
సీతారామం సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతే కాకుండా గతేడాది నాని సరసన హాయ్ నాన్న చిత్రంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్‌లో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.
ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నా మృణాల్ ఠాకూర్ హైదరాబాద్‌లో సందడి చేసింది. బల్కంపేట్‌లో ఉన్న ఎల్లమ్మతల్లి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. కుటుంబ సంప్రదాయాలు, ఏదైనా పెద్ద పని ప్రారంభించే ముందు ఒక్క క్షణం ఆగి ప్రార్థించండి.. వీలైతే ఆలయాన్ని సందర్శించండి అంటూ తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఆలయంలో పూజలు చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment