సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మతల్లికి రెండున్నర కిలోల బంగారు చీరను సమర్పించారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఎల్లకాలం వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూన వెంకటేష్ గౌడ్, ఆలయ ఈవో అన్నపూర్ణ ఆయన వెంట ఉన్నారు.
ఆలయ సందర్శన అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. దాతలు కూన వెంకటేష్ గౌడ్, శివరాంరెడ్డి సహకారంతో అమ్మవారికి చీరను సమర్పించామన్నారు. ‘‘ఎల్లమ్మ తల్లి అందరికి ఇలవేల్పు. ఆ అమ్మవారిని అమ్మవారిని దర్శించుకుంటే అందరూ బాగుంటారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని తల్లిని వేడుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నారు. భవిష్యత్ లో దేశానికి కూడా వారు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న’’ అని పేర్కొన్నారు.
చదవండి: బర్త్డే: మొక్క నాటిన సీఎం కేసీఆర్
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో నిర్వహించిన కార్యక్రమాలు
►అమీర్‌పేటలోని గురుద్వారలో గురుగ్రంధ్ సాహెబ్‌కు ప్రత్యేక పూజలు
►సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కోటి కుంకుమార్చన
►సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయంలో గణపతి కల్యాణం, విశేష అభిషేకాలు
►క్లాక్ టవర్ వద్ద గల వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, నాంపల్లి లోని హజ్రత్ యుసిఫెన్ దర్గాలో చాదర్ సమర్పణ
►జలవిహార్‌లో మొక్కలు నాటే కార్యక్రమం
Comments
Please login to add a commentAdd a comment