సాక్షి, హైదరాబాద్: బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్తు కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్యూలైన్ల కోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి.
సోమవారం ఉదయం వేదపండితులు మంత్రోశ్చరణల నడుమ ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఎస్.అన్నపూర్ణ తెలిపారు. సాయంత్రం సాంప్రదాయ బద్దంగా ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుంది. బందోబస్తు నిమిత్తం 500 మంది సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. అమీర్‌పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రూ.5 లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా తయారు చేయించారు.
చదవండి: Hyderabad: కారు దిగిన మేయర్.. కాంగ్రెస్‌లో చేరిక
Comments
Please login to add a commentAdd a comment