
ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనిషి.. పరిష్కారం కోసం షార్ట్‌కట్‌ను ఆశ్రయిస్తాడు. కానీ, ఆ షార్ట్‌కట్ కోసం ప్రయత్నించే క్రమంలోనే ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది!. అలా కష్టపడేవాళ్లను చూసి జాలిపడే కుర్రాడే ఖబి లామె. ఫేస్బుక్లో ఎక్కడో ఒక దగ్గర మీమ్‌గా, కామెంట్ సెక్షన్లో ఫొటోగా కనిపించి నవ్వులు పూయించే ఖబి.. ఇప్పుడు ఇంటర్నెట్ సెలబ్రిటీగా వరల్డ్ ఫేమస్ అయ్యాడు.
ఖబి లామె.. పాపులర్ టిక్‌టాకర్. ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా తన చేష్టలతోనే నవ్వించే వ్యక్తి. ఇటలీకి చెందిన ఈ 21 ఏళ్ల కుర్రాడి దృష్టిలో లైఫ్ హ్యాక్స్ అంటే పనికిరాని విషయం. రోజూవారీ పనుల్లో అవాంతరాలు ఎదురైనప్పుడు టిప్స్ లాగా లైఫ్ హ్యాక్స్(మన దగ్గర జుగాద్) పనికొస్తాయంటారు. అయితే వాటివల్ల తాత్కాలిక ఉపశనమే ఉంటుందని, అవి అనవసరమైనవని అతని ఉద్దేశం. సుఖం కోసం కష్టపడడం ఎందుకు? మామూలు ప్రయత్నాలు ఉంటాయి కదా అంటాడతను.
కారులో టీషర్ట్ ఇరుక్కుపోతే దానిని కత్తెరతో కట్ చేయాలని వ్యూయర్స్‌కి సలహా ఇచ్చే లైఫ్ హ్యాకర్స్.. సింపుల్‌గా డోర్ తీస్కోమని చెప్పొచ్చు కదా అని అతని స్టైల్లో అడుగుతున్నాడు ఖబి. టిక్‌టాక్‌లోనే కాదు.. అది బ్యాన్ ఉన్న మనలాంటి దేశంలో అభిమానులకు నవ్వులు పంచేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వీడియోలు అప్లోడ్ చేస్తుంటాడు ఖబి.
ఖబీ పుట్టి వెస్ట్ ఆఫ్రికాలోని సెనెగల్‌లో. పెరిగింది మాత్రం ఇటలీలోని చివాస్సో. చదువుతోంది గ్రాడ్యుయేషన్. వీడియో గేమర్గా సంపాదిస్తున్నాడు కూడా. ఏడాది క్రితం వరకు ఇతను ఒక మామూలు వ్యక్తి. లాక్‌డౌన్‌తో టిక్‌టాక్‌లో అడుగుపెట్టాడు. ఇప్పుడు ఇతను ఒక ఈ-సెలబ్రిటీ. టిక్‌టాక్‌లో ఐదున్నర కోట్లకు పైనే ఫాలోవర్స్ ఉన్నారు.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి 70 లక్షలకుపైనే ఫాలోయింగ్ ఉంది. వీడియోలో అతని హావభావాలే అతన్ని వైరల్ సెలబ్రిటీని చేశాయి. బెస్ట్ ఫ్రెండ్ జైరా నక్కీతో ఖబి రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఖబి మంచి మనసున్నోడు కూడా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సంపాదించే దాంట్లో సగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు అతను.
Comments
Please login to add a commentAdd a comment