Balkampet Yellamma Kalyanam
-
బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం..పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
హైదరాబాద్ : వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం (ఫొటోలు)
-
ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం (ఫొటోలు)
-
పుణ్యక్షేత్రంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయం
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని ఒక పుణ్యక్షేత్రం తరహాలో తీర్చదిద్దామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్లమ్మ కల్యాణం నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఆలయానికి వచ్చిన ఆయన వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అమ్మవారి హుండీల ఆదాయం సంవత్సరానికి రూ.4 కోట్లు ఉండేదని, ఇప్పుడు రూ.22 కోట్లకు చేరిందన్నారు. ఎల్లమ్మ కల్యాణానికి తమ కుంటుంబం తరఫున పుస్తె మెట్టెలు, తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఈఓ అన్నపూర్ణ, చైర్మన్ సాయిబాబా గౌడ్, ఇన్స్పెక్టర్ సైదులు, ట్రాఫిక్ సీఐ సురేష్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో కల్యాణ మహోత్సవాలు ప్రారంభం భక్తుల కొంగు బంగారమైన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, దేవాతాహ్వానం, అంకురార్పణం, పుట్ట బంగారం, గంగతెప్ప వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా ఎదుర్కోళ్లు జరిగాయి. నేటి ఉదయం 11.55 గంటలకు అమ్మవారి కల్యాణం పునర్వసు నక్షత్ర యుక్త అభిజిత్ లగ్న సుముహుర్తాన మంగళవారం ఉదయం 11.55 గంటలకు అమ్మవారి కల్యాణోత్సవం జరగనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్.అన్నపూర్ణ తెలిపారు. -
నేటి నుంచి బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలు
హైదరాబాద్: ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. సోమవారం ఎదుర్కోళ్లు, మంగళవారం ఎల్లమ్మ కల్యాణం, బుధవారం రథోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎస్ అన్నపూర్ణ తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాల నేపథ్యంలో ట్రాఫిక్‌ను ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపారు. గ్రీన్‌ల్యాండ్, అమీర్‌పేట సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం మీదుగా కాకుండా ఎస్ఆర్నగర్ టీ జంక్షన్, కమ్యూనిటీ హాల్, బీకేగూడ క్రాస్ రోడ్డు, శ్రీరాంనగర్, సనత్‌నగర్ మీదుగా ఫతేనగర్ బ్రిడ్జిపైకి వెళ్లాల్సి ఉంటుంది. ఫతేనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి వచ్చే వాహనాలను కొత్త బ్రిడ్జి కట్టమైసమ్మ దేవాలయం మీదుగా బేగంపేట వైపు మళ్లిస్తారు. గ్రీన్ ల్యాండ్, ఫుడ్ వరల్డ్ మీదుగా బల్కంపేట వైపు వచ్చే వాహనాలను ఫుడ్ వరల్డ్ క్రాస్ రోడ్డు వద్ద దారి మళ్లించి సోనాబాయి ఆలయం, సత్యం థియేటర్, మైత్రి వనం, ఎస్ఆర్నగర్ టీ జంక్షన్ వైపు అనుమతిస్తారు. బేగంపేట, కట్ట మైసమ్మ దేవాలయం వైపు నుంచి బల్కంపేటకు వచ్చే వాహనదారులు గ్రీన్‌ల్యాండ్స్, కనకదుర్గా దేవి దేవాలయం, సత్యం థియేటర్, ఎస్ఆర్నగర్ టీ జంక్షన్ నుంచి ఎడమవైపు తీసుకుని ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. -
కనుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం (ఫొటోలు)
-
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. అశేష భక్తజనంతో కిటకిటలాడిన ఆలయం
సాక్షి, హైదరాబాద్: ఎటుచూసినా అశేష భక్తజనం.. అమ్మవారి నామస్మరణలతో.. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయ పరిసరాలు మార్మోగాయి. ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం మంగళవారం వైభవోపేతంగా జరిగింది. ప్రత్యేక పూజల అనంతరం బాజా భజంత్రీల నడుమ తమిళనాడులోని మధురైలో ప్రత్యేకంగా తయారు చేసి తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులను కలాణ వేదికపైకి తరలించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఉదయం 11.45 గంటలకు కల్యాణం నిర్వహించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. అశేష భక్తజనంతో ఆలయ పరిసరాలు పసుపుపచ్చ మయంగా మారాయి. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి ముందు ఊహించిన దానికంటే ఎక్కువ మంది భక్తులు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు మూడు లక్షల మందికిపైగా భక్తులు వచ్చి ఉంటారని పోలీసు అధికారులు తెలిపారు. మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు.. అమ్మవారికి పలువురు ప్రముఖులు మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ దంపతులు, టీఎస్‌ఎంఐడీసి ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎంపీ మాలోతు కవిత, దేవాదాయశాఖ కమిషనర్ అనీల్ కుమార్, దైవజ్ఞశర్మ, ఆలయ ఈఓ ఎస్.అన్నపూర్ణ, ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కార్పొరేటర్లు కేతినేని సరళ, మహేశ్వరి, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణగౌడ్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి అమ్మవారికి ఒడి బియ్యం, చీర సమర్పించారు. జీటీఆర్ బంగారు నగల షాపు నిర్వాహకులు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఈసారి ఏర్పాట్లలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో భక్తులు ఇబ్బందుల పాలయ్యారు. గజిబిజి క్యూలైన్లతో అయోమయానికి గురయ్యారు. నేడు రథోత్సవం కల్యాణ మహోత్సవాల్లో భాగంలో చివరి ఘట్టమైన రథోత్సవం బుధవారం జరగనుంది. రథోత్సవం ఊరేగింపు పరిధిని ఈసారి పెంచారు. ఎల్లమ్మ దేవాలయం నుంచి ప్రారంభమై ఎస్ఎస్ బేకరీ వద్ద మళ్లించి బీకేగూడ, శ్రీరాంనగర్ కాలనీ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకునేది. ఈసారి ఎస్ఆర్నగర్ పాత పోలీస్‌స్టేషన్ మీదుగా ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. భక్తి శ్రద్ధలతో బంగారు బోనం చార్మినార్: భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ ఆధ్వర్యంలో మూడో బంగారు బోనాన్ని మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. అంతకుముందు సుల్తాన్‌షాహీ జగదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జోగిని నిషా క్రాంతి నైవేద్యంతో కూడిన బంగారు పాత్రను తలపై పెట్టుకుని ముందుకు కదిలారు. ఊరేగింపులో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఉపాధ్యక్షుడు మామిడి కృష్ణ, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, కార్యదర్శి గాజుల రాహుల్, మీడియా కార్యదర్శి జ్యోతికుమార్, మాజీ చైర్మన్ గాజుల అంజయ్య, మాజీ ఉపాధ్యక్షుడు ఆనంద్‌రావు, ఆదర్ల మహేష్ పాల్గొన్నారు. -
ఎల్లమ్మ కల్యాణం.. ఎల్లెడలా ఆనందం (ఫొటోలు)
-
Balkampet Yellamma: బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్తు కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్యూలైన్ల కోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. సోమవారం ఉదయం వేదపండితులు మంత్రోశ్చరణల నడుమ ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఎస్.అన్నపూర్ణ తెలిపారు. సాయంత్రం సాంప్రదాయ బద్దంగా ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుంది. బందోబస్తు నిమిత్తం 500 మంది సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. అమీర్‌పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రూ.5 లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా తయారు చేయించారు. చదవండి: Hyderabad: కారు దిగిన మేయర్.. కాంగ్రెస్‌లో చేరిక -
జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
సాక్షి, హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జులై 5న నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో గురువారం బల్కంపేట అమ్మవారి ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన బంగారంలో రెండున్నర కిలోల బంగారంతో బోనం తయారు చేయించనున్నట్లు చెప్పారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, సీఈ సీతారాములు, ఈఓ అన్నపూర్ణ, దేవాదాయ శాఖ స్తపతి వల్లి నాయగం, జోనల్ కమిషనర్ రవికిరణ్, వాటర్‌వర్క్స్ జీఎం హరిశంకర్, ఆలయ ట్రస్టీ సాయిబాబాగౌడ్, కమిటీ సభ్యులు అశోక్‌యాదవ్, హనుమంతరావు, ఉమానాథ్‌గౌడ్, బలరాం, శ్రీనివాస్‌గుప్తా, నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: ప్రయాణికులకు మెట్రో రైలు బంపర్ ఆఫర్) -
ఎల్లమ్మ తల్లీ.. నీవే మా కల్పవల్లి
అమీర్‌పేట: పండుటాకులు.. నిండు ముత్తైదువలు.. వేపకొమ్మలు చేబూని.. పసుపు కుంకుమలను ముఖాలకు పూసుకుని మురిసిపోయారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లిని తనివితీరా తలుచుకుని తన్మయత్వం పొందారు. అమ్మవారి పట్ల తమకున్న అవ్యాజమైన భక్తిని చాటుకున్నారు. పసుపు, కుంకుమలతో కలకాలం చల్లంగా ఉండాలని, నగర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మంగళవారం అమీర్‌పేటలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో కనిపించిన ఈ దృశ్యం భక్తులను అమితంగా అబ్బురపరిచింది. ఉదయం 11.గంటల 11 నిమిషాలకు అమ్మవారి కల్యాణం జరిగింది. ఎల్లమ్మ తల్లికి రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. బల్కంపేట ఎల్లమ్మకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు తీసుకువస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పులకించిన ‘బల్కంపేట’ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం మంగళవారం మంగళవాద్యాలతో, వేద మంత్రోచ్చారణలతో నేత్రపర్వంగా జరిగింది. భక్తులు అమ్మవారి కల్యాణాన్ని వీక్షించి పులకించారు. వేడుకల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్‌కుమార్, దైవజ్ఞ శర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్య, కార్పొరేటర్లు సరళ, కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, ఆలయ ఈఓ ఎస్.అన్నపూర్ణ, చైర్మన్ సాయిబాబాగౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు. -
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం
-
కమనీయం.. అమ్మవారి కల్యాణం