నీతా.. నిన్నే పెళ్లాడుతా! ట్రాఫిక్‌ సిగ్నల్‌లో ప్రపోజ్‌ | Mukesh Ambani stopped car in traffic proposed to Nita Ambani | Sakshi
Sakshi News home page

నీతా.. నిన్నే పెళ్లాడుతా! ట్రాఫిక్‌ సిగ్నల్‌లో ప్రపోజ్‌

Published Fri, Nov 1 2024 9:23 PM | Last Updated on Fri, Nov 1 2024 9:29 PM

Mukesh Ambani stopped car in traffic proposed to Nita Ambani

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ జీవిత భాగస్వామి నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో ఎంతో ముఖ్యమైన ముఖేష్ అంబానీతో ప్రేమ కథ ఎలా ప్రారంభమైందో ఈ కథనంలో తెలుసుకుందాం..

ధీరూభాయ్‌ని మెప్పించి..
ముఖేష్‌ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ.. నీతా హుందాతనం, ప్రతిభను చూసి తన కోడలుగా ఎంచుకున్నారు. ఓసారి నీతా భరతనాట్యం ప్రదర్శనను తిలకించిన ధీరూభాయ్ తన కొడుకు ముఖేష్‌ ఆమే సరిజోడని భావించారు. వారిద్దరికీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది వారి మధ్య స్నేహాన్ని క్రమంగా పెంచింది.

చెబితేనే కారు కదిలేది..
మీడియా నివేదికల ప్రకారం.. ఒకరోజు ముఖేష్ అంబానీ, నీతాతో కలిసి కారులో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపి నీతా వైపు తిరిగి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగారు. నిశ్చేష్టురాలైన ఆమె ఆశ్చర్యంతో ఏమీ చెప్పలేక కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. సమాధానం చెప్పే వరకూ కారు కదలదని ముఖేష్ అంబానీ చెప్పారు. దీంతో తరువాత ఆమె అంగీకరించారు. అలా వారు కలిసి జీవితాన్ని ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement