సవూవేశంలో వూట్లాడుతున్న ఎంపీపీ వివుల
మండలమీట్‌లో ప్రొటోకాల్ రగడ
Published Thu, Aug 4 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
బైరెడ్డిపల్లె: ప్రొటోకాల్‌పై మండల పరిషత్ సమావేశంలో ఆరంభం నుంచి రచ్చ జరిగింది. ఎంపీపీ విమల అధ్యక్షతన బుధవారం మండలమీట్ జరిగింది. త్రిసభ్య కమిటీ సభ్యుల హాజరుపై వైఎస్‌ఆర్ సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అభ్యంతరం తెలిపారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడిన అనంతరం కమిటీ రద్దు కాలేదనే విషయంపై ఎంపీడీవో రాజగోపాలరావు వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మండల ఉపాధ్యక్షుడు వేదికపై కూర్చోరాదని టీడీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కొద్ది సేపు రభస చేశారు. సభ్యుల తీర్మానం, అనుమతి మేరకే కూర్చుంటున్నారని ఎంపీడీవో సర్దిచెప్పారు. అనంతరం సమావేశం జరిగింది.
శ్మశానానికి దారేదీ
దాసార్లపల్లెలో శ్మశానానికి వెళ్లడానికి దారి లేక ఇబ్బంది పడుతున్నారని సర్పంచ్ నాగరాజు ప్రస్తావించారు. వుండలంలో 34 అంగన్‌వాడీ భవనాలు వుంజూరైనా స్థలం లేక, నిధులు వెనక్కిపోయే పరిస్థితి ఏర్పడిందని ఎంపీటీసీ సభ్యుడు అబ్దుల్‌సత్తార్ ప్రస్తావించారు. ఆల్లపల్లె పంచాయతీలో పంటసంజీవని పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ సభ్యుడు రవుణారెడ్డి తెలిపారు. డార్క్ ఏరియాను తొలగించి రైతులకు ఆదుకోవాలని ఎంపీటీసీ సభ్యుడు వెంకటేష్ కోరారు. నాలుగు సమావేశాలకు వైద్యాధికారి గైర్హాజరు కావడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకుడు గుంతలకు బిల్లులు వుంజూరు చేÄýæుకుండా, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీటీసీ సభ్యురాలు జÄýæువ్ము ఆరోపించారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లకు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ సుబ్రవుణ్యంరెడ్డి కోరారు. తెలిపారు. అనంతరం ఎంపీపీ వివుల వూట్లాడారు. అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ మెుగసాల రెడ్డెప్ప, జెడ్పీటీసీ సభ్యురాలు రాధవ్ము, తహశీల్దార్ మోహన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement