protocal ragada
-
నేనేం అలగలేదు: మంత్రి పొన్నం
హైదరాబాద్, సాక్షి: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ఈ ఉదయం జరిగిన తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ అంటున్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తోందని అన్నారామె. మంగళవారం సాయంత్రం బల్కంపేట ఘటనపై మంత్రుల సమీక్ష జరిగింది. అంతకు ముందు మీడియాతో ఆమె బల్కంపేట ఘటనపై స్పందించారు.బల్కంపేటలో ‘ప్రొటోకాల్’ ఘటనపై పొన్నం మాట్లాడారు. ఈ ఘటన విషయంలో నేను అలగలేదు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగింది. తోపులాట నివారించేందుకు ఆగి.. కాసేపు అధికారులతో మాట్లాడాం. తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారుల్ని ప్రశ్నించా? అంతే అని అన్నారాయన. మూడు రోజులపాటు జరిగే ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా.. ఈ ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సతీసమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గుడికి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ల వెంట నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా గుడిలో తోపులాట జరిగింది. ఈ ఘటనతో మంత్రి పొన్నం, మేయర్ అలిగి గుడి బయటే కూర్చున్నారు. తమ విషయంలో ప్రొటోకాల్ పాటించలేదని ఆయన అధికారులపై చిందులు తొక్కారని, ఎవరు నచ్చజెప్పినా వినలేదని కథనాలు వచ్చాయి. -
అలిగిన మంత్రి పొన్నం.. బల్కంపేట గుడిలో ప్రోటోకాల్ రగడ
సాక్షి,హైదరాబాద్: ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా బల్కంపేట గుడిలో మంగళవారం(జులై 9) ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఎల్లమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు గుడికి వచ్చారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా వచ్చారు. ఈ సందర్భంగా గుడిలో తోపులాట జరిగింది. తోపులాటలో మేయర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో మంత్రి పొన్నం, మేయర్ అలిగి గుడి బయటే కూర్చున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని అయిన తనకు ప్రోటోకాల్ పాటించడం లేదని పొన్నం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌పై పొన్నం సీరియస్ అయ్యారు. అధికారులు ఎంత నచ్చజెప్పినా మంత్రి పొన్నం అలక వీడలేదు. -
మంత్రి, ఎమ్మెల్యేకే ఫ్లెక్సీలు కడతారా?
కూసుమంచి: ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యాన ఆదివారం ఏర్పాటుచేసిన చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రకు అధికారులు ఆహ్వానం అందించారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలుకావలసి ఉండగా, పదిన్నర సమయాన హైదరాబాద్ నుండి ఎమ్మెల్సీ, ఎంపీలు రిజర్వాయర్ వద్దకు వచ్చారు. అప్పటికింకా ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి చేరుకోలేదు. దీంతో ఎమ్మెల్సీ తాతా మధు.. ఎమ్మెల్యే ఎక్కడి వరకు వచ్చారంటూ ఆరాతీయగా మార్గమధ్యలో ఉన్నారని డీఎఫ్‌వో ఆంజనేయస్వామి బదులిచ్చారు. సమయపాలన లేకుంటే ఎలా? అంటూ ఎమ్మెల్సీ ఒకింత అసహనానికి గురవుతూనే, పక్కనే ఉన్న ఫ్లెక్సీలలో.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, కలెక్టర్ గౌతమ్ ఫొటోలతో మూడు ఫ్లెక్సీలను గమనించారు. దీంతో ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘మీరు ఆఫీసర్లు ఆఫీసర్లుగా ఉండాలి.. పనికిమాలిన పనులు చేయొద్దు. మీరు గవర్నమెంట్ అధికారి కాబట్టి ఎవరికీ ఊడిగం చేయొద్దు.. అందరికీ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టలేదు? ఎమ్మెల్యే, మంత్రికే ఫ్లెక్సీలే ఎందుకు పెట్టారు.. గవర్నమెంట్ మీకు చెప్పిందా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడి నుండి ఎంపీలు, ఎమ్మెల్సీ ఖమ్మం వెళ్లిపోయారు. కాసేపటికి వచ్చిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి రిజర్వాయర్‌లో చేపపిల్లలను విడుదల చేశారు. అంతకుముందు జరిగిన ఘటనపై అధికారులను మందలించడమే కాక ప్రొటోకాల్ పాటించకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. కాగా, కార్యక్రమం ముగిశాక ఎంపీ, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని అధికారులు ఏర్పాటు చేయడం కొసమెరుపు. ఇదీ చదవండి: ఈడీ లేకుంటే బీజేపీనే లేదు -
గవర్నర్ వక్రబుద్ధితో మాట్లాడుతున్నారు
నిర్మల్: ఢిల్లీలో అమిత్‌షాను కలిసిన తర్వాత గవర్నర్ తమిళిసై వక్రబుద్ధితో మాట్లాడుతున్నారని రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇకనుంచి నోరు పారేసుకోవడం మానుకోవాలంటూ ఆయన హితవు పలికారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం నల్లజెండా ఎగరేసి, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉగాది రోజు తాను యాదాద్రికి వస్తున్నానని 20నిమిషాల ముందు ఫోన్ చేసి చెప్పారన్నారు. అంత తక్కువ సమయంలో ఏర్పాట్లెలా చేస్తారని ప్రశ్నించారు. పది గంటల ముందు చెబితే ప్రొటోకాల్ ప్రకారం గౌరవించే వాళ్లమన్నారు. గవర్నర్ బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని, ఆమె మాటలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోశాక నాటి గవర్నర్ రాంలాల్ ప్రజాగ్రహాన్ని చవిచూసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. గవర్నర్‌గా నరసింహన్ రాష్ట్రాన్ని ప్రోత్సహించారని ఇంద్రకరణ్ గుర్తుచేశారు. చదవండి: గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. ముదిరిన పంచాయితీ -
యాదాద్రిలో ప్రొటోకాల్ పంచాయితీ
యాదగిరిగుట్ట (ఆలేరు) : ఒకరు మహిళ అధికారి.. మరొకరు మహిళ ప్రజాప్రతినిధి.. వారిద్దరి మధ్య నువ్వానేనా అన్న తరహాలో వార్ నడుస్తోంది. అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ.. స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం ఆహ్వానాలు ఇవ్వడం లేదంటూ అధికారిపై గతంలో మంత్రులకు, ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. నిన్నటివరకు ఈ ప్రొటోకాల్ విషయం లోలోపలనే ఉన్నా.. శనివారం జరగాల్సిన ఓ కార్యక్రమానికి ఆ ప్రజాప్రతినిధితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని ఆమె అనుచరులంతా ఆ అధికారిపై ఉన్నతస్థాయి అధికారులకు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన యాదగిరిగుట్టలో శనివారం చోటు చేసుకుంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓ గీతారెడ్డి.. ఆలయానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ఏవీ చేసినా ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డికి, ఎంపీ, ఎమ్మెల్సీలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం ఇవ్వడం లేదని, కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదంటూ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సందర్శనకు వచ్చిన సీఎస్ జోషి దృష్టికి తీసుకెళ్లారు. అసలేమీ జరిగిందంటే... యాదాద్రి దేవస్థానం ఆధీనంలో ఉన్న నల్లపోచమ్మవాడలోని గోశాలను మల్లాపురం మార్గంలో ఉన్న దేవస్థానం బావి వద్ద నూతనంగా నిర్మించిన తులసీ వనానికి తరలించారు. కొంతకాలంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. శనివారం తులసీ వనంలో నిర్మించిన నూతన గోశాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడంతోపాటు వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన భోజనాలకు వచ్చిన సీఎస్ జోషితో ప్రారంభించాలని అధికారులు అంతా సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో ప్రొటోకాల్ పాటించడం లేదని ప్రారంభోత్సవాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అనుచరులు అడ్డుకుంటారని చేయలేదు. పూలతో అలంకరణతోపాటు టెంకాయలు, ప్రారంభో త్సవ రిబ్బన్ కూడా సిద్ధం చేసి చివరికి ప్రారంభం చేయకుండా వాటిని తొలగించడంతో అక్కడున్న ఆచార్యులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజాప్రతినిధులు రావడంతోనే.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతోపాటు ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, కనీసం ప్రొటోకాల్ పాటించకుండానే గోశాలను ఎలా ప్రారంభిస్తారో చూడాలని ఈఓ గీతారెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున గోశాలకు చేరుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆలయ అధికారులు ప్రారంభోత్స వానికి సిద్ధం చేసిన రిబ్బన్‌ను తొలగించి, అలంకరణ మాత్రమే ఉంచారు. ప్రజాప్రతినిధులు గొడవకు దిగుతారనే ముందుగా గ్రహించిన ఈఓ గీతారెడ్డి ప్రారంభోత్సవం రద్దు చేశారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎలాంటి ప్రారంభోత్సవం లేనప్పుడు హంగులు, ఆర్భాటాలు ఎందుకని ప్రశ్నించారు. గతంలో కూడా ఈఓ గీతారెడ్డి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా ఉన్న గొంగిడి సునితామహేందర్‌రెడ్డికి ప్రొటోకాల్ పాటించడం లేదని, రెండేళ్ల క్రితం బ్రహ్మోత్సవాల సమయంలో కరపత్రాలపై విప్ సునీత పేరు ముద్రించడంలో తప్పులు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఆలయానికి వచ్చిన సందర్భంలో ఆమెను సరిగా ఆహ్వానించరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఓపై చర్యలు తీసుకోవాలి.. ప్రొటోకాల్ పాటించకుండా స్థానిక ప్రజాప్రతినిధులను అవమాన పరుస్తున్న ఆలయ ఈఓ గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, మిట్ట వెంకటయ్యగౌడ్, యువజన విభాగం కన్వీనర్ గడ్డమీది రవీందర్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో సీఎస్ జోషికి వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ రూ.వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని, కానీ శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యేను, ఎంపీని, ఎమ్మెల్సీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లను ఆహ్వానించకుండా అగౌరవపరుస్తున్నారని తెలిపారు. ఈఓ వచ్చిన నాటినుంచి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోజుకో రాయికి పూజలు చేస్తాం.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండపైన ప్రతి రోజూ ఒక రాయికి పూజలు చేస్తాం. వాటన్నింటికి పిలవాలని లేదు. ప్రధాన ఆలయం ప్రారంభోత్సవంతోనే మిగతా ప్రారంభోత్సవాలు జరుగుతాయి. ఇప్పటి వరకు ఎక్కడ ప్రారంభోత్సవాలు జరగలేదు. పాత గోశాలను మల్లాపురం రోడ్డులో నూతనంగా నిర్మితం గోశాలకు తరలించాలని వైటీడీఏ అధికారులు ఆదేశించారు. కానీ దీనికి ఎవరిని మేము పిలవలేదు. –గీతారెడ్డి, ఈఓ, యాదాద్రి దేవస్థానం ఆహ్వానం అందలేదు.. వాస్తవమే యాదాద్రి దేవస్థానానికి సంబంధించిన గోశాల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానం అందలేదు. ఇది వాస్తవమే. గతంలో ఒకటి, రెండు సార్లు ఇలాంటి సంఘటనలకు మమ్మల్ని ఆహ్వానించలేదు. అయినా మేము ఎక్కడ కూడా ఈఓను ఇబ్బంది పెట్టలేదు. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ప్రొటోకాల్ విషయాన్ని ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు. – గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే -
టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
దౌల్తాబాద్(కొడంగల్): మండల పరిధిలోని కుదురుమళ్లలో మంగళవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ గందరగోళంగా మారింది. ఓ దశలో కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి చేరుకుంది. చివరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. వివరాలు.. కుదురుమళ్లలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీకి మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి వచ్చారు. తహసీల్దార్ అతిథులుగా జెడ్పీ చైర్మన్‌తోపాటు ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ, ఎంపీపీని ప్రోటోకాల్ ప్రకారం వేదికపైకి ఆహ్వానించారు. దౌల్తాబాద్ ఎంపీపీ నర్సింగ్‌భాన్‌సింగ్ స్థానిక ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని స్టేజీపైకి ఆహ్వానించాలని తహసీల్దార్‌ను కోరారు. అంతలోనే జెడ్పీ చైర్మన్ కల్పించుకుని ఆయన ఎవరు..? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సోదరుడని ఎంపీపీ చెప్పడంతో ప్రొటోకాల్ ప్రకారం ఆయన స్టేజీపైకి అవసరం లేదన్నారు. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు తోపులాటకు దిగారు. దాదాపు గంటసేపు ఆందోళనగా మారడంతో ఉత్కంట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని తిరుపతిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ...రేవంత్‌రెడ్డి డౌన్...డౌన్ అంటూ.. కాంగ్రెస్ కార్యకర్తలు నరేందర్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు తిరుపతిరెడ్డితోపాటు ఎంపీపీ నర్సింగ్‌భాన్‌సింగ్, నాయకులను సమావేశం నుంచి బయటకు పంపించారు. కార్యకర్తలు నినాదాలు చేయడంతో వారిని చెదరగొట్టారు. అనంతరం ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతుంటే ఇలా దౌర్జాన్యం చేసి గొడవలు దిగడం సరికాదన్నారు. వారికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు. ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటే రానున్న రోజుల్లో ప్రజలే తరమికొడతారన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. -
మండలమీట్‌లో ప్రొటోకాల్ రగడ
బైరెడ్డిపల్లె: ప్రొటోకాల్‌పై మండల పరిషత్ సమావేశంలో ఆరంభం నుంచి రచ్చ జరిగింది. ఎంపీపీ విమల అధ్యక్షతన బుధవారం మండలమీట్ జరిగింది. త్రిసభ్య కమిటీ సభ్యుల హాజరుపై వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అభ్యంతరం తెలిపారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడిన అనంతరం కమిటీ రద్దు కాలేదనే విషయంపై ఎంపీడీవో రాజగోపాలరావు వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మండల ఉపాధ్యక్షుడు వేదికపై కూర్చోరాదని టీడీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కొద్ది సేపు రభస చేశారు. సభ్యుల తీర్మానం, అనుమతి మేరకే కూర్చుంటున్నారని ఎంపీడీవో సర్దిచెప్పారు. అనంతరం సమావేశం జరిగింది. శ్మశానానికి దారేదీ దాసార్లపల్లెలో శ్మశానానికి వెళ్లడానికి దారి లేక ఇబ్బంది పడుతున్నారని సర్పంచ్ నాగరాజు ప్రస్తావించారు. వుండలంలో 34 అంగన్వాడీ భవనాలు వుంజూరైనా స్థలం లేక, నిధులు వెనక్కిపోయే పరిస్థితి ఏర్పడిందని ఎంపీటీసీ సభ్యుడు అబ్దుల్‌సత్తార్ ప్రస్తావించారు. ఆల్లపల్లె పంచాయతీలో పంటసంజీవని పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ సభ్యుడు రవుణారెడ్డి తెలిపారు. డార్క్ ఏరియాను తొలగించి రైతులకు ఆదుకోవాలని ఎంపీటీసీ సభ్యుడు వెంకటేష్ కోరారు. నాలుగు సమావేశాలకు వైద్యాధికారి గైర్హాజరు కావడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకుడు గుంతలకు బిల్లులు వుంజూరు చేÄýæుకుండా, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీటీసీ సభ్యురాలు జÄýæువ్ము ఆరోపించారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లకు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ సుబ్రవుణ్యంరెడ్డి కోరారు. తెలిపారు. అనంతరం ఎంపీపీ వివుల వూట్లాడారు. అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ మెుగసాల రెడ్డెప్ప, జెడ్పీటీసీ సభ్యురాలు రాధవ్ము, తహశీల్దార్ మోహన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.