ganesh statue
-
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడు : అద్బుత విశేషాలివే!
128 feet tall, the World’s Tallest standing Ganesha Murti at Khlong Khuean Ganesh International Park, Thailand. pic.twitter.com/ARzvHQNpEq— Lost Temples™ (@LostTemple7) September 9, 2024వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాలు కూడా ప్రారంభ మైనాయి. గణేష్ బప్పా మోరియా అంటూ పూజించిన భక్తులు జై బోలో గణేష్మహారాజ్ కీ అంటూ లంబోదరుడికి వీడ్కోలు పలుకుతున్నారు. మరోవైపు పలు ఆకృతుల్లో కొలువుదీరిని బొజ్జ గణపయ్య విద్యుత్ కాంతుల శోభతో భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఊరా, వాడా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి ముఖ్యంగా 70 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి, గాజువాకలో 89 అడుగుల ఎత్తుతో వినాయక విగ్రహాలు ప్రత్యేక విగ్రహాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. మరి ప్రపంచంలోనే ఎత్తైన గణపతి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా? మన దేశంలో మాత్రం కాదు. మరి ఎక్కడ ఉంది? ఆ విశేషాలు తెలుసుకుందాం ఈ కథనంలో..! గణపతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కూడా నిర్వహిస్తుంటారు. థాయిలాండ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన గణనాథుడు కొలువై ఉన్నాయి. దీని ఎత్తు ఏకంగా 128 అడుగులు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్‌లో విశేషంగా నిలుస్తోంది. విగ్రహం ప్రత్యేకతలుథాయిలాండ్లోని ఖ్లోంగ్ ఖ్యూన్ ప్రాంతంలో ఉన్న గణేశ్ ఇంటర్నేషనల్ పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేశంలోని చాచోయింగ్షావో నగరం సిటీ ఆఫ్ గణేశ్ పేరుతో ప్రసిద్ధి చెందిది. ఈ పెద్ద విగ్రహాన్ని 2012లో స్థాపించారు. కాంస్యంతో ఈ భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 2008 నుంచి 2012 వరకు దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టిందట దీని తయారీకి. తల భాగంలో కమలం, మధ్యలో ఓం చిహ్నం నాలుగు చేతులు ఉంటడం ఈ భారీ విగ్రహం యొక్క ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. అలాగే ఒక చేతిల్లో పనస, రెండో చేతిలో చెరకు, మూడో చేతిలో అరటిపండు, నాలుగో చేతిలో మామిడ పండు ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మరో మూడు పెద్ద గణేష్ విగ్రహాలు ఉన్నాయి.ఈ విస్మయం కలిగించే విగ్రహం ఆధునిక ఇంజినీరింగ్‌కు నిదర్శనం మాత్రమే కాదు. అనేక దైవిక, వైజ్ఞానికి అంశాలను కూగా గమనించవచ్చు. ఎగువ కుడిచేతి పనస పండు సమృద్ధి , శ్రేయస్సుకు చిహ్నంగా, ఎగువ ఎడమ చేతిలో చెరకు తీపి,ఆనందం కలయికను, దిగువ కుడి చేయి అరటిపండు పోషణ, జీవనోపాధికి చిహ్నంగా నిలుస్తోంది. ఇక దిగువ ఎడమ చేతి మామిడి పండు, దైవిక జ్ఞానం, జ్ఞానంతో ముడిపడి ఉంటుంది.ఎత్తైన గణేశ విగ్రహం కేవలం అద్భుతమైన కళాకృతి మాత్రమే కాదు, గొప్ప ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రదేశం కూడా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశ విగ్రహం విశ్వాసం, ఐక్యత, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నంగా ఉంది. దీని గొప్పతనం మానవ సృజనాత్మకత, భక్తితో సాధించే ఉన్నతితోపాటు, సరిహద్దులు, నమ్మకాలకు అతీతంగా ఉన్న గణేశుని విశ్వవ్యాప్త ఆకర్షణకు, ప్రజలను ఏకం చేసే ఐక్యతా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. -
వినాయక చవితి రోజు షాకింగ్ ఘటన.. సోషల్ మీడియాలో వైరల్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల గోపాల్‌నగర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మండపం నుండి వినాయకుని ప్రతిమను దొంగలు ఎత్తుకెళ్లారు. వీధిలోని చిన్న పిల్లలు తొలిసారి ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. రాత్రి 12 గంటల వరకూ జనాలు, పిల్లలు అక్కడే ఉండగా, అర్థరాత్రి తర్వాత ప్రతిమ చోరీకి గురైంది. ఘటన పట్ల కాలనీ కాలనీ వాసుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం దొంగతనం వ్యవహారం వైరల్‌గా మారింది. మరో చోట తాళం వేసిన ఇంటి తలుపులు పగులకొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. గోపాల్ నగర్లో చోరీ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: గణేష్ ఉత్సవాలు షురూ.. ఈ జాగ్రత్తలు, సూచనలు మర్చిపోకండి! -
సమయం లేదు గణేశా!.. మరో మూడు నెలలే.. ఏం చేస్తారో ఏంటో?
సాక్షి, హైదరాబాద్: ఆయా సమస్యల పరిష్కారానికి పనులు చేస్తున్న జీహెచ్ఎంసీ.. తీరా గడువు ముంచుకొచ్చేంతవరకూ పనులు చేయకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. వర్షాకాలంలో ముంపు సమస్యల పరిష్కారానికి ఎస్ఎన్డీపీ పేరిట ప్రత్యేక విభాగం ఏర్పాటైనప్పటికీ.. మళ్లీ వర్షాకాలం వస్తుండగా హడావుడిగా ఇప్పుడు పనులు చేస్తున్నారు. గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా రసాయనాలతో కూడిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ)తో తయారు చేసిన విగ్రహాలను వాడవద్దని, చెరువుల్లో వాటిని నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించినా అమలు చేయక.. చివరి నిమిషంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికిప్పడు ప్రత్యామ్నాయ మార్గాల్లేవని విన్నవించడంతో అదే చివరి అవకాశంగా హెచ్చరిస్తూ సుప్రీంకోర్టు అనుమతించడం తెలిసిందే. తయారీదారులకు వెళ్లిన ఆదేశాలు.. వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని, మట్టితో చేసే విగ్రహాలు సైతం చెరువుల్లో కాకుండా నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీలు అండర్‌టేకింగ్ ఇచ్చాయి. చెరువుల నిమజ్జనాల కోసం బేబి పాండ్స్ వినియోగిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో మరో మూడు మాసాల్లో వినాయకచవితి రానుంది. పీఓపీ విగ్రహాలు తయారు చేయకుండా వాటి తయారీదారులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి నగరమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. చదవండి: పుట్టిన రోజున ముస్తాబై.. సాయంత్రం బర్త్ డే పార్టీ ఇస్తానని.. ►పీఓపీ విగ్రహాల తయారీని నిలువరించినా, మట్టితో తయారయ్యే విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నా నగరంలో ఉన్న బేబి పాండ్స్ సరిపోవు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి వీల్లేదు కనుక, ఎక్కడికక్కడ స్థానికంగానే జీహెచ్ఎంసీ డివిజన్లు, కాలనీల వారీగా కృత్రిమ తటాకాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాంటివి ఎన్ని అవసరమవుతాయో అంచనా వేసి ఇప్పట్నుంచే కార్యాచరణ ప్రారంభిస్తేనే అసలు సమయానికి సమస్యలు ఎదురు కావని అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. ►తీరా చివరి నిమిషంలో అంటే సరిపడినన్ని కృత్రిమ తటాకాలు నిర్మించడం గాని.. ప్లాస్టిక్‌వి ఏర్పాటు చేయడం గాని కష్టమంటున్నారు. ప్లాస్టిక్‌వి వినియోగించాలనుకున్నా ముందస్తుగా తయారీ కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ యాక్షన్‌ప్లాన్ ఏమిటో అంతుబట్టడం లేదు. బేబిపాండ్లు, ప్లాస్టిక్ తటాకాల్లో విగ్రహాలను ముంచి,వెంటనే వెలికి తీస్తేనే అవి సరిపోతాయి.లేకుంటే కష్టం. ఇప్పటినుంచే అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంలో జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ ఏమిటో అంతుపట్టడం లేదు. -
కరెన్సీ గణేష్.. ఖతర్నాక్ ఉన్నాడు
బెంగళూరు : ఎక్కడైనా మట్టి, పీఓపీలతో వినాయక విగ్రహాలను తయారు చేయడం చూశాం. అయితే మణిపాల్‌కు చెందిన స్కాండ్ కళకారుడు శ్రీనాథ్ మణిపాల, వెంకి పలిమారు, రవి హిరేబెట్టులు 21 దేశాల కరెన్సీ నోట్లతో వినాయక ప్రతిమ తయారు చేశారు. ఉడిపిలోని విద్యా సముద్ర రోడ్డులోని సాయిరాధ మోటార్స్ సంస్థలో ఆ సంస్థ సహకారంతో ఈ కరెన్సీ విగ్రహాన్ని రూపొందించారు. శ్రీలంక, బంగ్లా దేశ్, చైనా, భూటాన్, అప్ఘానిస్థాన్, బహరైన్, యుఏఇ, అమెరికా తదితర 21 దేశాల కరెన్సీ నోట్లను విగ్రహం తయారీలో ఉపయోగించారు. -
విజయవడలో చెరకుతో గణేష విగ్రహం
-
అతి పెద్ద ఏకశిలా వినాయకుడి విగ్రహం
-
వినాయకుడు ఊగుతున్నాడని ప్రచారం
లక్ష్మణచాంద : లక్ష్మణచాంద మండలం రాచాపూర్ అనుబంధ గ్రామమైన పొట్టపెల్లి(కె) గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం తల ఊగుతుందంటూ ప్రచారం జరగడంతో సోమవారం భక్తులు చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి తరలివచ్చారు. భక్తులు పూలమాల వేసే క్రమంలో తల ఊగడంతోపాటు కళ్లు కూడా ఎరుపు, తెలుపు రంగుల్లోకి మారుతున్న విషయం గమనించిన వారు చుట్టూ పక్కల ఉన్న వారికి సమాచారం అందించారు. వారు వచ్చి గమనించగా మళ్లీ తల ఊగడంతో వినాయకుడి తల ఊగుతుందంటూ ప్రచారం జోరందుకుంది. వినాయకుడి తల ఊగడం కళ్లు ఎరుపు, తెలుపు రంగులోకి మారడం, సోమవారం పౌర్ణమి గడియాలు రావడం వినాయకుడి మహిమగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
మహాగణపతి విగ్రహం ఎత్తు తగ్గనుంది!
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఎత్తు వచ్చే ఏడాది నుంచి తగ్గనుంది. ఒక్కో అడుగు పెరుగుతూ భిన్నమైన ఆకృతిలో కరువిందు చేసిన ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం ఎత్తు ఈ ఏడాదికి 60 అడుగులకు చేరింది. ఇంత ఎత్తైన రూపం ఇదే చివరిసారికానుంది. వచ్చే ఏడాది నుంచి గణపయ్య చిత్తరువు ఎత్తు తగ్గనుంది. ఒక్కో అడుగు తగ్గుతూ అవరోహణ క్రమంలో లంబోదరుడి విగ్రహం రూపుదిద్దుకోనుంది. కాగా, ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతికి శ్రీ కైలాస విశ్వరూపమహాగణపతిగా నామకరణం చేశారు.1954లో ఖైరతాబాద్‌లో గణపతిని తొలిసారి ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి 60 ఏళ్ళు పూర్తయ్యాయి. అత్యంత ఎత్తులో అవతరించిన మహా గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు బారులు అమితాసక్తి కనబరుస్తున్నారు. ‘విశ్వరూపుడి’ ఈ ఏడాది విశేషాలు.. * మహాగణపతి బరువు 40 టన్నులు * ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 40 టన్నులు * గోనె సంచులు 10 వేల మీటర్లు * బంకమట్టి ఒకటిన్నర టన్నులు * నార రెండున్నర టన్నులు * చాక్ పౌడర్ 100 బ్యాగులు * సిబ్బంది 150 మంది -
వినాయక వ్యాపారం@ రూ.2.50 కోట్లు
మంచిర్యాల సిటీ : గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలో వినాయక ప్రతిమల వ్యాపారం రూ.2.50 కోట్లు జరుగుతుందని వ్యాపార వర్గాల అంచనా. జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో వినాయక ప్రతిమల కొనుగోలు మొదలుకుని నిమజ్జనం వరకు గణేష్ ఉత్సవ కమిటీ ఖర్చుకు వెనుకాడడం లేదు. జిల్లాలో ప్రతిమల ధర రూ.500 నుంచి రూ.15వేల వరకు ఉంది. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, లక్సెట్టిపేట, జన్నారం, దండేపల్లి, ఖానాపూర్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, ఆదిలాబాద్ ప్రాంతాలతోపాటు పరిసర ప్రాంతాల్లో సుమారు నాలుగు వేల ప్రతిమలను భక్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సగటున ఒక్కో ప్రతిమ ధర రూ. 5వేలు ఉంటే వీటి అమ్మకం ద్వారా రూ.2 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఉత్సవాల కోసం పూజ సామగ్రి కూడా విక్రయిస్తుంటారు. పండ్లు, పూలు, ఇతరత్రా పూజా సామగ్రి వ్యాపారం తొమ్మిది రోజులకు రూ.10లక్షల వరకు అవుతుంది. నవరాత్రుల్లో ఏదో ఒక రోజు ప్రతీ గణేష్ మండపం వద్ద ఉత్సవ కమిటీలు అన్నదానం నిర్వహిస్తుంటాయి. జిల్లా వ్యాప్తంగా పిండి వంటలు, భోజన పదార్థాలకు సుమారు రూ.40 లక్షలు ఖర్చు చేయనున్నారు. -
మట్టి ప్రతిమలే మేలు..!
మొయినాబాద్ రూరల్: ప్రపంచానికి ఆధ్యాత్మిక పరిమాళాన్ని అందించిన భారత్‌లో కొన్ని వేల సంవత్సరాలుగా పూరాతన సంస్కృతి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఇవన్ని ప్రకృతితో మమేకమై జరుపుకునే పండుగలే. అయితే ఇటీవలె వచ్చిన ఆధునాతన పద్ధతులతో ఈ సంప్రదాయాలే పర్యావరణానికి కీడు చేస్తున్నాయి. ఒకప్పుడు మట్టితో తయారు చేసే వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకునేవారు. ఆ తరువాత వాటిని చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేసినా సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు మాత్రం ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్రమాదకరమైన రసాయనాలతో ఆకర్షణీయ రూపాల్లో విగ్రహాలను తయారు చేస్తున్నారు. పూజల అనంతరం ఈ విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేసినా అవి కరగడం లేదు. అంతేకాకుండా ఆ ప్రతిమల్లోని రసాయనాలు చెరువులు, కుంటలను కలుషితం చేస్తున్నాయి. దీనికి బదులు మట్టి విగ్రహాలనే వాడాలని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రచారాన్ని ప్రారంభించాయి. జీవరాశుల మృత్యువాత ప్రతి సంవత్సరం హిందువులు వినాయక పండుగ కోసం రాష్ర్ట వాప్తంగా లక్షల సంఖ్యలో గణేష్ విగ్రహాలను కొనుగోలు చేస్తారు. వీటిలో 75 శాతంకుపైగా రసాయన పదార్థాలైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన విగ్రహాలే ఉంటాయి. అయితే పూజల అనంతరం ఈ విగ్రహాలను సమీపంలోవున్న చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తుంటారు. ఆ సమయంలో విగ్రహాల తయారీలో ఉపయోగించిన కృత్రిమ రంగులైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పాదరసం, సీసం, కాడ్మీయం, క్రోమీయం తదితర రసాయనాలు నీటిలో కలుస్తున్నాయి. దీంతో నీరు, గాలి కాలుష్యమవుతోంది. వీటితో క్యాన్సర్, జీర్ణకోశం, మూత్రపిండాలు, చర్మానికి సంబంధించిన వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఈ రసాయనాలతో చెరువులు, కుంటల్లో వుండే జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇటీవలె మట్టి విగ్రహాల వినియోగం పెరిగిపోయింది. మట్టి విగ్రహాల వినియోగం శ్రే యస్కరం పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి విగ్రహాలను వినియోగించడమే శ్రేయస్కరమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. చెరువుల, కుంటల వద్ద లభిం చే బంక మట్టితో వివిధ ఆకారాల్లో విగ్రహాలను చేయవచ్చు. వీటివల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడే అవకాశముండదు. మట్టితో తయారు చేసే విగ్రహాలు నిమజ్జనం చేసిన వెంటనే నీటిలో సులభంగా కరిగిపోతాయి. అయితే మట్టితో తయారు చేసిన విగ్రహాలు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలతో పోలిస్తే ఆకర్షణీయంగా కని పించకపోవడంతో చాలా మంది వీటిపై ఆసక్తి చూపడంలే దు. మట్టి విగ్రహాలపై ప్రభుత్వాలు, పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రజలలో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ కారణంగా ఏటేటా వాతావరణ కాలుష్యం పెరుతూనే ఉంది. కొన్ని చోట్ల పర్యావరణ ప్రేమికులు మట్టి విగ్రహాలను పూజిస్తూ పర్యావరణ పరిరక్షణకై ప్రజల కు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీకి ఓ సంఘం ఈ తరుణంలో మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో గతేడాది మట్టి విగ్రహాల తయారీ సంఘం ఏర్పడింది. కె. మంజుల అనే మహిళ ఈ సంఘాన్ని స్థాపించి తనతోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పిస్తోంది. గతేడాది దాదాపు 6 వేల విగ్రహాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు, ఎంజీసీలకు సరఫరా చేశామని, ఈసారి 10 వేల విగ్రహాలను తయారు చేయనున్నట్లు చెబుతోంది. ఈసారి వినాయక చవితి కోసం మూడు నెలల క్రితమే పనులు ప్రారంభించామని, విగ్రహాల తయారీ కూడా దాదాపు పూర్తయినట్లు వివరించింది. మట్టి విగ్రహాల తయారీ ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలని, సర్కారు బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తోంది. -
సిల్వర్ ఫిలిగ్రి హస్తకళతో గణేశుడి విగ్రహం
హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవరూ తయారు చేయని అద్భుత కళాఖండాన్ని కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి సొసైటీ వారు తయారు చేశారు. వారు తయారు చేసిన ఈ కళాఖండాన్ని సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల ముందు ప్రదర్శించారు. సిల్వర్ ఫిలిగ్రి హస్తకళ విధానం 400 ఏళ్ల కిందట కరీంనగర్లో పుట్టింది. వెండి తీగలను చిన్న ,చిన్న ముక్కలుగా చేసి, సూక్ష్మ నిర్మాణ పద్దతిలో సిల్వర్ ఫిలిగ్రి గణేష్ విగ్రహాన్ని తయారుచేశారు. ఇందుకోసం ఎనిమిది మంది కళాకారులు, 18 నెలల పాటు కష్టపడ్డారు. ఒకటిన్నర అడుగుల ఎత్తు, ఒకటిన్నర అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్ర హానికి రూ. 4.50 లక్షల విలువైన వెండిని వినియోగించామని, ఇందుకోసం సొసైటీ సభ్యులందరూ చందాలు వేసుకున్నామని కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ సర్దార్ తెలిపారు. తమ కళను కాపాడుకోవడంతో పాటు కళ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకే దీనిని రూపొందించామని, త్వరలోనే శ్రీకృష్ణుని విగ్రహాన్ని తయారు చేస్తామని చెప్పారు. ఇలాంటి విగ్రహాలను ప్రపంచంలో ఎవరూ తయారు చేయలేరని ఈ సందర్భంగా చెప్పారు. గిన్నిస్ రికార్డు కోసం దరఖాస్తు చేశామని సొసైటీ సభ్యుడు రమేష్‌తో కలసి చెప్పారు.