సాధారణంగా ధనవంతులు విలాసవంతమైన జీవితం గడుపుతారని దాదాపు అందరికి తెలుసు. అయితే కొంతమంది దీనికి భిన్నంగా పొలంగా వ్యవసాయం చేస్తారు, రోడ్డుపై కూరగాయలు అమ్ముతారు. ఇలాంటి సంఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇటీవల వెరైటీ ఫార్మర్ (variety_farmer) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పేజీలో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన ఆడి కారులో వచ్చి.. రోడ్డు పక్కన ఆకుకూర అమ్మడం చూడవచ్చు. ఈ వీడియో చూడగానే కొందమందికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇది నిజమే. ఆధునిక కాలంలో చాలామంది యువకులు వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు వీడియోలో కనిపించే వ్యక్తి.
ఈ వీడియోలో కనిపించే వ్యక్తి ఆడి కారులో వచ్చి ఒక దుకాణం ముందు ఆగాడు. ఆ తరువాత అక్కడే పక్కన ఉన్న ఆటో రిక్షా వద్దకు వెళ్లి ఆకు కూరని రోడ్డుపక్కన ప్లాస్టిక్ షీట్ మీద వేస్తాడు. మొత్తం అమ్మేసిన తరువాత ప్లాస్టిక్ షీట్ మడిచి ఆటోలో పెట్టుకుని మళ్ళీ తన కారు ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్‌లో 5 లక్షల ఉద్యోగాలు!
ఈ యువ రైతు పేరు సుజిత్. కేరళకు చెందిన ఈయన గత 10 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ఆవార్డులను కూడా అందుకున్నాడు. యితడు అందరు రైతుల మాదిరిగానే వ్యవసాయం ప్రారంభించి కరంగా పురోగతి సాధించాడు. వచ్చిన లాభాలతోనే ఆడి కారు కొన్నట్లు తెలిపాడు. ఈ కారు ధర రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment