
బెంగళూరు : ఎక్కడైనా మట్టి, పీఓపీలతో వినాయక విగ్రహాలను తయారు చేయడం చూశాం. అయితే మణిపాల్‌కు చెందిన స్కాండ్ కళకారుడు శ్రీనాథ్ మణిపాల, వెంకి పలిమారు, రవి హిరేబెట్టులు 21 దేశాల కరెన్సీ నోట్లతో వినాయక ప్రతిమ తయారు చేశారు. ఉడిపిలోని విద్యా సముద్ర రోడ్డులోని సాయిరాధ మోటార్స్ సంస్థలో ఆ సంస్థ సహకారంతో ఈ కరెన్సీ విగ్రహాన్ని రూపొందించారు. శ్రీలంక, బంగ్లా దేశ్, చైనా, భూటాన్, అప్ఘానిస్థాన్, బహరైన్, యుఏఇ, అమెరికా తదితర 21 దేశాల కరెన్సీ నోట్లను విగ్రహం తయారీలో ఉపయోగించారు.
Comments
Please login to add a commentAdd a comment