గులాబీల గుసగుసలు | Whisper of roses | Sakshi
Sakshi News home page

గులాబీల గుసగుసలు

Published Sun, Feb 16 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

గులాబీల గుసగుసలు

గులాబీల గుసగుసలు

  •     పద్మావతి గార్డెన్‌లో గులాబీల సోయగం
  •      తెలుపు, ఎరువు, పింక్ పువ్వులు
  •      తన్మయత్వం చెందుతున్న సందర్శకులు
  •  అరకులోయ, న్యూస్‌లైన్: పర్యాటక కేంద్రం అరకులోయలోని పద్మావతి గార్డెన్‌లోని గులాబీల సోయగం సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం అన్‌సీజన్ కావడంతో సందర్శకుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉన్నా వచ్చిన వారు ఇక్కడి పూల సొగసుతో తన్మయత్వం చెందుతున్నారు. ఎరుపు, తెలుపు, పింక్...ఇలా పలు రంగుల్లో, రకరకాల ఆకారాలతో పూలు ముచ్చటగొలుపుతున్నాయి.

    గార్డెన్‌లో చూడదగిన అంశాలు ఏమీ లేకపోవడంతో పర్యాటకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నిర్వాహకులు వారిని కొంతైనా సంతోషపరచాలన్న ఉద్దేశంతో గులాబీ తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. అయితే సీజన్ ముగిసిన తరువాత పెంచడంతో అన్‌సీజన్ నాటికి ఇవి విరబూస్తున్నాయి. దీంతో వచ్చిన కొద్దిమందైనా సంతృప్తితో వెనుదిరుగుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement