Vegatables
-
ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో
సాధారణంగా ధనవంతులు విలాసవంతమైన జీవితం గడుపుతారని దాదాపు అందరికి తెలుసు. అయితే కొంతమంది దీనికి భిన్నంగా పొలంగా వ్యవసాయం చేస్తారు, రోడ్డుపై కూరగాయలు అమ్ముతారు. ఇలాంటి సంఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల వెరైటీ ఫార్మర్ (variety_farmer) అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పేజీలో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన ఆడి కారులో వచ్చి.. రోడ్డు పక్కన ఆకుకూర అమ్మడం చూడవచ్చు. ఈ వీడియో చూడగానే కొందమందికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇది నిజమే. ఆధునిక కాలంలో చాలామంది యువకులు వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు వీడియోలో కనిపించే వ్యక్తి. ఈ వీడియోలో కనిపించే వ్యక్తి ఆడి కారులో వచ్చి ఒక దుకాణం ముందు ఆగాడు. ఆ తరువాత అక్కడే పక్కన ఉన్న ఆటో రిక్షా వద్దకు వెళ్లి ఆకు కూరని రోడ్డుపక్కన ప్లాస్టిక్ షీట్ మీద వేస్తాడు. మొత్తం అమ్మేసిన తరువాత ప్లాస్టిక్ షీట్ మడిచి ఆటోలో పెట్టుకుని మళ్ళీ తన కారు ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు! ఈ యువ రైతు పేరు సుజిత్. కేరళకు చెందిన ఈయన గత 10 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ఆవార్డులను కూడా అందుకున్నాడు. యితడు అందరు రైతుల మాదిరిగానే వ్యవసాయం ప్రారంభించి కరంగా పురోగతి సాధించాడు. వచ్చిన లాభాలతోనే ఆడి కారు కొన్నట్లు తెలిపాడు. ఈ కారు ధర రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది. View this post on Instagram A post shared by variety farmer (sujith) (@variety_farmer) -
కూరగాయల సాగుతో ఇద్దరు పిల్లల్ని డాక్టర్స్ ని చేసిన దంపతులు
-
దిగొచ్చిన కోడి
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: నెల రోజుల క్రితం చుక్కలనంటిన చికెన్ ధరలు ప్రస్తుతం సగానికి పడిపోయాయి. మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుండగా చికెన్ మాత్రం చీప్‌గా మారింది. నెల రోజుల క్రితం కిలో చికెన్ రూ 180 ఉండగా ప్రస్తుతం రూ 88కు పడిపోయింది. చికెన్ ప్రియులను తగ్గిన ధరలు ఆనందంలో ముంచినా బ్రాయిలర్ వ్యాపారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పెరిగిన దాణా ఖర్చులకు.. పడిపోతున్న చికెన్ ధరలకు కనీసం పొంతన లేకుండా పోతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో చికెన్ ఉత్పత్తికి దాణాతో పాటు మొత్తం రూ 70 ఖర్చవుతుండగా ప్రస్తుతం కోడిని కిలో 55రూపాయలకే విక్రయిస్తున్నారు. కార్తీకమాసపు పూజల ప్రభావం చికెన్ ధరలపై పడింది. ప్రతి యేటా నవంబర్, డిసెంబర్ మాసాల్లో చికెన్ ధరలు తగ్గుదల సాధారణమే అయినా ఈసారి మాత్రం భారీగా తగ్గాయి. ఆకాశన్నంటుతున్న కూరగాయలు చికెన్ ధరలు ఓ వైపున తగ్గుతుండగా కూరగాయల ధరలు మాత్రం ఆకాశన్నంటుతున్నాయి. దొండకాయల ధర చికెన్‌కు పోటీగా ఉంది. కిలో దొండకాయలు రూ 80కు విక్రయిస్తున్నారు. అలుగడ్డ కిలో రూ 40, బెండకాయలు కిలో రూ 40, బీరకాయలు కిలో రూ 40, పచ్చిమిర్చి కిలో రూ 50, గోకరకాయ కిలో రూ 50కు విక్రయిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. దీంతో హైదరాబాద్, విజయవాడ నుంచి దిగుమతి అయ్యే కూరగాయలకు ధరలు పెరిగాయి. దానికి తోడు కార్తీకమాసంలో కూరగాయల వాడకం ఎక్కువగా ఉండడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా నిలిచింది.