తమ అభిమాన తారలకు సంబంధించిన అలవాట్లు, అభిరుచులు, వస్తువులు.. ఇలా వేటినైనా తెగ ఇష్టపడుతుంటారు డై హార్డ్ ఫ్యాన్స్. వారు వాడే యాక్సెసరీల నుంచి ఆటోగ్రాఫ్ చేసిన పేపర్ వరకు ఏది దొరికినా వాటిని మధుర జ్జాపకంగా పదిలంగా దాచుకుంటారు. ఇప్పటి వరకు స్టార్స్ తమ వాచ్‌లు, షర్ట్స్, బైక్‌లు వంటి వస్తువలను వేలంలో అమ్మి డబ్బులు సంపాదించిన ఘటనలు ఎన్నో చూశాం కానీ ఓ టీవీ స్టార్ తన అపాన వాయువును (పిత్తు) అమ్మి లక్షల్లో ఆదాయం గడిస్తుందంటే నమ్ముతారా.. నిజమేనండి. బహిరంగంగా మాట్లేందుకు ఇబ్బందిగా ఫీల్ అయ్యే అపానవాయువుతో డబ్బులు కూడా సంపాదిస్తున్నానని స్టెఫానీ మాటో అనే టీవీ ఆర్టిస్ట్ చెప్పడం వైరల్‌గా మారింది.
90డే ఫియాన్స్ అనే టీవీ షో ద్వారా స్టెఫానీ మట్లో సోషల్ మీడియాలో తెగ పాపులారిటీని సంపాదించింది. అయితే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో తన అపానవాయువును అమ్మే బిజినెస్‌ను ప్రారంభించింది. ఆ వాయువును అమ్ముతూ వారానికి ఏకంగా 70 వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 53 లక్షల రూపాయలను ఆమె సంపాదిస్తోంది. ఈ విషయాన్ని స్టెఫానీ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.
చదవండి: హృదయ విదారకం.. చనిపోయిన తల్లి ఫోటోతో వధువు కన్నీళ్లు
తన అపానవాయువును ఓ గాజు పాత్రలో వేసి ఒక్కో యూనిట్‌ను 1,400 డాలర్లకు (సుమారు లక్ష) తన అభిమానులకు ఆన్‌లైన్‌లో అమ్ముకుంటుంది. దీనికి సంబంధించిన వీడియోలను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేస్తూ అపానవాయువును అమ్మడం ద్వారా డబ్బు ఎలా సంపాదిస్తుందో పేర్కొంది. అలాగే అపానవాయువు బయటకు రావడం కోసం తాను ఎలాంటి ఫుడ్ తీసుకుంటుందో వివరించింది. వీడియోలో బీన్స్, ప్రోటీన్ మఫిన్, గట్టిగా ఉడికించిన గుడ్లు, ప్రోటీన్ షేక్, పెరుగు చూపిస్తుంది.
ఇంతకూ గబ్బు లేపే అపానవాయువును కొనేదెవరు? ఈ సోది ఏంటి అనేగా మీ సందేహం. రెండు రోజుల్లోనే ఆమె 90 జార్లు అమ్మేసిందంటే... వాటికి ఎంత డిమాండ్ ఉందో ఆలోచించండి. తను అపానవాయువు పంపే గాజు పాత్రలో పూల రేకులు పెట్టడంతో అది సువాసన భరితంగా ఉంటుందని ఆమె తెలిపింది. వీటికి తోడు ఓ నోట్ కూడా రాసి పంపుతోంది. ఇంకేముంది అభిమాన తార నుంచి అపురూప కానుక అంటూ ఫ్యాన్స్ వేలకు వేలు పోసి కొనుక్కుంటున్నారు.
చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..
బజ్‌ఫీడ్ అనే మీడియా కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టెఫానీ మాట్లాడుతూ.. ‘అపానవాయువు అమ్ముకోవడం నాకు తగిన పని అని అనిపించింది. అంతేగాక కొంచెం ఫన్నీగా, డిఫరెంట్‌గా ఫీల్ అయ్యాను. ఇది కొత్త ఉపాధి కూడా’ అని ఆమె పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment