రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, భారత కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ తన డ్రెస్సింగ్ స్టయిల్‌తో ఆకట్టుకుంటారు. సంప్రదాయ బద్ధంగా చీర కట్టినా, పాశ్చాత్య దుస్తులైనా ఆమెది ప్రత్యేక శైలి. లక్షల ఖరీదు చేసే అత్యంత ఖరీదైన డిజైనర్ దుస్తులు ధరించినా ఆమెకు ఆమే సాటి. హై-ఎండ్ బ్రాండ్‌లను ఇష్టపడే ఫ్యాషన్ ఔత్సాహికులందరికీ నీతా అంబానీ వార్డ్‌రోబ్ ఒక రోల్‌మోడల్
తాజాగా నీతా అంబానీ న్యూయార్క్ వెకేషన్‌లో గూచీ కో-ఆర్డ్ సెట్ ఆకర్షణీయంగా నిలిచింది. నీతా లగ్జరీ లేబుల్ గూచీ నుండి బ్రౌన్-హ్యూడ్ ప్రింటెడ్ కో-ఆర్డ్ సెట్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అంబానీ ఫ్యాన్ పేజీ షేర్ చేసిన వివరాల ప్రకారం న్యూయార్క్ నగర వీధుల్లో ఫ్యాన్స్‌తో ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో ఓపెన్ ట్రెసెస్, డైమండ్ చెవిపోగులు, ఖరీదైన ఓరాన్ చెప్పులను ధరించడం అభిమానులను ఎట్రాక్ట్ చేసింది.
నీతా గూచీ కో-ఆర్డ్ సెట్ విలువ రూ. 2.8 లక్షలు
నీతా గూచీ కో-ఆర్డ్ సెట్ భారీ ధర 2.8 లక్షలు అట. సిల్క్-శాటిన్ జాక్వర్డ్ షర్ట్ ధర 2,128 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 1,76,135. మరోవైపు, ఆమె మ్యాచింగ్ ట్రౌజర్ విలువ 1200 యూరోలు అంటే మన రూపాయిల్లో రూ. సుమారు 1,08,805. మొత్తం మీద నీతా అంబానీ కో-ఆర్డ్ సెట్ ఖరీదు రూ. 2,84,940 అని తెలుస్తోంది.
ఓరాన్ చెప్పుల విలువ రూ. 6.5 లక్షలు
నీతా అంబానీ ధరించి విలాసవంతమైన పాదరక్షల జత విలువ భారతీయ కరెన్సీలో దాదాపు 7 లక్షల రూపాయలు (రూ. 6,49,428).
ఇక ఆమె చీరల విషయానికి వస్తే సాంప్రదాయ, నేత చీరలకు ముఖ్యంగా గుజరాతీ పటోలా చీరల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇటీవల రూ. 1.7 లక్షలు విలువైన డిజైనర్ నవదీప్ తుండియా రూపొందించిన నీలం , ఎరుపు రంగు కలగలిసిన గుజరాతీ పటోలా మెరిసిన సంగతి తెలిసిందే.
గార్జియస్ బిజినెస్ విమెన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు నీతా అంబానీ లగ్జరీ లేబుల్ వైఎస్‌ఎల్ హీల్స్ ఎక్కువగా ధరిస్తారు. ఆమె వార్డ్‌రోబ్‌లో ఉన్న 6 ఖరీదైన వైఎస్‌ఎల్ హీల్స్ ఉన్నాయట.
Comments
Please login to add a commentAdd a comment