
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ ‘స్వదేశ్’ తొలి ఔట్‌లెట్‌ను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసింది. రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్‌పర్సన్ నీతా అంబానీ చేతుల మీదుగా ఈ స్టోర్ ప్రారంభం కానుంది. సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది కొలువుదీరింది.
చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఫర్నిచర్, బొమ్మలు, ఆభర ణాలు, గృహాలంకరణ వస్తువులు, పెయింటింగ్స్, యాక్సెసరీస్‌తోపాటు వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తారు. దేశవ్యాప్తంగా చేతి వృత్తుల కళాకారులకు చెందిన గుర్తింపు ఉన్న సంఘాల నుంచి నేరుగా వీటిని సేకరిస్తారు. రూ.6 లక్షలకుపైగా ధర పలికే వస్తువులనూ విక్రయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment