ఆంధ్రమహాసభ, స్వరమాధురి ఆధ్వర్యంలో సంగీత విభావరి
దాదర్, ఈఎన్ వైద్య సభాగృహంలో నిర్వహణ
నాటి, నేటి మధుర గీతాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గాయనీగాయకులు
దాదర్: ఆంధ్ర మహాసభ, స్వరమాధురి సంగీత సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దాదర్‌లోని ఈఎన్ వైద్య సభాగృహంలో ‘సుస్వరాల హరివిల్లు’పేరిట నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వరమాధురి సంగీత సంస్థ సహాకారంతో ఈ సుస్వరాల హరివిల్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, తెలుగు భాష, సంస్కృతుల వ్యాప్తిలో ఇది తొలి అడుగుగా భావిస్తున్నామని ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముంబైలో ఉన్న తెలుగు సంఘాలన్నింటినీ ఏకం చేసి తెలుగు భాష, సంస్కృతులను మరింతగా వ్యాప్తిచేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
గత 13 ఏళ్లుగా తమ సంస్థ గుడ్ మ్యూజిక్, గుడ్ కల్చర్ అనే స్ఫూర్తితో ముందుకు సాగుతోందని..స్థానిక గాయనీ గాయకులకు సంగీత శిక్షణ సత్ఫలితాలను సాధిస్తున్నామని స్వరమాధురి సంగీత సంస్థ అధ్యక్షుడు అశ్వినీ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్ర మహాసభలో తొందర్లోనే ఏసీ ఆడిటోరియాన్ని నిరి్మస్తామని మహాసభ ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేష్ పేర్కొన్నారు.
ఆకట్టుకున్న ‘ఆణిముత్యాలు’
ఈ సంగీత విభావరిలో నాటి నుంచి నేటి వరకు ముఖ్యంగా గత 65 ఏళ్లలో వచ్చిన తెలుగు సినిమాలలోని 20 ఆణిముత్యాల్లాంటి పాటలను గాయనీ గాయకులు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సోని కొమాండూరి, స్వరమాధురి గాయనీగాయకులు శశికిరణ్, ప్రణవ్ శేషసాయి, వంశీ సౌరబ్, గిరిజా ద్విభాష్యం, డా స్రవంతి, మయాఖ, మాహి, సుజాత తమదైన శైలిలో పాటలుపాడి ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. వీరికి ఆర్‌టి రాజన్, విక్కి ఆదవ్, ప్రణవ్ కుమార్, రోషన్ కాంబ్లే, రమేష్ కాలే, బాలా జాధవ్, వినీత్ వాద్యసహకారం అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ స్వాగతం పలకగా కల్పన గజ్జెల, తాండవకృష్ణ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సంధ్య పోతురి వందన సమర్పన చేశారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల చైర్మన్ మంతెన రమేష్ కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, సభ్యులు సంగం ఏక్‌నాథ్, భోగ సహాదేవ్, ద్యావరశెట్టి గంగాధర్, గాలి మురళి, ఆంధ్ర మహసభ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ఉపాధ్యక్షుడు తాళ్ల నరేష్, గాజెంగి వెంకటేశ్వర్, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, కోశాధికారి వేముల మనోహర్, సంయుక్త కార్యదర్శులు కటుకం గణేష్ , అల్లె శ్రీనివాస్, మచ్చ సుజాత, కొక్కుల రమేష్, ప్రహ్లాద్, క్యాతం సువర్ణ, చిలివేరి గంగాదస్, పీచుక రత్నమాల, చిలుక వినాయక్, మహిళ శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, ఉపాధ్యక్షురాలు వి శ్యామల రామ్‌మోహన్, కార్యదర్శి పిల్లమారపు పద్మ, కార్యవర్గ సభ్యులు గాలి స్వర్ణ, తాళ్ల వనజ, భోగ జ్యోతిలక్షి్మ, బెహరా లలిత, స్వరమాధురి సంగీత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు గిరిజా ద్విభాష్యం, అ«ధ్యక్షుడు అశ్వనీ కుమార్, ప్రధాన కార్యదర్శి కల్పన గజ్జల, తాండవకృష్ణ , రమణిరావు, ఈశ్వర్, జగన్నాధరావు, జికె మోహన్, హరీష్ , పోతురి సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment