Nita Ambani birthday: దీపాలతో వేడుక : ఉత్సాహంగా చిన్న కోడలు | Nita Ambani 60th birthday Her Staff Celebrate With Diyas | Sakshi
Sakshi News home page

నీతా అంబానీ 60వ బర్త్‌డే : దీపాలతో సంబరం, ఉత్సాహంగా చిన్న కోడలు

Published Fri, Nov 1 2024 2:48 PM | Last Updated on Fri, Nov 1 2024 4:54 PM

 Nita Ambani 60th birthday Her Staff Celebrate With Diyas

రిలయన్స్‌  ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌  వ్యాపారవేత్త ,పరోపకారి, నీతా అంబానీ 60వ పుట్టిన రోజు (నవంబరు 1). ఈ సందర్భంగా  కొత్తకోడలు, నీతా చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ భార్య, రాధిక మర్చంట్‌, కంపెనీ సిబ్బంది ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్‌ఎంఏసీసీ కూడా నీతా అంబానీకి స్పెషల్‌ విషెస్‌ తెలుపుతూ ట్వీట్‌ చేసింది. 

అలాగే  పలువురు సెలబ్రిటీలు నీతా అంబానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించారు. ఐపీఎల్‌టీం ముంబై ఇండియన్స్‌  కూడా  ఎక్స్‌ ద్వారా విషెస్‌ తెలిపింది. 
 

 

నీతా బర్త్‌డేను కంపెనీ సిబ్బంది దీపాలతో స్పెషల్‌గా సెలబ్రేట్‌ చేశారు.  దీపాలను వెలిగించిన పళ్లెంతో ఆమెకు హారతి ఇచ్చారు. హ్యాపీ బర్త్‌డే పాటను ఆలపించారు. దీంతో నీతా అంబానీ ఆనందంతో మెరిసి పోయింది. ఈ వేడుకలో  చిన్నకోడలు రాధిక మర్చంట్‌ ఉత్సాహంగా పాల్గొంది. 

పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాషన్‌ ఐకాన్‌  నీతా అంబానీ గులాబీ రంగు చీరలో  మెరిసారు. మెడలో మూడు పేటల ముత్యాల హారం,  మ్యాచింగ్‌  చెవిపోగులు, రింగుల జుట్టుతో మరింత అందంగా కనపించారు.  అత్తగారికి తగ్గట్టుగా  చోటి బహు, రాధిక మర్చంట్ కూడా  గులాబీ రంగు పూల దుస్తుల్లో మెరిసింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement