ప్రముఖుల కొత్త సంవత్సర
Published Wed, Jan 1 2014 3:45 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా ప్రజలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరి శీలకుడు పిరియా సాయిరాజ్‌లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం జిల్లా ప్రజలకు అన్ని విధాలా శుభప్రదం కావాలని, అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాల న్నారు. 2013లో ప్రకృతి బీభత్సాలు, ఉద్యమాలతో ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని, 2014లో ప్రజలకు అంతామంచే జరగాలని కోరారు.
ప్రగతిపథంలో నడవాలి
శ్రీకాకుళం కలెక్టరేట్: కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్లశాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది జిల్లా వాసులంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వైద్య విద్యాశాఖామంత్రి కోండ్రు మురళీమోహన్, రాష్ట్ర అటవీశాఖఆమంత్రి శత్రుచర్లు విజయరామరాజు, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు. 2014 సంవత్సరంలో ప్రజలు అభివృద్ధి పథంలో పయనించాలన్నారు.
‘మంచిపాలన అందించే ప్రభుత్వం రావాలి’
శ్రీకాకుళం సిటీ: ప్రజలకు మంచి పరిపాలన అందించే ప్రభుత్వం కొత్త సంవత్సరంలో రావాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Advertisement
Advertisement