ఈ పొటోలో కనిపిస్తున్న పిల్లిని చూశారు కదా! భలే బొద్దుగా ముద్దుగా ఉంది కదూ! ఇది పోలండ్‌లోని స్కజేషిన్ నగరంలో ఉంటుంది. ఈ పిల్లి అక్కడ చాలా ఫేమస్. జర్మనీ సరిహద్దుల్లో ఉండే పురాతన నగరమైన స్కజేషిన్‌లో ఈ పిల్లి పర్యాటక ఆకర్షణగా మారింది. స్థానికులు ఈ పిల్లికి ‘గకేక్’ అని పేరు పెట్టుకున్నారు. స్కజేషిన్ నగరం శివార్లలోని కస్జుబ్‌స్కా ప్రాంతంలో పదేళ్ల కిందట ఇది తొలిసారిగా కనిపించింది.
అప్పటి నుంచి ఇది అదే వీథిని తన నివాసంగా చేసుకుని, ‘కింగ్ ఆఫ్ కస్జుబ్‌స్కా స్ట్రీట్’గా పేరు పొందింది. స్కజేషిన్ నగరానికి వచ్చే పర్యాటకులు నగరంలోని మ్యూజియం, పార్కులు, ఇతర పర్యాటక కేంద్రాలను చూడటంతో పాటు ఈ పిల్లిని కూడా ప్రత్యేకంగా చూసి, ఫొటోలు తీసుకుని వెళుతుండటం విశేషం.
చదవండి: Anjali Sood: అత్తెసరు మార్కులు వచ్చే అమ్మాయి నుంచి సీఈఓగా.. లాభాల బాటలో..
Comments
Please login to add a commentAdd a comment