సుంకన్ననుఅభినందిస్తున్న పోలీసులు
హైదరాబాద్, సనత్‌నగర్: అసలే మంగళవారం...బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఉన్నాయి. దేవాలయ సమీపంలోని భక్తుల విడిది కేంద్రంలో గ్యాస్ సిలిండర్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు పది అడుగుల మేర మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా అక్కడి వారంతా భయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. సిలిండర్ పేలితే పరిస్థితి ఏమిటోనని బతుకుజీవుడా? అంటూ బయటకు లంఘించారు. అయితే అక్కడ చెత్తను ఎత్తే వ్యక్తి ధైర్యం చేసి సిలిండర్ నుంచి వస్తున్న మంటలపై మందమైన బట్టను వేసి అదుపులోకి తీసుకువచ్చాడు. ఈ లోగా ఫైర్‌ఇంజన్, పోలీసు లు అక్కడికి చేరుకుని పూర్తిగా మంటలను ఆర్పివేశారు.
మంటల ఉధృతికి ఒకవేళ సిలిండర్ పేలితే పరిస్థితి ఊ హించని విధంగా ఉండేది. హస్తినాపురం ప్రాంతానికి చెందిన బ్రాహ్మచారి మంగళవారం ఎల్లమ్మతల్లికి మొక్కు తీర్చు కునేందుకు ఆలయానికి వచ్చాడు. కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి దేవాలయం వెనుక వైపు ఉన్న ప్రైవేటు విడిది గదిని అద్దెకు తీసుకున్నాడు. వంటలు చేసుకుంటుండగా అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. అక్కడే చెత్తను తొలగించే పెద్ద సుంకన్న సిలిండర్ నుంచి వస్తున్న మంటలను గమనించి కార్పెట్‌ను తడిపి సిలిండర్‌పై వేసి మంటలను అదుపులోకి తీసుకువచ్చాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి సిలిండర్‌ను మంటలను ఆర్పిన సుంకన్నను ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ వాహిదుద్దీన్, ఎస్‌ఐ నవీన్‌లు నగదు ప్రోత్సాహంతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment