వినాయకుడు ఊగుతున్నాడని ప్రచారం | rumours on vinayakudu shaking | Sakshi
Sakshi News home page

వినాయకుడు ఊగుతున్నాడని ప్రచారం

Published Tue, Sep 9 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

rumours on vinayakudu shaking

 లక్ష్మణచాంద : లక్ష్మణచాంద మండలం రాచాపూర్ అనుబంధ గ్రామమైన పొట్టపెల్లి(కె) గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం తల ఊగుతుందంటూ ప్రచారం జరగడంతో సోమవారం భక్తులు చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి తరలివచ్చారు.

భక్తులు పూలమాల వేసే క్రమంలో తల ఊగడంతోపాటు కళ్లు కూడా ఎరుపు, తెలుపు రంగుల్లోకి మారుతున్న విషయం గమనించిన వారు చుట్టూ పక్కల ఉన్న వారికి సమాచారం అందించారు. వారు వచ్చి గమనించగా మళ్లీ తల ఊగడంతో వినాయకుడి తల ఊగుతుందంటూ ప్రచారం జోరందుకుంది. వినాయకుడి తల ఊగడం కళ్లు ఎరుపు, తెలుపు రంగులోకి మారడం, సోమవారం పౌర్ణమి గడియాలు రావడం వినాయకుడి మహిమగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement