Anand Mahindra Lauds About NMACC, Tweets Goes Viral - Sakshi
Sakshi News home page

NMACC: ప్రశంసలు: నీతా ‘షో’ కు కదిలిపోయిన ఆనంద్‌ మహీంద్ర

Published Sat, Apr 1 2023 4:46 PM | Last Updated on Sat, Apr 1 2023 5:56 PM

Anand Mahindra lauds about NMACC tweets goes viral - Sakshi

సాక్షి: ముంబై:  రిలయన్స్‌ అధినేత  ముఖేశ​ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ ప్రారంభించిన  డ్రీమ్‌  ప్రాజెక్ట్‌ నీతా ముఖేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ (ఎన్‌ఎంఏసీసీ) ఎం అండ్‌ ఎం అధినేత బిలియనీర్‌  ఆనంద్‌ మహీంద్ర ప్రశంసలు  కురిపించారు.

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ 'ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్' షోపై తన అనుభవాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. మ్యూజికల్ షో కథనం తన హృదయాన్ని కదిలించిందనీ,  ముఖ్యంగా  నీతా అంబానీ రఘుపతి రాఘవ రాజా రామ్‌కి పాటతో పూజ్య బాపూజీని గుర్తు చేశారంటూ అభినందించారు. (NMACC: నీతా అంబానీ అద్భుతమైన డ్యాన్స్‌,  మీరూ ఫిదా అవ్వాల్సిందే!)

వరుస ట్వీట్లలో ఈ సందర్భంగా  తన సంతోషాన్నిపంచుకున్న ఆనంద్‌ మహీంద్ర  అద్భుతమైన ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించినందుకు  ముఖేశ్‌, నీతా అంబానీలకు ధన్యవాదాలు తెలిపారు.  థియేటర్ డైరెక్టర్ ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. లైట్‌ అండ్‌ సౌండ్ అద్భుతం. హృదయాన్ని కదిలించే ఈ షోను తనఇద్దరు మనవళ్లు ఈ ప్రదర్శన చూసి, దీని గొప్పతనాన్ని గ్రహించాలని కోరుకోంటున్నా అంటూ ట్వీట్‌ చేశారు. (నీతా అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ లాంచ్‌: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్‌ )


కాగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నడిబొడ్డునున్న జియో వరల్డ్ సెంటర్‌లో అట్టహాసంగా నిర్వహించిన ఎన్‌ఎంఏసీసీ  గ్రాండ్ ఓపెనింగ్‌కు బిలియనీర్ ఆనంద్ మహీంద్రా   భార్య అనురాధతో సహా హాజరయ్యారు.  బ్లాక్‌ జోధ్‌పురి సూట్‌లో ఆనంద్‌మహీంద్రా, పూల జరీ వర్క్‌ సాల్మన్ పింక్ చీరలో భార్య అనూరాధ  క్లాసీగా స్పెషల్‌గా కనిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement