హామీల వర్షం! | KCR Meeting In Munugodu Constituency | Sakshi
Sakshi News home page

హామీల వర్షం!

Published Wed, Nov 28 2018 8:46 AM | Last Updated on Wed, Nov 28 2018 8:49 AM

KCR Meeting In Munugodu Constituency - Sakshi

చండూరు : బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్, పక్కన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

సాక్షి, చండూరు, మునుగోడు: దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టి మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. మంగళవారం చండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నలో డిండి ఎత్తిపొతల పథకాన్ని పూర్తి చేయించి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని 1.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటి ఇంటికీ కృష్ణాజలాలు అందిస్తున్నామన్నారు. త్వరలోనే మునుగోడు నియోజకవర్గంలోని పలు గ్రామాలను కలుపుతూ రీజనల్‌ రింగ్‌ రోడ్డు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. 

ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొడతాం :

  • మునుగోడును అభివృద్ధి చేస్తాం
  • ఏడాదిన్నరలో డిండి ఎత్తిపోతలను పూర్తిచేసి సాగునీరందిస్తాం
  • కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించండి
  • చండూరు ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ 

గట్టుప్పలను మండలంగా ఏర్పాటు చేస్తా:
కొంతకాలంగా ప్రజలు కోరుకుంటున్న గట్టుప్పల్‌ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే మండలాన్ని ఏర్పాటు చేసి తానే వచ్చి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా చౌటుప్పల్‌లో పేదలకు మెరుగైయిన విద్యను అందించేందుకు డిగ్రీ కళాశాలని మంజూరు చేయిస్తామన్నారు. 
కూసుకుంట్ల గెలుపు ఖాయం:
అను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఈ ఎన్నికల్లో గెలవడం ఖాయమన్నారు. సభకు హాజరైన ప్రజలను చూస్తే తాను మాట్లాడకపోయినా ఓట్లు వేస్తారనే నమ్మకం కలుగుతోందన్నారు.  ప్రభాకర్‌రెడ్డి ఎంతో మంచి వ్యక్తి అని ఆయనను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.  అభివృద్ధి కోసం పట్టుబట్టే వ్యక్తి ప్రభాకర్‌రెడ్డి అని ఆయన కోరిక మేరకే చౌటుప్పల్‌ను డివిజన్‌ కేంద్రం చేశామన్నారు. ఆయనని ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో  గెలిపిస్తే ఆయన కోరిన అభివృద్ధి పనులను పూర్తి చేయిస్తామన్నారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగినా ఈ సభలో హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, గొల్ల, కుర్మల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్యామ మల్లేష్, రాష్ట్ర నాయకులు జెల్లా మార్కొండయ్య, మునుగోడు పరిశీలకుడు కిషన్‌రావు, మునగాల నారయణరావు, బొల్ల శివశంకర్, ఐతగొని లాల్‌బహదూర్‌గౌడ్, డోకూరి శ్రీనివాస్‌రెడ్డి, మేడి నాగలక్ష్మి, పెద్దగాని వెంకన్న, తిరందాసు అనిత తదితరులు పాల్గొన్నారు.

 కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి : కూసుకుంట్ల

మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వద్ద డబ్బులు తీసుకుని కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని టీఆర్‌ఎస్‌ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కోరారు. మంగళవారం చండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రూ. కోట్లు ఖర్చు చేసి ఓట్లు కొనేందుకు రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మూడేళ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్నా ఎమ్మెల్యే పదవికి రావడం సిగ్గుచేటన్నారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్సీగా ఉన్న ఆయన ఆయా నియోజకవర్గాలకు చేసిన అభివృద్ధి శున్యమన్నారు.  ఇదే నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అరగంటలో కలిసేందుకు అవకాశం ఉంటుంది..కాని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కలిసేందుకు ఆరు నెలలు పడుతుందన్నారు. ఇద్దరిలో ఎవరు బెస్ట్‌ అనేది మీరే నిర్ణయించుకోవాలని కోరారు.  గతంలో తనకు ఎమ్మెల్యేగా అవకాశమిస్తే రోజు  24గంటల్లో 16 గంటలు మీమధ్యనే ఉన్నానన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయతో పల్లెలన్నీ సస్యశ్యామలంగా మారాయన్నారు. నియోజకవర్గంలో చౌటుప్పల్‌ నుంచి నల్లగొండ, మాల్‌ నుంచి కనగల్, మర్రిగూడ మండలాల్లో డబుల్‌ రోడ్లు వేయించామన్నారు. మరో సారి కేసీఆర్‌ను సీఎంగా చేస్తే మునుగోడు ప్రాంతం కోనసీమగా మారుతుందన్నారు. ఒక్కసారి అవకాశమిస్తే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయిస్తాన్నారు. గొల్ల,కురుమల సంఘం రాష్ట అధ్యక్షుడు క్యామ మల్లేశం మాట్లాడుతూ ఓట్లను కొనేందుకు మహా కూటమీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరుగుతున్నాడన్నారు. సభలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, జెల్ల మార్కండేయులు, మునుగోడు పరిశీలకులు కిషన్‌రావు, మునగాల నారాయణరావు, బోళ్ల శివశంకర్, మేడి నాగలక్ష్మి, శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.   

ఆలేరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాకేసీఆర్‌

  •  సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తాం 
  •  లక్ష మెజార్టీతో గెలిపిస్తే సునీతకు పదోన్నతి  

ఆలేరు : ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అపద్ధర్మ ముఖ్య మంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాదసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గానికి గంధమళ్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్లను పూర్తి చేసి సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు నీటిని అందించి వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు.అలాగే పార్టీ అభ్యర్థి గొంగిడి సునీత మేరకు కొండపోచమ్మ ద్వారా బొమ్మలరామారం, శామీర్‌పేటలకు నీటిని అందిస్తామన్నారు. ప్రజల కోరిక మేరకు గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. జనగాం జిల్లాలో కలపడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని.. ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన మూడు నెలల్లో గుండాలను యాదాద్రి జిల్లాలో కలుపుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకే పని చేస్తామని మాకు ఢిల్లీలో, విజయవాడలో హైకమాండ్‌లు ఉండవన్నారు.

ఆలేరు ప్రజలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీత అధ్యక్షతన జరిగిన ఈ సభలో  భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మైనింగ్‌కార్పొరేషన్‌ చైర్మన్‌ సుభాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, ఆల్టాచైర్మన్‌ మోతేపిచ్చిరెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ పడాల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు బొట్ల పరమేశ్వర్, కాసగళ్ల అనసూయ, స్వప్న, అండెం సంజీవరెడ్డి, తుం గ బాలు, సుమలత, ఆకవరం మోహన్‌రావు, మొరిగాడి వెంకటేశ్, బెంజారం రవి, కొరకొప్పుల కిష్టయ్య, కోటగిరి అంజనేయులు, పంతం కృష్ణ, జింకల రామకృష్ణ, చింతకింది మురళి, బింగి రవి, ఆడెపు బాలస్వామి, కర్రె అశోక్, పిక్క శ్రీను, కాంబోజు భాగ్యశ్రీ, రవీందర్, బీజని మధు, జల్లి నర్సింహులు, పాశికంటి శ్రీను, ఏసీరెడ్డి మహేందర్‌రెడ్డి, సరాబ్‌ సంతోష్, మధార్, రియాజ్, దూడం మధు, మొగులుగాని మల్లేశం, బక్క రాంప్రసాద్, రచ్చ కాద్యశ్రీ, రచ్చ రాంనర్సయ్య, పేరపు సిద్దులు, వెంకటేశ్, గంగుల శ్రీను, దొంతిరి సోమిరెడ్డి, సోమిరెడ్డి, పాల్గొన్నారు.  
సునీతమ్మ నా బిడ్డ.. గెలిపిస్తే హోదా పెంచుతా...

యాదగిరిగుట్ట(ఆలేరు) : సునీతమ్మ నా బిడ్డ...ఎమ్మెల్యే.. గిమ్మెల్యే తర్వాత... 2001లో ఒంటరిగా నేను ఉద్యమం మొదలు పెట్టిననాడు  చిన్న పిల్లలా ఎంబట ఉద్యమంలో పాల్గొన్నది.. మీరు దయ తలిస్తే ఎంపీపీగా పనిచేసింది.. అనేక హోదాల్లో పని చేసి .. ఏ ఒక్క రోజు కూడా గెలిచిన.. ఓడిన.. ఉద్యమ బాట వీడలేదు.. చివరి వరకు కేసీఆర్‌ వెంట ఉండి పోరాటం చేసింది కాబట్టే.. కేసీఆర్‌ విజయం సాధించగలిగాడు.. ఆ విషయం మీకు తెలుసని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆలేరు పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో ఆయన మాట్లాడారు.ఈ సారి గెలిపిసే ఆర్డీనరి ఎమ్మెల్యేగా ఉండదు.. కచ్చితంగా హోదా పెరుగుతుంది.. నా బిడ్డ అని చెబుతున్నా.. నా బిడ్డ సునీతమ్మను లక్ష మెజా ర్టీతో గెలిపించాలన్నారు. సునీత నా బిడ్డ కాబట్టి అడిగింది చేయకపోతే ఊరుకోదు.. నాతో పం చాయితీ పెట్టుకుంటుంది..అలుగుతది.. తప్పకుం డా సాధించుకునే శక్తి సునీతకు ఉందన్నారు. నా బిడ్డ కాబట్టి అడిగినవ్వన్ని చేసి పెడతా అన్నారు.  

గత పాలకులు ఆలేరును పట్టించుకోలేదు :∙గొంగిడి  

ఆలేరు :
 గత పాలకులు ఆలేరు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, టీఆర్‌ఎస్‌ హయాంలోనే అన్నిరంగాల్లో నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మా జీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఆలేరులో మంగళవారం జరిగిన సీఎం కేసీఆర్‌ పాల్గొన్న ప్రజాఆశీర్వాదసభలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గం ఏండ్ల తరబడి సాగునీటికి నోచుకోక ఎడారిగా మారిందన్నారు.  గందమళ్ల, బస్వాపూ ర్‌ ప్రాజెక్టుల ద్వారా రాజపేట, గుండాల, ఆలేరు, గుట్ట ప్రాంతాలకు నీటిని అం దించాలన్నారు. అలాగే కొండపోచమ్మ ద్వారా బొమ్మలరామారం, తుర్కపల్లికి కూ డా నీటిని అందించే అవకాశం ఉందని ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కేసీ ఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని కోరారు. దక్షిణ భారతదేశంలో గుర్తింపు పొందిన కొలనుపాకలో ని జైనదేవాలయం, సోమేశ్వరాలయంలు ఉన్నాయని, వీటిని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని కోరారు. నియోజకవర్గంలో మరో 3 ఐటీ కళాశాలలు, యాదగిరిగుట్టలో డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని కేసీఆర్‌కు విన్నవించారు.  

మరిన్ని వార్తాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

ఆలేరు : జై తెలంగాణ నినాదాలు చేస్తున్న సీఎం కేసీఆర్, పక్కన గొంగిడి సునీత

2
2/2

ఆలేరు : బహిరంగ సభకు హాజరైన జనసందోహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement