NMACC Party 500 Notes Instead of Tissue Here Is Truth Behind Viral Photo - Sakshi
Sakshi News home page

NMACC పార్టీలో టిష్యూ పేపర్‌ బదులుగా, రూ.500  నోటా? నిజమా?

Published Mon, Apr 3 2023 3:35 PM | Last Updated on Mon, Apr 3 2023 5:43 PM

NMACC party 500 notes instead of tissue here is truth behind viral photo - Sakshi

సాక్షి, ముంబై: బిలియనీర్‌, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌  నీతా అంబానీ ‘నీతా ముఖేశ్‌  అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC)’ ప్రారంభం వేడుకల్లో మరో విషయం ఆసక్తికరంగా మారింది. టిష్యూ పేపర్లలా రూ. 500నోట్లను ఉంచారన్న వార్త ఇంటర్నెట్‌లో  తెగ వైరల్‌ అయింది. (NMACC: డాన్స్‌తో ఇరగదీసిన షారూక్, గౌరీ, ఇక ప్రియాంక చోప్రా డాన్స్‌కైతే )

బాలీవుడ్‌, హాలీవుడ్‌ సెలబ్రిటీలతోపాటు, ఇతర ప్రముఖులు సందడి చేసిన అంబానీల  గ్రాండ్‌ పార్టీపై  ఒక ట్విటర్‌ యూజర్‌  ఒక పోస్ట్‌ పెట్టారు. అంబానీ జీ కే పార్టీ మే టిష్యూ పేపర్ కీ జగహ్ 500 కే నోట్స్ హోతే హై (sic)’’ అని   ట్వీట్‌ చేశాడు. దీంతో రుచి కరమైన వంటకాలతో పాటు కరెన్సీ నోట్లు వడ్డించారా అంటూ నెటిజన్ల కామెంట్లు  వైరలయ్యాయి. (అమ్మ విషయంలో అది చాలా బాధగా ఉంటుంది: ఇన్ఫీ నారాయణమూర్తి )

నీతా అంబానీ కలల ప్రాజెక్ట్‌ లాంచింగ్‌ సందర్భంగా వడ్డించిన తీపి పదార్థంపైనే ఈ చర్చ అన్నమాట. అతిథులకు వడ్డింయిన ఖరీదైన వంటకాలకు తోడు, ఈ స్వీటు, కరెన్సీ నోట్లతోపాటు ఉండటంతో ఈ ప్రత్యేక స్వీట్‌ ఫొటో హాట్‌ టాపిక్‌గా నిలిచింది.  మీమ్స్‌తో  నెటిజన్లు సందడి చేశారు.

అయితే అసలు విషయం ఏమిటంటే.. ఈ స్వీట్‌ పేరు  ‘దౌలత్‌ కి చాట్‌’ (daulat ki chaat) ఉత్తర భారతదేశంలో చాలా ఇష్టపడే వంటకం. ప్రత్యేకంగా శీతాకాలంలో ఎక్కువ సేవిస్తారట. బాగా మరిగించిన పాలను చల్లబరిచిన తర్వాత తయారు చేస్తారు. పిస్తా, కోవా,బాదం,చక్కెర తదితర రిచ్‌ ఇంగ్రీడియెంట్స్‌తో  గార్నిష్‌ చేస్తారంటూ ఫుడ్‌ ఎక్స్‌పర్ట్స్‌,  కొంతమంది  నెటిజన్లు స్పందించారు. ఈ  స్వీట్‌  ఢిల్లీలో కూడా చాలా పాపులర్‌ అని  ఒకరు. ఇది  చాలా రెస్టారెంట్లలో ఇది దొరుకుతుందని మరికొంతమంది వ్యాఖ్యానించారు.  ఈ ఫుడ్ ఐటమ్ చుట్టూ పెట్టిన కరెన్సీ నోట్లు కూడా నకిలీవే అంటూ మరొకరు రిప్లై ఇచ్చారు. దీంతో అంబానీ పార్టీలో కరెన్సీ నోట్ల వడ్డన అనే  ఊహాగానాలకు చెక్‌ పడింది. 

కాగా శుక్రవారం సాయంత్రం మొదలైన ఈ గ్రాండ్‌ ఈవెంట్‌ ఉత్సవాలు మూడురోజుల పాటుసాగాయి. నీతా అంబానీ స్వయంగా ప్రదర్శించిన నృత్యప్రదర్శనతోపాటు, బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారల డ్యాన్స్‌లు,  షారూక్‌, గౌరీ డాన్స్‌, ప్రియాంక చోప్రా, రణవీర్‌ స్టెప్పులు, టాలీవుడ్‌ ఆస్కార్ విన్నర్‌ సాంగ్‌ నాటునాటు పాటకు రష్మిక, అలియా నృత్యం, అలాగే శనివారం జరిగిన ఈవెంట్లో ఆస్కార్‌ విజేత ముంబైకి వచ్చి పింక్ కార్పెట్‌పై అలరించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement