
అత్యంత శక్తిమంతమైన సెలబ్రిటీగా షారుక్ ఖాన్
న్యూఢిల్లీ: పోర్బ్స్ ఇండియా అత్యంత శక్తిమంతమైన సెలబ్రిటీగా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ నిలిచారు. కాగా, ఆ సంస్థ ప్రకటించిన టాప్ 100 జాబితాలో కింగ్‌ఖాన్ ప్రథమ స్థానంలో నిలవడం ఇది వరుసగా రెండోసారి కావడం విశేషం. ఈ ఏడాది విడుదలైన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా సూపర్‌హిట్ కావడం, భారీగా కలెక్షన్లు రాబట్టడం ఖాన్‌కు కలిసొచ్చింది. ఇక గతేడాది మూడో స్థానంలో ఉన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ ఏడాది రెండో స్థానానికి ఎగబాకారు. మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక స్థానం దిగజారి మూడోస్థానంలో నిలిచారు.
నాలుగో స్థానంలో సచిన్ టెండూల్కర్, ఐదో స్థానంలో అమితాబ్ బచ్చన్ నిలిచారు. నటులు అక్షయ్ కుమార్ 6వ స్థానం, రణ్‌బీర్ కపూర్ 8వ స్థానం, హృతిక్ రోషన్ 10వ స్థానం దక్కించుకున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి కత్రినాకైఫ్ కూడా టాప్ టెన్‌లో చోటు పొందారు. కాగా, గతేడాది ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయిన నటుడు కమల్‌హాసన్ ఈ ఏడాది 47వ స్థానంలో నిలవడం విశేషం. నటి శ్రీదేవికి 73వ స్థానం దక్కింది.