కొన్ని రంగులు కొన్ని సందర్భాలలో ప్రత్యేకత నింపుకుంటాయి. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ కాంబినేషన్‌లో చేసే హంగామా క్రిస్మస్ వేడుకలో మరింతగా వెలిగిపోయేలా చేస్తుంది.
ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగు కాంబినేషన్‌ల డ్రెస్‌లు మాత్రమే కాదు ఇతర అలంకార వస్తువుల్లోనూ ప్రత్యేకత చూపవచ్చు. వాటిలో చేతికి ధరించే బ్రేస్‌లెట్స్, మెడలో ధరించే నెక్‌పీస్, క్రోచెట్ హ్యాండ్ బ్యాగ్స్, హెయిర్ క్లిప్స్ అండ్ బ్యాండ్స్, చెవులకు హ్యాంగింగ్స్ వేడుక ప్రతిఫలించేలా ఎంపిక చేసుకోవచ్చు. నెయిల్ ఆర్ట్‌లో భాగంగా క్రిస్మస్ ట్రీ, శాంటాక్లాజ్, స్టార్స్ డిజైన్స్‌తో మరింతగా మెరిసిపోవచ్చు.
క్రిస్మస్ ట్రీలా నిండైన పచ్చదనాన్ని, ఆత్మీయ ఆప్యాయతలను పంచుకునే కానుకలా, స్వచ్ఛతకు ప్రతిరూపంగా నిలుస్తూ భూమిపైన నక్షత్రాల్లా మెరవాలని ఈ రంగులు సూచిస్తుంటాయి. అందుకే ఈ పండగ పూట అలంకరణలో ఈ రంగులు ప్రధాన భూమికను పోషిస్తుంటాయి. ఆధునికంగానూ ఉంటూనే అంతే హంగునూ పరిచయం చేసే ఈ కలెక్షన్ పండగ వేళ ఎంచుకుంటే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు.
చదవండి: Malavika Sharma: అందమైన అల్లికల శారీలో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక! చీర ధర 68 వేలకు పైమాటే
Comments
Please login to add a commentAdd a comment