
ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ (MI) యజమాని, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ (Nita Ambani) బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించు కున్నారు. ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన ఎంఐ జట్టు విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. హైదరాబాద్ లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ నేపథ్యంలో ముఖేష్ అంబానీ సతీమణి నీతా బుధవారం హైదరాబాద్ వచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆలయానికి చేరుకున్నారు. దాదాపు 15 నిమిషాలు అమ్మవారి సన్నిధిలో గడిపారు. (సన్ రైజర్స్ విజయోత్సాహం: దటీజ్ కావ్య మారన్, వైరల్ వీడియో)
మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో నీతా అంబానీ, పెద్దకుమారుడు ఆకాష్ అంబానీ స్టేడియంలో క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించారు.
హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉన్న ప్రతీ సందర్బంలో నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం అలవాటు. అందులో భాగంగానే ఈసారి కూడా బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని నీతా సందర్శించారు.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య హోరా హోరీగా జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఓటమి పాలైంది.అంతేకాదునిర్ణీత 20 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఐపీఎల్ రికార్డులను బ్రేక్ చేయడం విశేషం
Comments
Please login to add a commentAdd a comment