హైదరాబాద్, సాక్షి: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ఈ ఉదయం జరిగిన తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ అంటున్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తోందని అన్నారామె. మంగళవారం సాయంత్రం బల్కంపేట ఘటనపై మంత్రుల సమీక్ష జరిగింది. అంతకు ముందు మీడియాతో ఆమె బల్కంపేట ఘటనపై స్పందించారు.
బల్కంపేటలో ‘ప్రొటోకాల్’ ఘటనపై పొన్నం మాట్లాడారు. ఈ ఘటన విషయంలో నేను అలగలేదు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగింది. తోపులాట నివారించేందుకు ఆగి.. కాసేపు అధికారులతో మాట్లాడాం. తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారుల్ని ప్రశ్నించా? అంతే అని అన్నారాయన.
మూడు రోజులపాటు జరిగే ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా.. ఈ ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సతీసమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గుడికి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ల వెంట నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా గుడిలో తోపులాట జరిగింది. ఈ ఘటనతో మంత్రి పొన్నం, మేయర్ అలిగి గుడి బయటే కూర్చున్నారు. తమ విషయంలో ప్రొటోకాల్ పాటించలేదని ఆయన అధికారులపై చిందులు తొక్కారని, ఎవరు నచ్చజెప్పినా వినలేదని కథనాలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment