
లవ్‌బర్డ్స్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం సందర్భంగా అనంత్ తల్లి, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ పవిత్ర వారణాసి నగర గొప్పదనాన్ని తన అభిమానులతో పంచుకున్నారు.
దేశీయ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచంతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఎన్‌ఎంఏసీసీని స్థాపించిన తమ దార్శనికతకు అనుగుణంగా, తమ కుటుంబంలోని వివాహ వేడుకలకు ముందు పవిత్ర నగరమైన వారణాసికి నివాళులర్పిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. నీతా అంబానీ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అరుదైన రంగత్ స్వదేశీ బనారసీ చీరలో హుందాగా కనిపించారు.
~ Auspicious Beginnings: An Ode to Kashi ~ pic.twitter.com/GXVcIXIeBh
— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) July 12, 2024
కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహ వేడుకల్లో భాగంగా వరుడి తల్లి, నీతా అంబానీ వారణాసిని సందర్శించి వివాహ తొలి ఆహ్వానాన్ని కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే..
Comments
Please login to add a commentAdd a comment