Isha Ambani రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇషా అంబానీ మరో కీలకమైన పదవికి ఎంపికైనారు. అంబానీ భార్య , రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్య, కళలు, క్రీడలు పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తూ, అనేక సామాజిక కార్యకలాపాలను నిర్వించే నీతా తన ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్‌ను మరింత విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలోనే తన కొత్త వెంచర్ బాధ్యతలను కుమార్తె ఇషాకు అప్పగించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) నీతా అంబానీ , నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ ద్వారా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇషా అంబానీ నేతృత్వంలో ఈ పాఠశాల భారతీయ ఆత్మతో భవిష్యత్తులో ఒక మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దనున్నట్టు కూడా వెల్లడించారు. రిలయన్స్ ఫౌండేషన్ రాబోయే 10 సంవత్సరాలలో రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల ద్వారా 50వేల మంది విద్యార్థులకు మద్దతు ఇవ్వనున్నామని, ఈ సంవత్సరంలోనే, సంస్థ 5000 స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేశామని కూడా తెలిపారు.
రిలయన్స్ రీటైల్ హెడ్‌గా దూసుకుపోతున్న ఇషా అంబానీ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కి వైస్ చైర్‌పర్సన్ కూడా. ఇపుడిక నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ బాధ్యతలను చేపట్టానున్నారు. అలాగే రిలయన్స్ రీటైల్‌కు సంబంధించి ఇప్పటికే పలు విదేశీ రిటైల్ బ్రాండ్‌లతో కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment