా ఎక్కడా తగ్గడం లేదు. అయితే అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారం విభిన్న రీతుల్లో కొనసాగిస్తున్నారు. ప్రచార రథాలకు మైకులు, తమ గుర్తులు ఏర్పాటు చేసి ప్రసంగిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి తాను ప్రసంగించే ప్రచార రథాలను వినూత్నంగా, ఓటర్లను ఆకట్టుకునేవిధంగా తయారు చేసుకుంటున్నారు.గతంలో జీపులకు సాధారణ మైకులు పెట్టుకుని ఊరూరా తిరుగుతూ ప్రచారం చేసేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. ప్రచార రథంలో సకల సౌకర్యాలు ఉండేలా నాయకులు ఏర్పా?ట్లు చేసుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా తయారు చేసుకుంటున్నారు. 250 వాట్స్ మైక్, రథానికి నాయకులు, పార్టీ అధినేతల చిత్రపటాలను ఏర్పాటు చేస్తున్నారు. వైర్లెస్ మైక్, ఎల్ఈడీ లైట్లు, టైటిల్స్,చుట్టూ రెయిలింగ్స్,వాటర్‌ప్రూఫ్ కార్పెట్లు తదితర అత్యధునిక హంగులతో ప్రచార రథాలను రూపొందించుకుంటున్నారు.వాహనంపై ఎనిమిది మంది నిలిచిఉండే విధంగా తయారు చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచే.. జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక ముందు నుంచి ఆయా పార్టీల నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లోని ఆయా పార్టీల నాయకులు 87 వాహనాలకు అనుమతులు తీసుకుని ప్ర చారం నిర్వహిస్తున్నారు. హుజుర్నగర్ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు ప్రచార వాహనాలకు 35 దరఖాస్తులు రాగా 25 వాహనాలకు, కోదాడ నియోజకవర్గం లో 6 వాహనాలకు దరఖాస్తులు రాగా 6 వాహనాలకు అనుమతి ఇచ్చారు. అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గంలో 47 దరఖాస్తులుకు గానూ 45 వాహనాలకు, తుంగతుర్తి నియోజకవర్గంలో 15 దరఖాస్తులకు గానూ 10 ప్రచార వాహనాలకు అనుమతించారు. ప్రచారంలో కొత్త పుంతలు : ప్రచారం కొంత పుంతలు తొక్కుతున్నదనడంలో సందేహం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు వాహనాలకు ఎల్ఈడీలను అమర్చి ప్రచారం చేస్తున్నారు. పట్టణాల్లో పలు చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి తమ కార్యక్రమాలను ప్రజల్లోకి వెల్లేలా ప్రచారం చేస్తున్నారు.అంతే కాకుండా వాహనాలపై ఎల్ఈడీలను ఏర్పాటు చేసి పట్టణం, గ్రామాల్లో తిప్పుతూ పార్టీ గుర్తు, ఎన్నికల హామీలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు.కొన్ని పార్టీలు సోలార్ సిస్టమ్‌తో పనిచేసే ఎల్ఈడీ జేబు బ్యాడ్జీలను ప్రచారానికి వినియోగిస్తున్నారు. -
అభివృద్ధి కనిపించడం లేదా..?
సాక్షి,చండూరు: మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాలుగున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధి కనిపించకపోతే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాలని చండూరు ఎంపీపీ తోకల వెంకన్న ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సూచించారు. ఆయన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దగాని వెంకన్న గౌడ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాతపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. కూసుకుంట్లపై తప్పుడు వార్తలు రాయండి అనే పదం ఎంత వరకు సబబన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉండి నియోజకవర్గంలో ఏం చేశావ్ అని ప్రశ్నించారు. కల్లు తాగిన కోతిలాగా వ్యవహరించడం ఎంత వరకు సబబన్నారు. మరోసారి నోరు జారితే టీఆర్ఎస్ ఊరుకోదన్నారు. 60 ఏళ్లుగా జరగని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో జరిగిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఊహించని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలను సైతం కూసుకుంట్ల నెరవేర్చాడని అన్నారు. వెల్మకన్నె, శేషిలేటి వాగు, బెండలమ్మ చెర్వు పనులను ముందుకు తీసుకు వచ్చిన ఘనత ప్రభాకర్ రెడ్డిదేనని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. సమావేశంలో కోడి వెంకన్న, కళ్లెం సురేందర్ రెడ్డి, పందుల భిక్షం, స్వాతి, వెంకటేశ్, కొంపెల్లి వెంకటేశం పాల్గొన్నారు. -
'గెలుపు కోసం సామదానభేద దండోపాయాలు'
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ సామదానభేద దండోపాయాలను ప్రయోగిస్తోందని సీపీఎం ధ్వజమెత్తింది. కులసంఘాలు, ఇతర సంస్థలకు తాయిలాలు ప్రకటించే దుస్థితితోపాటు, బెదిరించడం, లొంగదీసుకోవడం, డబ్బులు ఆశ చూపించడం వంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. అదేసమయంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం ఆంతరంగిక సంక్షోభంలో, రెబెల్స్ గొడవతో ప్రచారం చేసుకోలేని స్థితిలో ఉన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా, ప్రజాసమస్యల పరిష్కారానికి మెరుగైన స్వచ్ఛ హైదరాబాద్ కోసం సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ, లోక్‌సత్తా, ఎంబీసీ జేఏసీ, వివిధ సామాజిక సంఘాలు, కాలనీ సంఘాలతో కూడిన వన్ హైదరాబాద్ కూటమిని గెలిపించాలని కోరింది. శనివారం ఎంబీ భవన్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహారావు, పార్టీ నాయకులు ఎం.శ్రీనివాస్, కె.రవి జీహెచ్ఎంసీ ఎన్నికల బ్రోచర్‌ను విడుదల చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం వన్ హైదరాబాద్ కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 31 వరకు బస్సుజాతాలను నిర్వహిస్తున్నట్లు డీజీ నరసింహారావు విలేకరులకు తెలిపారు. ఈ ప్రచారంలో జయప్రకాష్ నారాయణ (లోక్‌సత్తా), బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం (సీపీఎం), కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి (సీపీఐ), మహ్మద్ గౌస్ (ఎంసీపీఐ) పాల్గొంటారని తెలిపారు. ఈ కూటమి పోటీ చేయనిచోట్ల భావసారూప్యత ఉన్న స్వతంత్ర అభ్యర్థులను గుర్తించి ఈ నెల 26న ప్రకటిస్తామన్నారు. -
పాతబస్తీ అభివృద్ధి మజ్లిస్‌తోనే..: అసదుద్దీన్
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం ప్రారంభించారు. ఉప్పుగూడ డివిజన్లో ఆయన ఎంఐఎం అభ్యర్థి ఫహద్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దాద్‌తో కలసి విస్తృతంగా పాదయాత్ర చేశారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా పెద్దల దీవెనలు అందుకుంటూ ముందుకు సాగారు. నర్కీపూల్‌బాగ్, అహ్మద్ కాలనీ, బిస్మిల్లా హోటల్, చాంద్రాయణగుట్ట రోడ్డు తదితర ప్రాంతాలలో ఈ పాదయాత్ర కొనసాగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ...పాతబస్తీ అభివృద్ధి మజ్లిస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. కాగా బార్కాస్ డివిజన్ నూరీనగర్, అహ్మద్ నగర్లలో మజ్లీస్ శాసనసభ పక్షనేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహించారు. బార్కాస్ ఎంఐఎం అభ్యర్థి షబానా బేగంతో కలిసి ఆయన బస్తీలో పర్యటించి మజ్లిస్‌కు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. -
నేటితో ప్రచారానికి తెర
ఉప ఎన్నిక సందర్భంగా అధికార, ప్రతిపక్షాల పర్యటనలతో హోరెత్తిపోయిన ఆర్కేనగర్లో గురువారం ప్రచారానికి తెరపడనుంది. 27వ తేదీన పోలింగ్ కారణంగా గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచారాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా ప్రకటించారు. చెన్నై :చెన్నైలోని ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత, సీపీఐ అభ్యర్థిగా మహేంద్రన్ ప్రధాన పార్టీల నుంచి రంగంలో ఉన్నారు. వీరిద్దరుకాక మరో 26 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీచేస్తున్నారు. అమ్మ తరపున మంత్రులు, 50 మంది ప్రచార బృందం పెద్ద ఎత్తున ప్రచారం జరుపుతోంది. సీపీఐ అభ్యర్థి సైతం తన వంతు ప్రచారం సాగిస్తున్నారు. అభ్యర్థి హోదాలో జయలలిత ఈనెల 22వ తేదీన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. 27 వ తేదీన పోలింగ్ సందర్భంగా గురువారం సాయంత్రానికి ప్రచారం ముగించాలని, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వ చ్చిన వారంతా ఆర్కేనగర్ విడిచి వెళ్లాలని సందీప్ సక్సేనా ఆదేశించారు. ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు పది కంపెనీల పారా మిలిటరీ దళాలు బందోబస్తులో ఉన్నాయని, వీరుగాక వెయ్యి మంది రాష్ట పోలీసులు, 1150 మంది ఎన్నికల సిబ్బంది, ఫ్లైయింగ్ స్క్వాడ్లు పనిచేస్తున్నారని తెలిపారు. అన్నదాతల ఆందోళన: ఆర్కేనగర్ నియోజకవర్గంలో గురువారం అన్నదాతలు ఆకస్మిక ఆందోళన చేపట్టి పోలీసులను పరుగులు పెట్టించారు. తండయార్‌పేట-తిరువత్తియూర్ రోడ్డులోని కార్పొరేషన్ మండల కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి రైతులు గుమికూడడం ప్రారంభించారు. మీరు ఎవరు, ఏం చేస్తున్నారని పోలీసులు ప్రశ్నించగా, ఊరికినే నిలుచున్నా తప్పా అని ఎదురు ప్రశ్నించారు. 10 గంటల సమయానికి సుమారు వందమంది రైతులు గుంపుగా చేరి మండల కార్యాలయంలోకి చొరబడే ప్రయత్నం చేశారు. మీకు ఏమి కావాలని పోలీసులు ప్రశ్నించగా, ముఖ్యమంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకే ఆమె పోటీ చేస్తున్న ఆర్కేనగర్లో వినతి పత్రం సమర్పిస్తున్నామని బదులిచ్చారు. వినతి పత్రాలు ఇక్కడ ఇవ్వకూడదని పోలీసులు వారికి అడ్డుతగలడంతో అకస్మాత్తుగా రోడ్లపై పడుకున్నారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నదాతల ఆందోళనతో సుమారు అరగంటపాటు ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. ఆర్కేనగర్ పరిధిలో బుధవారం రాత్రి వాహనాల తనిఖీల్లో పోలీస్ పేరుతో ఉన్న వాహనం నుండి ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆర్కేనగర్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీచేస్తున్న వసంతకుమార్, ఎమ్ఎల్ రవి, పాల్‌రాజ్, తదితర 9 మంది అభ్యర్థులు గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తండయార్‌పేటలోని కార్పొరేషన్ మండల కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి దూసుకెళ్లారు. పోలీసులు సర్దిచెప్పి పంపివేశారు. అలాగే ప్రచార సమయంలో తనపై రాళ్లు రువ్వారని మరో స్వతంత్య్ర అభ్యర్థి ట్రాఫిక్ రామస్వామి ఫిర్యాదు చేశారు. ఇతని ఫిర్యాదు స్వీకరించక పోవడంతో ధర్నాకు దిగాడు. 4రోజులు టాస్మాక్ సెలవు : ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోలింగ్, లెక్కింపు సందర్బంగా నాలుగురోజుల పాటూ టాస్మాక్ దుకాణాలకు, బార్లకు సెలవు ప్రకటించారు. 25వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 27వ తేదీ రాత్రి వరకు, అలాగే లెక్కింపురోజైన 30వ తేదీ రాత్రి వరకు శలవు దినాలను అమలుచేయనున్నారు. ‘అమ్మగెలుపు-తెలుగోడి గెలుపు’ కేతిరెడ్డి ప్రచారం: తెలుగువారు అత్యధికంగా నివసించే ఆర్కేనగర్ నియోజకవర్గంలో తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నాడీఎంకే తరపున ఈనెల 13 వ తేదీ నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడి తెలుగు ప్రజలంతా తమ నూరుశాతం ఓట్లను రెండాకుల చిహ్నంపై వేసి అమ్మను అఖండమెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అమ్మ గెలుపు తెలుగోడి గెలుపు అనే నినాదంతో కరపత్రాలు పంచుతూ వాడవాడలా ప్రచారం నిర్వహించారు. అమ్మను గెలిపిస్తే రాష్ట్రం మరిన్ని మంచి పథకాలతో ముందుకు దూసుకుపోతుందని అన్నారు. ఏఐటీఎఫ్ ప్రచారం: ఆలిండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి నేతృత్వంలో పలు తెలుగు సంఘాల ప్రముఖులు గురువారం ఆర్కేనగర్లో ప్రచారం నిర్వహించారు. అమ్మను గెలిపించడం ద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాలని పేర్కొంటూ అన్నాడీఎంకే తరపున ప్రచారం జరిపారు. చెన్నైపురి ట్రస్ట్ చైర్మన్ తంగుటూరి రామకృష్ణ, టామ్స్ అధ్యక్షులు గొల్లపల్లి ఇజ్రాయేల్, ద్రవిడ దేశం అధ్యక్షులు కృష్ణారావు, దక్షిణభారత తెలుగు సంక్షేమం సంఘం అధ్యక్షులు దోర్నాదుల సత్యనారాయణ, మెహతానగర్ తెలుగు ప్రముఖులు ప్రకాష్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.