Boney Kapoor Gets Brutally Trolled For Holding Gigi Hadid Waist At NMACC Launch, Goes Viral - Sakshi
Sakshi News home page

Boney Kapoor: మోడల్‌ నడుము పట్టుకున్న బోని కపూర్‌.. ఆడేసుకున్న నెటిజన్స్‌

Published Tue, Apr 4 2023 5:26 PM | Last Updated on Tue, Apr 4 2023 5:46 PM

Boney Kapoor Gets Trolled For Holding Gigi Hadid Waist - Sakshi

సినీ ప్రముఖులకు జనాల్లో ఎంత క్రేజ్‌ ఉంటుందో అందరికి తెలిసిందే. వాళ్లు ఏం చేసినా..అది వార్తే అవుతుంది. వారు చేసే ప్రతి పనిని అభిమానులు గమనిస్తారు. మంచి పని చేస్తే ఆకాశానికి ఎత్తేస్తారు. తప్పు చేస్తే అంతే దారుణంగా  ట్రోల్‌ చేస్తారు. అయితే ఒక్కోసారి అనుకోకుండా జరిగిన తప్పుకు, అసలు వాళ్ల దృష్టిలో అది తప్పే కాకపోయినా.. నెటిజన్స్‌ సదరు సినీ ప్రముఖులను ట్రోల్‌ చేస్తుంటారు. అలాంటి ట్రోలింగే ఇప్పుడు ప్రముఖ నిర్మాత బోని కపూర్‌కు ఎదురైంది. ఓ బాలీవుడ్‌ మోడల్‌ నడుముపై చేతులు వేశాడంటూ అతన్ని ట్రోల్‌ చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే... రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘నీతా ముఖేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌(NMACC)’ ప్రారంభోత్సవం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో  ఏర్పాటు చేసిన ఈ  ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.  షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, వరుణ్‌ ధావన్‌తో పాటు ప్రముఖ నిర్మాత బోని కపూర్‌ కూడా హాజరయ్యాడు.

అలాగే హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ మోడల్‌ జిగి హడిద్‌ కూడా ఈ లాంచింగ్‌ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసింది. అక్కడ బోని కపూర్‌ కనిపించడంతో దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరిం. అనంతరం ఇద్దరు కలిసి ఫోటోకి ఫోజులు ఇచ్చారు. అదే ఇప్పుడు ట్రోలింగ్‌కు కారణమైంది. ఫోటో దిగే క్రమంలో బోని కపూర్‌ జిగి హడిద్‌ నడుముపై చేతులు వేశారు. అయితే ఆయన మాత్రం క్యాజువల్‌గానే చేతులు వేసి ఫోటో దిగారు. జిగి సైతం అలానే భావించి లైట్‌ తీసుకుంది. కానీ నెటిజన్స్‌ మాత్రం ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఈ ఫోటోని షేర్‌ చేసూ బోనీ కపూర్‌ని దూషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement