‘ఆయన జెంటిల్‌మ్యాన్‌.. విమర్శలు మానండి’ | Urvashi Rautela Said Boney Kapoor Is A Gentleman | Sakshi
Sakshi News home page

నెటిజన్లపై మండిపడ్డ ఊర్వశి రౌతెలా

Published Tue, Apr 2 2019 7:05 PM | Last Updated on Tue, Apr 2 2019 7:09 PM

Urvashi Rautela Said Boney Kapoor Is A Gentleman - Sakshi

అప్పుడప్పుడు మనం చాలా సాధరణంగా చేసే పనులే మనల్ని చిక్కుల్లో పడేస్తాయి. మన తప్పేం లేకున్నా విమర్శలు స్వీకరించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌. ఓ వివాహ వేడుకు హాజరైన బోనీ కపూర్‌ అక్కడ నటి ఊర్వశి రౌతెలాతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. ఆ తర్వాత ఈ ఫోటోలను ఎవరో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీటిని చూసిన అభిమానులు వీరి మీద విరుచుకుపడుతున్నారు. బోనీ కపూర్‌ సదరు నటితో అసభ్యంగా ప్రవర్తించాడని ఇది ఆయనకు తగదని కామెంట్‌ చేస్తున్నారు.

‘బోనీ కపూర్‌ స్థానంలో ఓ సాధరణ వ్యక్తి ఉండి.. ఇలానే బిహేవ్‌ చేస్తే ఆ నటి ఊరుకునేదా. కానీ అక్కడ ఉన్నది ఓ బడా నిర్మాత కావడంతో ఆమె కిక్కురుమనడం లేద’ని కామెంట్‌ చేశారు. దీనిపై పేపర్లో వార్తా కథనాలు కూడా వచ్చాయి. వీటిపై స్పందించిన ఊర్వశి రౌతెలా ఓ పేపర్లో వచ్చిన ‘ఊర్వశిని బోనీ పట్టుకోబోయారు. అప్పుడు ఆమె ‘డోన్ట్‌ టచ్‌’ అని వార్నింగ్‌ ఇచ్చారు’ అనే న్యూస్‌ ఐటమ్‌ని స్ర్కీన్‌ షాట్‌  తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘ఇది ఇండియాలో చాలా ప్రసిద్ధి చెందిన న్యూస్‌ పేపర్‌. దీనిలో వచ్చిన వార్త ఇది. మహిళల్ని గౌరవించడం రాని మీరు ఇంకెప్పుడు స్త్రీ స్వేచ్ఛ, మహిళా శక్తి గురించి మాట్లాడకండి. బోనీ కపూర్‌ ఒక జెంటిల్‌మ్యాన్‌. ఆయనతో ఫోటో దిగడం గౌరవంగా భావించాను. ఇకనైనా విమర్శిచడం ఆపండి’ అంటూ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement