మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి 'నిహారిక కొణిదెల' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లి తెరమీద, వెండి తెర మీద తనదైన రీతిలో ప్రేక్షలకులను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు పెళ్లి తరువాత వెబ్ సిరీస్ వంటివి చేస్తూ బాగానే సంపాదిస్తోంది. ఇంతకీ నిహారిక ఆస్తులు విలువ ఎంత? ఆమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
1993 డిసెంబర్ 18 న జన్మించిన నిహారిక హైదరాబాద్ సెయింట్ మెరీన్ కాలేజీలో చదువుకుంది. చదువు పూర్తయిన తరువాత టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి ఢీ జూనియర్ వంటి వాటికి హోస్ట్‌గా వ్యవహరించి ఒక మనసు సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టింది. ఈమె తమిళ వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది.
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ప్రారంభించింది. కొన్ని నివేదికల ప్రకారం ఈమె మొత్తం ఆస్తుల విలువ 2020 నాటికి 4 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 కోట్ల కంటే ఎక్కువ. ఈమె ఒక్కో సినిమాకి సుమారు రూ. 25 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేది కూడా చెబుతున్నారు.
నిహారిక హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో నివసించేది, ఆమెకు సొంతంగా జర్మన్ లగ్జరీ బ్రాండ్ ఆడి కారు కూడా ఉంది. అయితే ఈమె వివాహం 2020లో చైతన్య జొన్నల గడ్డతో రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన చైతన్య బిట్స్ పిలానీ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో గ్రాడ్యుయేషన్ & పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు. ఇతడు 2018లో 'ది హరికేన్స్' అనే సొంత కంపెనీని ప్రారంభించాడు.
చైతన్య జొన్నల గడ్డ ప్రస్తుతం మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూనే నెస్లే, ఐబిఎమ్, ఎయిర్‌టెల్ అంటి అనేక ఇతర ప్రసిద్ధ భారతీయ కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు కూడా సమాచారం. వీటి కుటుంబ ఆస్తుల విలువ కూడా కోట్లలో ఉంది. కాగా ఇటీవల నిహారిక పింక్ ఎలిఫేంట్ అనే ప్రొడక్షన్ కోసం కొత్త ఆఫీస్ కూడా ప్రారంభించింది, ఈ ఆఫీస్ ప్రారంభానికి చైతన్య రాకపోవడం గమనార్హం. మొత్తం మీద బుల్లితెర నుంచి కోట్లు సంపాదించేవరకు ఎదిగింది కొణిదెల నిహారిక.
Comments
Please login to add a commentAdd a comment