ఎన్నికలొచ్చే .. మర్యాద తెచ్చే..! | Candidates Respecting More During Elections | Sakshi
Sakshi News home page

ఎన్నికలొచ్చే .. మర్యాద తెచ్చే..!

Published Wed, Nov 21 2018 8:41 AM | Last Updated on Wed, Nov 21 2018 8:41 AM

 Candidates Respecting More During Elections - Sakshi

సాక్షి, మిర్యాలగూడ రూరల్‌: ఎన్నికలోచ్చాయి... ఓటర్లకు ఎనలేని మర్యాద తెచ్చి పెట్టాయి. అధికారంలో ఉన్నప్పుడు రెండు సార్లు చేతులెత్తి నమస్కరించినా పట్టించుకోని కొందరు నాయకులైతే ఎన్నికల పుణ్యామా అని ఇప్పుడు ఓటర్లపై ఎనలేని మర్యాదను కనబరుస్తున్నారు. ఓటర్లు కనబడగానే ఎంతో వినమ్రతగా దండాలు పెట్టడంతో పాటు అన్నా..తమ్మి, అక్క అంటూ ఆప్యాయతతో పలక రిస్తున్నారు. గ్రామాల్లోకి ప్రచారానికిళ్ళిన నాయకులు ప్రజల యోగ క్షేమాలు తెలుసుకొంటూవారితో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పలు పార్టీల నాయకులు ఉదయాన్నే రోడ్ల పై చేరి ఇచ్చి పోయే ఓటర్లను ప్రేమతో పలుక రిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా వారి వారి పార్టీ గురించి గొప్పగా చెబుతూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా మరణించిన ట్లు తెలిస్తే చాలు వారి కుటుంబ సభ్యుల కంటే ముందుగానే వారి ఇళ్లకు చేరుకొని అంత్యక్రియలు పూర్తయ్యే వరకుఅక్కడే గడుపుతున్నారు.వివి«ధ పార్టీల నాయకుల ప్రవర్తనను గమనించే  కొందరు ఓటర్లు ....ఎన్నికలు ఎప్పుడు ఆలాగే  వస్తే బాగుండునని భావిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement