
సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదిప్పుడు. అందుకే రోటీన్‌కు భిన్నంగా ఆలోచన చేస్తున్నారు కొందరు. అయితే.. తన గాత్రానికి హవభావాల్ని జోడిస్తూ భక్తిరసాన్ని వొలికిస్తూ .. పాపులారిటీ సంపాదించుకుంది శ్రీ నవల్ కిషోరీ Shree Naval Kishori.
పట్టుమని 20 ఏళ్లు కూడా లేని ఈ అమ్మాయి.. గత ఏడాది జూన్‌లో సోషల్ మీడియాలో అడుగుపెట్టింది. సంప్రదాయ దుస్తులు.. నుదట నామాలు ధరించి భక్తి పాటలే ప్రధానంగా ఆమె వీడియోలు చేస్తోంది.
అలా ఏడాది తిరగకముందే ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్, ఇతరత్రా ఫ్లాట్‌ఫామ్స్‌లో పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే.. మ్యూజికల్ యాప్స్‌తోనూ అలరిస్తోంది.
నార్త్-సౌత్ తేడా లేకుండా.. అన్ని ప్రాంతాల నుంచి నెటిజన్లు ఈ యంగ్ డివోషనల్ సింగర్‌ను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఉదయం నుంచి ఆమె అప్‌లోడ్ చేసే ప్రతీ వీడియోకు లక్షల్లో లైకులు, వ్యూస్.
శ్రీ నవల్ క్రేజ్ ఇక్కడితోనే ఆగిపోలేదు. తనను అనుసరిస్తూ అనుకరించి వీడియోలు చేస్తున్న వాళ్లను సైతం ఆమె ఎంకరేజ్ చేస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment