Balkampet Yellamma temple
-
బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం..పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
అలిగిన మంత్రి..
-
ప్రోటోకాల్ పై మంత్రులు సీరియస్
-
నేనేం అలగలేదు: మంత్రి పొన్నం
హైదరాబాద్, సాక్షి: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ఈ ఉదయం జరిగిన తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ అంటున్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తోందని అన్నారామె. మంగళవారం సాయంత్రం బల్కంపేట ఘటనపై మంత్రుల సమీక్ష జరిగింది. అంతకు ముందు మీడియాతో ఆమె బల్కంపేట ఘటనపై స్పందించారు.బల్కంపేటలో ‘ప్రొటోకాల్’ ఘటనపై పొన్నం మాట్లాడారు. ఈ ఘటన విషయంలో నేను అలగలేదు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగింది. తోపులాట నివారించేందుకు ఆగి.. కాసేపు అధికారులతో మాట్లాడాం. తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారుల్ని ప్రశ్నించా? అంతే అని అన్నారాయన. మూడు రోజులపాటు జరిగే ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా.. ఈ ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సతీసమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గుడికి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ల వెంట నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా గుడిలో తోపులాట జరిగింది. ఈ ఘటనతో మంత్రి పొన్నం, మేయర్ అలిగి గుడి బయటే కూర్చున్నారు. తమ విషయంలో ప్రొటోకాల్ పాటించలేదని ఆయన అధికారులపై చిందులు తొక్కారని, ఎవరు నచ్చజెప్పినా వినలేదని కథనాలు వచ్చాయి. -
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు, కానీ పాపం ఎంఐ
ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ (MI) యజమాని, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ (Nita Ambani) బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించు కున్నారు. ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన ఎంఐ జట్టు విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. హైదరాబాద్ లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ నేపథ్యంలో ముఖేష్ అంబానీ సతీమణి నీతా బుధవారం హైదరాబాద్ వచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆలయానికి చేరుకున్నారు. దాదాపు 15 నిమిషాలు అమ్మవారి సన్నిధిలో గడిపారు. (సన్ రైజర్స్ విజయోత్సాహం: దటీజ్ కావ్య మారన్, వైరల్ వీడియో) మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో నీతా అంబానీ, పెద్దకుమారుడు ఆకాష్ అంబానీ స్టేడియంలో క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించారు. హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉన్న ప్రతీ సందర్బంలో నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం అలవాటు. అందులో భాగంగానే ఈసారి కూడా బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని నీతా సందర్శించారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య హోరా హోరీగా జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఓటమి పాలైంది.అంతేకాదునిర్ణీత 20 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఐపీఎల్ రికార్డులను బ్రేక్ చేయడం విశేషం -
ఫ్యామిలీ స్టార్ కోసం పూజలు.. మృణాల్ పోస్ట్ వైరల్!
-
ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన ఫ్యామిలీ స్టార్ బ్యూటీ!
సీతారామం సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతే కాకుండా గతేడాది నాని సరసన హాయ్ నాన్న చిత్రంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్‌లో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నా మృణాల్ ఠాకూర్ హైదరాబాద్‌లో సందడి చేసింది. బల్కంపేట్లో ఉన్న ఎల్లమ్మతల్లి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. కుటుంబ సంప్రదాయాలు, ఏదైనా పెద్ద పని ప్రారంభించే ముందు ఒక్క క్షణం ఆగి ప్రార్థించండి.. వీలైతే ఆలయాన్ని సందర్శించండి అంటూ తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఆలయంలో పూజలు చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
Mrunal Thakur Photos: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న సీతారామం హీరోయిన్ (ఫోటోలు)
-
ఆ పాటతో నాకు అంత పెద్ద పేరు వచ్చింది
-
హైదరాబాద్ : వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం (ఫొటోలు)
-
ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం (ఫొటోలు)
-
బల్కంపేట ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
-
నాన్న పుట్టినరోజు.. అమ్మవారికి బంగారు ఆభరణాలు
-
హైదరాబాద్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
కనుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం (ఫొటోలు)
-
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. అశేష భక్తజనంతో కిటకిటలాడిన ఆలయం
సాక్షి, హైదరాబాద్: ఎటుచూసినా అశేష భక్తజనం.. అమ్మవారి నామస్మరణలతో.. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయ పరిసరాలు మార్మోగాయి. ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం మంగళవారం వైభవోపేతంగా జరిగింది. ప్రత్యేక పూజల అనంతరం బాజా భజంత్రీల నడుమ తమిళనాడులోని మధురైలో ప్రత్యేకంగా తయారు చేసి తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులను కలాణ వేదికపైకి తరలించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఉదయం 11.45 గంటలకు కల్యాణం నిర్వహించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. అశేష భక్తజనంతో ఆలయ పరిసరాలు పసుపుపచ్చ మయంగా మారాయి. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి ముందు ఊహించిన దానికంటే ఎక్కువ మంది భక్తులు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు మూడు లక్షల మందికిపైగా భక్తులు వచ్చి ఉంటారని పోలీసు అధికారులు తెలిపారు. మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు.. అమ్మవారికి పలువురు ప్రముఖులు మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ దంపతులు, టీఎస్‌ఎంఐడీసి ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎంపీ మాలోతు కవిత, దేవాదాయశాఖ కమిషనర్ అనీల్ కుమార్, దైవజ్ఞశర్మ, ఆలయ ఈఓ ఎస్.అన్నపూర్ణ, ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కార్పొరేటర్లు కేతినేని సరళ, మహేశ్వరి, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణగౌడ్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి అమ్మవారికి ఒడి బియ్యం, చీర సమర్పించారు. జీటీఆర్ బంగారు నగల షాపు నిర్వాహకులు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఈసారి ఏర్పాట్లలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో భక్తులు ఇబ్బందుల పాలయ్యారు. గజిబిజి క్యూలైన్లతో అయోమయానికి గురయ్యారు. నేడు రథోత్సవం కల్యాణ మహోత్సవాల్లో భాగంలో చివరి ఘట్టమైన రథోత్సవం బుధవారం జరగనుంది. రథోత్సవం ఊరేగింపు పరిధిని ఈసారి పెంచారు. ఎల్లమ్మ దేవాలయం నుంచి ప్రారంభమై ఎస్ఎస్ బేకరీ వద్ద మళ్లించి బీకేగూడ, శ్రీరాంనగర్ కాలనీ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకునేది. ఈసారి ఎస్ఆర్నగర్ పాత పోలీస్‌స్టేషన్ మీదుగా ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. భక్తి శ్రద్ధలతో బంగారు బోనం చార్మినార్: భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ ఆధ్వర్యంలో మూడో బంగారు బోనాన్ని మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. అంతకుముందు సుల్తాన్‌షాహీ జగదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జోగిని నిషా క్రాంతి నైవేద్యంతో కూడిన బంగారు పాత్రను తలపై పెట్టుకుని ముందుకు కదిలారు. ఊరేగింపులో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఉపాధ్యక్షుడు మామిడి కృష్ణ, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, కార్యదర్శి గాజుల రాహుల్, మీడియా కార్యదర్శి జ్యోతికుమార్, మాజీ చైర్మన్ గాజుల అంజయ్య, మాజీ ఉపాధ్యక్షుడు ఆనంద్‌రావు, ఆదర్ల మహేష్ పాల్గొన్నారు. -
Balkampet Yellamma: బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్తు కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్యూలైన్ల కోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. సోమవారం ఉదయం వేదపండితులు మంత్రోశ్చరణల నడుమ ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఎస్.అన్నపూర్ణ తెలిపారు. సాయంత్రం సాంప్రదాయ బద్దంగా ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుంది. బందోబస్తు నిమిత్తం 500 మంది సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. అమీర్‌పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రూ.5 లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా తయారు చేయించారు. చదవండి: Hyderabad: కారు దిగిన మేయర్.. కాంగ్రెస్‌లో చేరిక -
ఎల్లమ్మ తల్లికి రెండున్నర కిలోల బంగారు చీర
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మతల్లికి రెండున్నర కిలోల బంగారు చీరను సమర్పించారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఎల్లకాలం వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూన వెంకటేష్ గౌడ్, ఆలయ ఈవో అన్నపూర్ణ ఆయన వెంట ఉన్నారు. ఆలయ సందర్శన అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. దాతలు కూన వెంకటేష్ గౌడ్, శివరాంరెడ్డి సహకారంతో అమ్మవారికి చీరను సమర్పించామన్నారు. ‘‘ఎల్లమ్మ తల్లి అందరికి ఇలవేల్పు. ఆ అమ్మవారిని అమ్మవారిని దర్శించుకుంటే అందరూ బాగుంటారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని తల్లిని వేడుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నారు. భవిష్యత్ లో దేశానికి కూడా వారు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న’’ అని పేర్కొన్నారు. చదవండి: బర్త్‌డే: మొక్క నాటిన సీఎం కేసీఆర్ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో నిర్వహించిన కార్యక్రమాలు ►అమీర్‌పేటలోని గురుద్వారలో గురుగ్రంధ్ సాహెబ్‌కు ప్రత్యేక పూజలు ►సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కోటి కుంకుమార్చన ►సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయంలో గణపతి కల్యాణం, విశేష అభిషేకాలు ►క్లాక్ టవర్ వద్ద గల వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, నాంపల్లి లోని హజ్రత్ యుసిఫెన్ దర్గాలో చాదర్ సమర్పణ ►జలవిహార్‌లో మొక్కలు నాటే కార్యక్రమం -
బల్కంపేటలో బోనాల సంబరాలు..!
-
నేడు బల్కంపేట అమ్మవారికి బంగారు బోనం
హైదరాబాద్ : ఆషాఢమాసం బోనాల జాతరను పురస్కరించుకొని ‘భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ’ ఆధ్వర్యంలో మంగళవారం బల్కంపేట ఎల్లమ్మకు బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించనున్నామని కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య తెలిపారు. సప్త మాతృకల సప్త బంగారు బోనం పేరుతో నగరంలోని ఏడు దేవాలయాలకు చెందిన అమ్మవార్లకు తొలిసారిగా బంగారు బోనాన్ని సమర్పిస్తున్నామన్నారు. ఈ నెల 15వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించామన్నారు. ఈ నెల 20న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, 24 న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, 26న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, 31న లాల్‌దర్వాజా సింహవాహిణి దేవాలయం, ఆగస్టు 5న మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం అమ్మవార్లకు బంగారు పాత్రలో బోనాన్ని సమర్పించనున్నామన్నారు. -
శభాష్.. సుంకన్న
హైదరాబాద్, సనత్‌నగర్: అసలే మంగళవారం...బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఉన్నాయి. దేవాలయ సమీపంలోని భక్తుల విడిది కేంద్రంలో గ్యాస్ సిలిండర్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు పది అడుగుల మేర మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా అక్కడి వారంతా భయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. సిలిండర్ పేలితే పరిస్థితి ఏమిటోనని బతుకుజీవుడా? అంటూ బయటకు లంఘించారు. అయితే అక్కడ చెత్తను ఎత్తే వ్యక్తి ధైర్యం చేసి సిలిండర్ నుంచి వస్తున్న మంటలపై మందమైన బట్టను వేసి అదుపులోకి తీసుకువచ్చాడు. ఈ లోగా ఫైర్‌ఇంజన్, పోలీసు లు అక్కడికి చేరుకుని పూర్తిగా మంటలను ఆర్పివేశారు. మంటల ఉధృతికి ఒకవేళ సిలిండర్ పేలితే పరిస్థితి ఊ హించని విధంగా ఉండేది. హస్తినాపురం ప్రాంతానికి చెందిన బ్రాహ్మచారి మంగళవారం ఎల్లమ్మతల్లికి మొక్కు తీర్చు కునేందుకు ఆలయానికి వచ్చాడు. కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి దేవాలయం వెనుక వైపు ఉన్న ప్రైవేటు విడిది గదిని అద్దెకు తీసుకున్నాడు. వంటలు చేసుకుంటుండగా అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. అక్కడే చెత్తను తొలగించే పెద్ద సుంకన్న సిలిండర్ నుంచి వస్తున్న మంటలను గమనించి కార్పెట్‌ను తడిపి సిలిండర్‌పై వేసి మంటలను అదుపులోకి తీసుకువచ్చాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి సిలిండర్‌ను మంటలను ఆర్పిన సుంకన్నను ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ వాహిదుద్దీన్, ఎస్ఐ నవీన్‌లు నగదు ప్రోత్సాహంతో సత్కరించారు. -
అమ్మవారి హుండీలో అంత డబ్బా!
అమీర్‌పేట(హైదరాబాద్): ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారి హుండీలో లక్ష రూపాయలు వేశారు. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌ను తిలకించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆమె అమ్మవారి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం హుండీలో డబ్బులతో కూడిన కవర్ వేశారు. గురువారం ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా ఆమె వేసిన కవర్‌ను తెరిచి చూడగా రూ.లక్ష ఉన్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. తమ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడంతో ఆమె మొక్కు చెల్లించుకున్నారు. నీతా అంబానీ హైదరాబాద్ వచ్చినప్పుల్లా బల్కంపేట అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఐపీఎల్-10 టైటిల్‌ను ముంబై ఇండియన్స్ జట్టు గెల్చుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ టీమ్‌ను ఓడించి ముంబై జట్టు టైటిల్ కైవసం చేసుకుంది.