Beautiful Gift To Anant Ambani Fiance Radhika Merchant By Nita Ambani - Sakshi
Sakshi News home page

నీతా అంబానీ అద్భుత గిఫ్ట్‌: మురిసిపోతున్న కాబోయే కోడలు

Published Thu, Jul 20 2023 6:52 PM | Last Updated on Thu, Jul 20 2023 9:05 PM

Beautiful gift to Anant Ambani fiance Radhika Merchant by Nita Ambani - Sakshi

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా కాబోయే చోటి బహు (చిన్న కోడలు) రాధికా మర్చంట్‌కి అత్తగారు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారట. అనంత్ అంబానీ కాబోయే  భార్య రాధికా మర్చంట్‌కి నీతా అంబానీ ఒక అందమైన బహుమతి ఇవ్వడం వైరల్‌గా మారింది.  నీతా, ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీతో నిశ్చితార్థం తరువాత రాధికా మర్చంట్ అంబానీ కుటుంబంలో కీలక వ్యక్తిగా మారిపోవడమే కాదు, అత్తమామలతో పాటు, తోటికోడలు శ్లోకా మెహతా, ఆడపడుచు ఇషా అంబానీ కుటుంబాలతో బాగా కలిసి పోయింది. ఏ ఈవెంట్లో చూసిన వారితో సందడి చేస్తోంది. (హెచ్‌డీఎఫ్‌సీ సీఈవో శశిధర్‌ వార్షిక వేతనం ఎంతో తెలుసా? )

తాజాగా నీతా అంబానీ తన కాబోయే కోడలు రాధికా మర్చంట్ కోసం సిద్ధం చేసిన అందమైన గిఫ్ట్ హ్యాంపర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, తులసి మొక్కతోవెండి కుండీతోపాటు పాటు, వెండి అగరుబత్తీ స్టాండ్, లక్ష్మీ-గణేష్ విగ్రహాలసెట్‌ను చూడవచ్చు. అంతేకాదు తెల్ల చామంతి పువ్వులతో  అద్భుతంగా అలంకరించిన ఈ  స్పెషల్‌ హాంపర్‌ నెటిజనులను ఆకట్టుకుంటోంది.  (లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్‌ స్పోర్ట్స్‌కారు కొన్న బాలీవుడ్‌ యాక్టర్‌, వీడియో )

జనవరిలో గుజరాతీ సంప్రదాయాల ప్రకారం సాంప్రదాయ 'గోల్ ధన' వేడుకలో రాధికా మర్చంట్ ,అనంత్ అంబానీ నిశ్చితార్థం చేసుకున్నారు.  నీతా అంబానీ మాదిరిగానే రాధికా మర్చంట్ కూడా అందమైన భరతనాట్యం నృత్యకారిణి కూడా. జూన్ 2022లో, 'ది గ్రాండ్ థియేటర్' (జియో వరల్డ్ సెంటర్)లో ఆరంగేట్రం  చేసిన సంగతి తెలిసిందే. (సినిమాలకు బ్రేక్‌: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement