ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడు : అద్బుత విశేషాలివే! | Worlds Tallest standing Ganesha in Ganesh International Park at Thailand | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడు : అద్బుత విశేషాలివే!

Published Tue, Sep 10 2024 12:06 PM | Last Updated on Tue, Sep 10 2024 2:46 PM

Worlds Tallest standing Ganesha in Ganesh International Park at Thailand

వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గణేష్‌ నిమజ్జనాలు కూడా ప్రారంభ మైనాయి. గణేష్‌ బప్పా మోరియా అంటూ పూజించిన భక్తులు  జై బోలో గణేష్‌మహారాజ్‌ కీ అంటూ లంబోదరుడికి వీడ్కోలు పలుకుతున్నారు. మరోవైపు  పలు ఆకృతుల్లో కొలువుదీరిని బొజ్జ గణపయ్య   విద్యుత్ కాంతుల శోభతో భక్తుల పూజలు అందుకుంటున్నాడు.  ఊరా, వాడా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి ముఖ్యంగా 70 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి, గాజువాకలో 89 అడుగుల ఎత్తుతో వినాయక విగ్రహాలు  ప్రత్యేక విగ్రహాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. మరి ప్రపంచంలోనే ఎత్తైన గణపతి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా? మన దేశంలో మాత్రం కాదు. మరి ఎక్కడ ఉంది? ఆ  విశేషాలు తెలుసుకుందాం ఈ కథనంలో..!

 

 

గణపతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కూడా నిర్వహిస్తుంటారు.  థాయిలాండ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన గణనాథుడు కొలువై ఉన్నాయి. దీని ఎత్తు ఏకంగా 128 అడుగులు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్‌లో విశేషంగా నిలుస్తోంది.

 

విగ్రహం ప్రత్యేకతలు
థాయిలాండ్‌లోని ఖ్లోంగ్ ఖ్యూన్ ప్రాంతంలో ఉన్న గణేశ్ ఇంటర్నేషనల్ పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేశంలోని చాచోయింగ్షావో నగరం సిటీ ఆఫ్ గణేశ్ పేరుతో ప్రసిద్ధి చెందిది. ఈ పెద్ద విగ్రహాన్ని 2012లో స్థాపించారు.  కాంస్యంతో ఈ భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 2008 నుంచి 2012 వరకు దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టిందట దీని తయారీకి.  తల భాగంలో కమలం, మధ్యలో ఓం చిహ్నం నాలుగు చేతులు ఉంటడం ఈ భారీ విగ్రహం యొక్క ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి.  అలాగే  ఒక చేతిల్లో పనస, రెండో చేతిలో చెరకు, మూడో చేతిలో అరటిపండు, నాలుగో చేతిలో మామిడ పండు ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మరో  మూడు  పెద్ద  గణేష్‌ విగ్రహాలు ఉన్నాయి.

ఈ విస్మయం కలిగించే విగ్రహం ఆధునిక ఇంజినీరింగ్‌కు నిదర్శనం మాత్రమే కాదు. అనేక దైవిక, వైజ్ఞానికి అంశాలను కూగా గమనించవచ్చు. ఎగువ కుడిచేతి పనస పండు సమృద్ధి , శ్రేయస్సుకు చిహ్నంగా, ఎగువ ఎడమ చేతిలో చెరకు తీపి,ఆనందం కలయికను, దిగువ కుడి చేయి అరటిపండు పోషణ, జీవనోపాధికి చిహ్నంగా నిలుస్తోంది. ఇక దిగువ ఎడమ చేతి మామిడి పండు, దైవిక జ్ఞానం, జ్ఞానంతో ముడిపడి ఉంటుంది.

ఎత్తైన గణేశ విగ్రహం కేవలం అద్భుతమైన కళాకృతి మాత్రమే కాదు, గొప్ప ప్రాముఖ్యత కలిగిన  పర్యాటక ప్రదేశం కూడా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశ విగ్రహం విశ్వాసం, ఐక్యత, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నంగా ఉంది. దీని గొప్పతనం మానవ సృజనాత్మకత, భక్తితో సాధించే ఉన్నతితోపాటు, సరిహద్దులు, నమ్మకాలకు అతీతంగా ఉన్న గణేశుని విశ్వవ్యాప్త ఆకర్షణకు, ప్రజలను ఏకం చేసే ఐక్యతా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement