musical Celebration
-
అలరించిన ‘సుస్వరాల హరివిల్లు’
దాదర్: ఆంధ్ర మహాసభ, స్వరమాధురి సంగీత సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దాదర్‌లోని ఈఎన్ వైద్య సభాగృహంలో ‘సుస్వరాల హరివిల్లు’పేరిట నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వరమాధురి సంగీత సంస్థ సహాకారంతో ఈ సుస్వరాల హరివిల్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, తెలుగు భాష, సంస్కృతుల వ్యాప్తిలో ఇది తొలి అడుగుగా భావిస్తున్నామని ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముంబైలో ఉన్న తెలుగు సంఘాలన్నింటినీ ఏకం చేసి తెలుగు భాష, సంస్కృతులను మరింతగా వ్యాప్తిచేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. గత 13 ఏళ్లుగా తమ సంస్థ గుడ్ మ్యూజిక్, గుడ్ కల్చర్ అనే స్ఫూర్తితో ముందుకు సాగుతోందని..స్థానిక గాయనీ గాయకులకు సంగీత శిక్షణ సత్ఫలితాలను సాధిస్తున్నామని స్వరమాధురి సంగీత సంస్థ అధ్యక్షుడు అశ్వినీ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్ర మహాసభలో తొందర్లోనే ఏసీ ఆడిటోరియాన్ని నిరి్మస్తామని మహాసభ ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేష్ పేర్కొన్నారు. ఆకట్టుకున్న ‘ఆణిముత్యాలు’ ఈ సంగీత విభావరిలో నాటి నుంచి నేటి వరకు ముఖ్యంగా గత 65 ఏళ్లలో వచ్చిన తెలుగు సినిమాలలోని 20 ఆణిముత్యాల్లాంటి పాటలను గాయనీ గాయకులు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సోని కొమాండూరి, స్వరమాధురి గాయనీగాయకులు శశికిరణ్, ప్రణవ్ శేషసాయి, వంశీ సౌరబ్, గిరిజా ద్విభాష్యం, డా స్రవంతి, మయాఖ, మాహి, సుజాత తమదైన శైలిలో పాటలుపాడి ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. వీరికి ఆర్టి రాజన్, విక్కి ఆదవ్, ప్రణవ్ కుమార్, రోషన్ కాంబ్లే, రమేష్ కాలే, బాలా జాధవ్, వినీత్ వాద్యసహకారం అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ స్వాగతం పలకగా కల్పన గజ్జెల, తాండవకృష్ణ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సంధ్య పోతురి వందన సమర్పన చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల చైర్మన్ మంతెన రమేష్ కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, సభ్యులు సంగం ఏక్నాథ్, భోగ సహాదేవ్, ద్యావరశెట్టి గంగాధర్, గాలి మురళి, ఆంధ్ర మహసభ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ఉపాధ్యక్షుడు తాళ్ల నరేష్, గాజెంగి వెంకటేశ్వర్, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, కోశాధికారి వేముల మనోహర్, సంయుక్త కార్యదర్శులు కటుకం గణేష్ , అల్లె శ్రీనివాస్, మచ్చ సుజాత, కొక్కుల రమేష్, ప్రహ్లాద్, క్యాతం సువర్ణ, చిలివేరి గంగాదస్, పీచుక రత్నమాల, చిలుక వినాయక్, మహిళ శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, ఉపాధ్యక్షురాలు వి శ్యామల రామ్మోహన్, కార్యదర్శి పిల్లమారపు పద్మ, కార్యవర్గ సభ్యులు గాలి స్వర్ణ, తాళ్ల వనజ, భోగ జ్యోతిలక్షి్మ, బెహరా లలిత, స్వరమాధురి సంగీత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు గిరిజా ద్విభాష్యం, అ«ధ్యక్షుడు అశ్వనీ కుమార్, ప్రధాన కార్యదర్శి కల్పన గజ్జల, తాండవకృష్ణ , రమణిరావు, ఈశ్వర్, జగన్నాధరావు, జికె మోహన్, హరీష్ , పోతురి సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
రచ్చకెక్కిన మరక్కుమా..నెంజం!
సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ బృందం నిర్వహించిన ‘మరక్కుమా..నెంజం’ సంగీత వేడుక రచ్చకెక్కింది. 20 వేల సీట్లు ఉన్న చోట 40 వేలకు పైగా టికెట్లను నిర్వాహకులు విక్రయించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. తమ అభిమాన సంగీత దర్శకుడు, గాయకుడి స్వరాన్ని ప్రత్యక్షంగా వినేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయక పోవడంతో ఆ మార్గంలో సీఎం స్టాలిన్ కాన్వాయ్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఈ ఘటనపై విచారణకు డీజీపీ శంకర్ జివ్వాల్ ఆదేశాలు జారీ చేశారు. తాంబరం కమిషనర్ అమల్ రాజ్ నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది. సాక్షి, చైన్నె: సంగీత మాంత్రికుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అంటే పడిచచ్చి పోయే అభిమానులు దేశ విదేశాల్లో భారీ సంఖ్యలో ఉన్నారు. ఆయన నేతృత్వంలో మ్యూజికల్ నైట్స్, సంగీత వేడుక ఎక్కడైనా జరుగుతుందంటే చాలు జిల్లాలు, రాష్ట్రాలు దాటి వచ్చి మరీ వీక్షించే అభిమానులు ఉన్నారు. ఆ దిశగా గత నెల ఓ ప్రైవేటు సంస్థ నేతృత్వంలో చైన్నె శివార్లలోని పనయూరులో ఏర్పాట్లు చేశారు. చివరి క్షణంలో వర్షం పడడంతో మరో తేదీకి వేడుకను మార్చారు. ఆ మేరకు సంగీతోత్సవం ఆదివారం అర్ధరాత్రి వరకు సాగింది. టికెట్ల రూపంలో రచ్చ.. 20 వేల మంది కూర్చుని చూసేందుకు పనయూరులో ఏర్పాట్లు ఉన్నాయి. అయితే నిర్వాహకులు మాత్రం 40 వేలకు పైగా టికెట్లను విక్రయించారు. వివిధ కేటగిరీలలో ఒక్కో టికెట్టు ధర రూ. 10 వేలు, రూ. 25 వేలకు పైగా పలికాయి. సరైన సలహాలు ఇచ్చే వారు లేక పోవడంతో అభిమానులకు కష్టాలు తప్పలేదు. అలాగే పార్కింగ్ ఏర్పాట్లు సరిగ్గా లేక పోవడంతో వచ్చిన అభిమానులు రోడ్డు పక్కగా వాహనాలను ఆపేశారు. సంగీతోత్సవ వేదిక నిండి పోవడంతో లోనికి వేలాది మంది వెళ్ల లేకపోయారు. తమ వద్ద టికెట్లు ఉన్నా, అనుమతించక పోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. నిర్వహకుల నుంచి సరైన సమాధానం రాక పోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న టికెట్లును చించి పడేసి ఏఆర్ రెహ్మాన్ స్పందించాలంటూ నినాదాలు చేశారు. ట్రాఫిక్‌లో సీఎం కాన్వాయ్.. సీఎం స్టాలిన్ కాన్వాయ్ పనయూరు మార్గంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కింది. మామండూరులో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై రాత్రి తిరుగు పయనంలో సీఎం స్టాలిన్ కాన్వాయ్ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. చివరికి అర్ధరాత్రి వేళ పోలీసు బాసులు పరుగులు తీయాల్సి వచ్చింది. ట్రాఫిక్ కష్టాలతో పాటు సంగీతోత్సవంలో అభిమానులకు ఎదురైన అనుభవనాలు, అధిక టికెట్ల విక్రయాల వ్యవహారం చివరకు సోమవరం ఉదయం పోలీసుల దృష్టికి చేరింది. అలాగే, సామాజిక మాధ్యమాల్లో నిర్వాహకులు, ఏఆర్‌కు వ్యతిరేకంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో డీజీపీ శంకర్ జివ్వాల్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తాంబరం పోలీసు కమిషనర్ అమల్‌రాజ్ నేతృత్వంలోని బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందంలోని సభ్యులు నిర్వహకులను వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో అభిమానులకు నిర్వాహకులు క్షమాపణ చెప్పారు. ఇక, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ స్పందిస్తూ, టికెట్లు ఉన్నా, తన కార్యక్రమాన్ని వీక్షించ లేక పోయిన అభిమానులు, ఆ ఫొటోలను తన మెయిల్‌కు పంపించాలని, తన బృందంలోని వారు అభిమానులను సంప్రదిస్తారని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే తాను ఎవరో చేసే తప్పులకు తాను బలిపశువు అవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. -
నీతా అంబానీ మరో గ్రాండ్ ఈవెంట్.. సంగీత దిగ్గజాలతో ‘పరంపర’
రిలయన్స్ ఫౌండేషన్ స్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ మరో గ్రాండ్ ఈవెంట్‌కు తెరతీశారు. అనాదిగా వస్తున్న గురు శిష్య సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో 'పరంపర' అనే పేరుతో వారం రోజుల వేడుకను ప్రారంభించారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలో సజీవ దిగ్గజాలు పద్మ విభూషణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ కార్తీక్ కుమార్, వారి శిష్యులు రాకేష్ చౌరాసియా, నీలాద్రి కుమార్‌లతో కలిసి నీతా అంబానీ జ్యోతి ప్రజ్వలన చేశారు. ధీరూభాయ్ అంబానీకి ఘన నివాళి కార్యక్రమంలో భాగంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ అయిన నీతా అంబానీ తన గురువు, మామ దివంగత ధీరూభాయ్ అంబానీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువుల ఔన్నత్యాన్ని వివరించారు. పవిత్రమైన గురు పూర్ణిమ రోజున, మనకు మొదటి గురువులైన తల్లిదండ్రులను గౌరవించుకుందామని పిలుపునిచ్చారు. తనకు అత్యంత స్ఫూర్తిదాయకమైన గురువులలో ఒకరైన ధీరూభాయ్ అంబానీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. Mrs. Nita Ambani inaugurated, ‘Parampara’ a two day special celebration of the timeless guru-shishya legacy with a traditional lamp lighting ceremony accompanied by Pandit Hariprasad Chaurasia, Pandit Kartick Kumar & their illustrious disciples Rakesh Chaurasia and Niladri Kumar. pic.twitter.com/pTmWQk4f47 — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) July 1, 2023 ఇదీ చదవండి: వైట్‌హౌస్‌లో మెరిసిన అంబానీ దంపతులు.. -
ఫిబ్రవరిలో ఘంటసాల సంగీత ఆరాధనోత్సవం
రాజమండ్రి కల్చరల్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 13, 14 తేదీల్లో రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో 24 గంటల నిర్విరామ ఘంటసాల సంగీత ఆరాధనోత్సవం నిర్వహించనున్నట్టు హైదరాబాద్‌కు చెందిన కిన్నెర ఆర్ట్ థియేటర్ కార్యదర్శి మద్దాలి రఘురామ్ వెల్లడించారు. స్థానిక ఆనం రోటరీ హాలులో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి గాయనీ గాయకులు బృందాలుగా కానీ, విడిగా కానీ ఘంటసాల పాటలు ఆలపిస్తారన్నారు. ఇందుకోసం ఘంటసాల పాటలు పాడిన 200 సినిమాలను ఎంపిక చేశామని తెలిపారు. ఒకరు పాడిన పాటను మరొకరు పాడరాదన్నారు. మూడు ఆర్కెస్ట్రా బృందాలు పాల్గొంటాయన్నారు. 14న జరిగే ముగింపు ఉత్సవంలో ఘంటసాల అర్ధాంగి సావిత్రమ్మ, తనయుడు రత్నకుమార్, ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, సినీ సంగీత దర్శకుడు ఆనంద్ తదితరులు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో పాల్గొనగోరే గాయనీ గాయకులు 98660 57777 సెల్ నంబర్లో సంప్రదించాలని రఘురామ్ కోరారు. విలేకరుల సమావేశంలో సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావు, నటుడు, గాయకుడు జిత్‌మోహన్ మిత్రా, ‘కిన్నెర’ కోశాధికారి కేవీ సుబ్బారావు కె.వెంకటేశ్వరరావు, సాహితీవేత్త ఫణి నాగేశ్వరరావు పాల్గొన్నారు.